Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  9. నవమాధ్యాయము : రాజవిద్యారాజగుహ్యయోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  జ్ఞాన మెద్దాని విజ్ఞాన సహితముగను,
  తెలిసి కొన్నను నశుభముల్ తొలగునన్ని,
  గుహ్యతమమైన దానిని గూర్చి యిపుడు,
  తెలియ జెప్పుదు నీకు వి ద్వేష రహిత
 
 
 2.  
  రాజగుహ్య మాత్మజ్ఞాన రాజవిద్య,
  పరమపావన మిది, దృష్ట ఫలముగలది,
  ఉత్తమంబును, ధర్మ సం యుక్తమైన
  దాచరింపగ సుఖమైన దవ్యయంబు
 
 
 3.  
  అట్లు విజ్ఞాన ధర్మమై యలరు దాని
  విశ్వసింపని పురుషులు వెడగమతులు,
  పడయ జాలక, పరమ సం ప్రాప్యు నన్ను,
  మృత్యుసంసార పథముల మెట్టుచుంద్రు
 
 
 4.  
  పార్థ! మామకావ్యక్త రూ పంబు చేత,
  వ్యాప్తమైయుంటి నీ జగ మంత నేనె,
  సర్వ భూతములుండు నా స్థాన మందె,
  కాని, నే నాశ్రయించి య వ్వాన లేను
 
 
 5.  
  లేవు నాయందు భూతము లేవి గాని,
  భూతహేతువునై వృద్ధి జేతు వాని,
  వాని భరియింతు కాని నేవాన లేను,
  కాంచు మిది మామకీన యో గైశ్వరమును
 
 
 6.  
  సతత మాకాశ మందున సంచరించు,
  నీమహావాయు వంటదో యెట్లు దాని,
  అంట జాలక భూతము లన్ని గూడ,
  వెలయునా లోన నట్టులే, తెలియు మీవు
 
 
 7.  
  భూతములు నెల్ల కుం తీసు పుత్ర నాదు
  ప్రకృతిని గలయుచుండు క ల్పాంతమందు,
  మరల నవ్వాని నెల్ల నా మాయ చేత,
  వఱల సృష్టిని జేతు క ల్పాది యందు
 
 
 8.  
  నాదు ప్రకృతిని నాయధీ నమున నుంచి
  వాసనల చేత ప్రకృతికి వశ్యమైన,
  యిందుగల భూతజాలము నెల్లపార్థ!
  మాటి మాటికి జేతు నే మహిత సృష్టి
 
 
 9.  
  కర్మకర్తృత్వమును, ఫలా కాంక్ష లేక,
  యూరక నుపేక్షకుని భంగి నుండు నన్ను,
  సృష్టి లయముల కర్జునా! హేతువైన,
  కర్మపాశము లేవియు కట్టలేవు
 
 
 10.  
  సాక్షిమాత్రుడ, నాయధి వీక్షణమున,
  యీ చరాచర సృష్టి ప్ర కృతియె సల్పు,
  ఇట్టి హేతువు చేతనే బుద్ధ చరిత!
  వివిధరూపములై పర్వు విశ్వ మెల్ల
 
 
 11.  
  సర్వభూతములకు మహే శ్వరుడ నేను,
  మనుజశారీర ధారి నై మసలు చుంట,
  పరమరూపము నాది వా రరయ లేక,
  లెక్క సేయరు భువి నన్ను వెక్కలీండ్రు
 
 
 12.  
  వ్యర్థకాములు, వ్యర్థ క ర్మాభి రతులు,
  నిష్ఫలజ్ఞానులును, గడు నీచమతులు
  అసుర రాక్షస భావము లాశ్రయించి,
  అవగణింతురు నన్ను మో హమును బొంది
 
 
 13.  
  కాని, నన్ను మహాత్ములు కౌరవేంద్ర!
  అమల దైవస్వభావము నాశ్రయించి
  అవ్యయుడ భూతముల కాది నని, గ్రహించి,
  ఇతర చింతన లేక భ జింత్రు నన్నె
 
 
 14.  
  సతత సంకీర్తనము నన్ను సలుపు వారు,
  చేరగా నన్ను ధృఢయత్న శీలురగుచు
  భక్తితో నాకు బ్రీతిమై ప్రణతు లిడుచు,
  నిత్యమును పర్యుపాసింత్రు నిష్ఠతోడ
 
 
 15.  
  జ్ఞానయజ్ఞము చేత నొ క్కరుడ ననియు,
  భిన్నదేవతామూర్తులవెలయు దనియు,
  బహువిధంబుల కొందఱు భక్తి తోడ,
  పూజ యొనరింత్రు విశ్వతో ముఖుని నన్ను
 
 
 16.  
  నేనె క్రతువును యజ్ఞము నేనె సుమ్ము,
  నేనె స్వధయును నౌషధ మైన నేనె,
  యజ్ఞమంత్రము నేనె యా జ్యంబు నేనె,
  అగ్నియును వేల్చుహోమము లైన నేనె
 
 
 17.  
  తండ్రి నే పార్థ! యీ జగ త్సంత తికిని,
  తల్లియును, కర్మఫలదాత తాత నేను,
  వేద్యమును, ప్రణవమును, ప విత్రమేను,
  ఋగ్యజుస్సామ వేదము లెల్ల నేను
 
 
 18.  
  ప్రభుడ, సాక్షిని, గతియును, భర్త నేను,
  శరణమును, సుహృదుడ, నివా సమును నేను,
  జగతి కుత్పత్తి విలయ సం స్థాన మేను,
  పెన్నిధిని నేన, యవ్యయ బీజ మేన
 
 
 19.  
  వెలయ గాయింతు నెండ నీ విశ్వమంత,
  జలము గ్రహియింతు, నిత్తు వ ర్షముల నేను
  మృత్యువైనను నేనె, య మృతము నేనె,
  అర్జునా! నేనె సదసత్తు లైన వెల్ల
 
 
 20.  
  సోమపానపునీతులు శ్రోత్రియులును,
  స్వర్గ మర్థించి కొల్చి య జ్ఞముల నన్ను,
  పుణ్యఫలమైన స్వర్లోక మునకు నేగి,
  అమరభోగములను దివి ననుభవింత్రు
 
 
 21.  
  విపుల సురభోగములను సే వించి వారు,
  క్షీణ పుణ్యులునై తిర్గి క్షితికి వత్త్రు,
  ఇట్లు వేదధర్మము లాశ్ర యించు నట్టి,
  కామ్యకర్ము లీ రాక పోకల చరింత్రు
 
 
 22.  
  అన్యచింతన సేయక ననవరతము,
  ఏ జనులు నన్ను పర్యుపా సించు చుంద్రొ,
  నిత్యమట్లు సమాధిలో నిలుచువారి
  యోగసంక్షేమముల బూని యుందు నేను
 Play This Verse
 
 23.  
  అన్యదేవతాభక్తులే యైన గాని,
  శ్రద్ధతో పూజ లెవ్వరు సలుపు వారొ,
  వారలును గూడ కుంతీ కు మార నన్నె,
  పూజగొను వారె విధిహీన పూర్వకముగ
 
 
 24.  
  సకలయజ్ఞకర్మములకు సాక్షి నేను,
  భోక్తయును నేనె, మఱియు ప్ర భుండ నేనె
  వారు నాతత్త్వ మెఱుగకు న్నారు గాన,
  కూలు చుందురు సంసార కూపమందు
 
 
 25.  
  దేవతల జేరుకొందురు దేవయజులు,
  పితరులను జేరుకొందురు పితరయజులు,
  భూతముల జేరుకొందురు భూతయజులు,
  నాదు భక్తులు వత్తురు నన్నె చేర
 
 
 26.  
  పత్రమో, పుష్పమో, లేక ఫలమొ, జలమొ,
  భక్తితో నాకు నెవ్వ డ ర్పణము సేయు,
  నట్టి శుద్ధాత్మ భక్తి స మర్పితమును,
  అరమరలు లేక నే బ్రీతి నారగింతు
 
 
 27.  
  ఎట్టి కర్మము సేయుదో యేది తినెదొ
  ఏది వేల్తువో, యే దాన మిచ్చుచుందొ,
  ఎట్టి తప మాచరింతువో యుద్ధచరిత!
  అట్టి వెల్ల నాకిమ్ము బ్ర హ్మార్పణమని
 
 
 28.  
  కలుగు నీ శుభాశుభ కర్మ ఫలము లనెడు
  బంధముల నుండి మోక్షము బడసి యిట్లు
  కర్మసన్యాస యోగ యు క్తాత్ముడవయి,
  పొందెదవు నన్నె కర్మ వి ముక్తి బొంది
 
 
 29.  
  సర్వభూతములందు నే సమత నుందు,
  లేడు ద్వేషియు మఱి నాకు లేడు ప్రియుడు,
  భక్తితో నన్ను భజియించు వార లెవరొ,
  వారలం దుందు నాయందు వార లుంద్రు
 
 
 30.  
  ఎట్టి దుర్మార్గుడైన కా నిమ్ము వాడు
  ఎవ్వ డనితరభక్తి సే వించు నన్ను
  సాధువే యని వాని నెం చంగ వలయు,
  అతడు నిశ్చయ బుద్ధితో నలరు గాన
 
 
 31.  
  ఆ దురాచారి పరగ ధ ర్మాత్ము డగుచు,
  శాశ్వతంబైన శాంతిని చక్క బొందు,
  నాదు ప్రియభక్తు డెన్నడు నష్టపడడు
  తెలియు మిది నా ప్రతిజ్ఞ కుం తీ కుమార!
 
 
 32.  
  పాపసంభవులైన పా పాత్ములైన
  స్త్రీలు, వైశ్యులు, శూద్రజా తీయులైన,
  నెవ్వరేనియు,నన్నాశ్రయించు చుంద్రొ
  వారలును గూడ కొందు రా పరమపదము
 
 
 33.  
  వారి నిట్లన, పుణ్యుల బ్రాహ్మణులను
  భక్తరాజర్షులను గూర్చి పలుక నేల,
  క్షణికమౌ నిట్టి యసుఖ లో కమున నీవు,
  పుట్టియును నన్ను భజియించి పొంద గలవు
 
 
 34.  
  నన్నె మదినిల్పు,భక్తిమైనన్నె కొల్చుడీ,
  నన్నె పూజింపు సాగిలినన్నె మ్రొక్కు
  మత్పరత నాత్మ నిట్లు స మాధి లోన,
  చేర్చి యుంచుము, యిక నన్నె చేర గలవు
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  ఇదం తు తే గుహ్యతమం
   ప్రవక్ష్యామ్యనసూయవే
  జ్ఞానం విజ్ఞానసహితం
   యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ౯
 
 
 2.  
  రాజవిద్యా రాజగుహ్యం
  పవిత్రమిదముత్తమమ్
  ప్రత్యక్షావగమం ధర్మ్యం
   సుసుఖం కర్తుమవ్యయమ్ ౯
 
 
 3.  
  అశ్రద్దధానాః పురుషా
   ధర్మస్యాస్య పరన్తప
  అప్రాప్య మాం నివర్తన్తే
  మృత్యుసంసారవర్త్మని ౯
 
 
 4.  
  మయా తతమిదం సర్వం
   జగదవ్యక్తమూర్తినా
  మత్స్థాని సర్వభూతాని
   న చాహం తేష్వవస్థితః ౯
 
 
 5.  
  న చ మత్స్థాని భూతాని
  పశ్య మే యోగమైశ్వరమ్
  భూతభృన్న చ భూతస్థో
  మమాత్మా భూతభావనః ౯
 
 
 6.  
  యథాకాశస్థితో నిత్యం
   వాయుః సర్వత్రగో మహాన్
  తథా సర్వాణి భూతాని
   మత్స్థానీత్యుపధారయ ౯
 
 
 7.  
  సర్వభూతాని కౌన్తేయ
   ప్రకృతిం యాన్తి మామికామ్
  కల్పక్షయే పునస్తాని
  కల్పాదౌ విసృజామ్యహమ్ ౯
 
 
 8.  
  ప్రకృతిం స్వామవష్టభ్య
   విసృజామి పునః పునః
  భూతగ్రామమిమం కృత్స్న
  మవశం ప్రకృతేర్వశాత్ ౯
 
 
 9.  
  న చ మాం తాని కర్మాణి
   నిబధ్నన్తి ధనంజయ
  ఉదాసీనవదాసీన
  మసక్తం తేషు కర్మసు ౯ ౯
 
 
 10.  
  మయాధ్యక్షేణ ప్రకృతిః
  సూయతే సచరాచరమ్
  హేతునానేన కౌన్తేయ
   జగద్విపరివర్తతే ౯ ౦
 
 
 11.  
  అవజానన్తి మాం మూఢా
  మానుషీం తనుమాశ్రితమ్
  పరం భావమజానన్తో
  మమ భూతమహేశ్వరమ్ ౯
 
 
 12.  
  మోఘాశా మోఘకర్మాణో
  మోఘజ్ఞానా విచేతసః
  రాక్షసీమాసురీం చైవ
   ప్రకృతిం మోహినీం శ్రితాః ౯
 
 
 13.  
  మహాత్మానస్తు మాం పార్థ
   దైవీం ప్రకృతిమాశ్రితాః
  భజన్త్యనన్యమనసో
  జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ౯
 
 
 14.  
  సతతం కీర్తయన్తో మాం
   యతన్తశ్చ దృఢవ్రతాః
  నమస్యన్తశ్చ మాం భక్త్యా
   నిత్యయుక్తా ఉపాసతే ౯
 
 
 15.  
  జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
   యజన్తో మాముపాసతే
  ఏకత్వేన పృథక్త్వేన
  బహుధా విశ్వతోముఖమ్ ౯
 
 
 16.  
  అహం క్రతురహం యజ్ఞః
  స్వధాహమహమౌషధమ్
  మన్త్రోఽహమహమేవాజ్య
  మహమగ్నిరహం హుతమ్ ౯
 
 
 17.  
  పితాహమస్య జగతో
   మాతా ధాతా పితామహః
  వేద్యం పవిత్రమోంకార
   ఋక్సామ యజురేవ చ ౯
 
 
 18.  
  గతిర్భర్తా ప్రభుః సాక్షీ
   నివాసః శరణం సుహృత్
  ప్రభవః ప్రలయః స్థానం
   నిధానం బీజమవ్యయమ్ ౯
 
 
 19.  
  తపామ్యహమహం వర్షం
   నిగృహ్ణామ్యుత్సృజామి చ
  అమృతం చైవ మృత్యుశ్చ
   సదసచ్చాహమర్జున ౯ ౯
 
 
 20.  
  త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
  యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే
  తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక
  మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్ ౯ ౦
 
 
 21.  
  తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
  క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి
  ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
  గతాగతం కామకామా లభన్తే ౯
 
 
 22.  
  అనన్యాశ్చిన్తయన్తో మాం
   యే జనాః పర్యుపాసతే
  తేషాం నిత్యాభియుక్తానాం
  యోగక్షేమం వహామ్యహమ్ ౯
 Play This Verse
 
 23.  
  యేఽప్యన్యదేవతాభక్తా
   యజన్తే శ్రద్ధయాన్వితాః
  తేఽపి మామేవ కౌన్తేయ
  యజన్త్యవిధిపూర్వకమ్ ౯
 
 
 24.  
  అహం హి సర్వయజ్ఞానాం
   భోక్తా చ ప్రభురేవ చ
  న తు మామభిజానన్తి
   తత్త్వేనాతశ్చ్యవన్తి తే ౯
 
 
 25.  
  యాన్తి దేవవ్రతా దేవా
  న్పితౄన్యాన్తి పితృవ్రతాః
  భూతాని యాన్తి భూతేజ్యా
  యాన్తి మద్యాజినోఽపి మామ్ ౯
 
 
 26.  
  పత్రం పుష్పం ఫలం తోయం
   యో మే భక్త్యా ప్రయచ్ఛతి
  తదహం భక్త్యుపహృత
  మశ్నామి ప్రయతాత్మనః ౯
 
 
 27.  
  యత్కరోషి యదశ్నాసి
   యజ్జుహోషి దదాసి యత్
  యత్తపస్యసి కౌన్తేయ
   తత్కురుష్వ మదర్పణమ్ ౯
 
 
 28.  
  శుభాశుభఫలైరేవం
   మోక్ష్యసే కర్మబన్ధనైః
  సంన్యాసయోగయుక్తాత్మా
  విముక్తో మాముపైష్యసి ౯
 
 
 29.  
  సమోఽహం సర్వభూతేషు
   న మే ద్వేష్యోఽస్తి న ప్రియః
  యే భజన్తి తు మాం భక్త్యా
   మయి తే తేషు చాప్యహమ్ ౯ ౯
 
 
 30.  
  అపి చేత్సుదురాచారో
   భజతే మామనన్యభాక్
  సాధురేవ స మన్తవ్యః
   సమ్యగ్వ్యవసితో హి సః ౯ ౦
 
 
 31.  
  క్షిప్రం భవతి ధర్మాత్మా
   శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి
  కౌన్తేయ ప్రతి జానీహి
  న మే భక్తః ప్రణశ్యతి ౯
 
 
 32.  
  మాం హి పార్థ వ్యపాశ్రిత్య
   యేఽపి స్యుః పాపయోనయః
  స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽ
  పి యాన్తి పరాం గతిమ్ ౯
 
 
 33.  
  కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా
   భక్తా రాజర్షయస్తథా
  అనిత్యమసుఖం లోక
  మిమం ప్రాప్య భజస్వ మామ్ ౯
 
 
 34.  
  మన్మనా భవ మద్భక్తో
   మద్యాజీ మాం నమస్కురు
  మామేవైష్యసి యుక్త్వైవ
  మాత్మానం మత్పరాయణః ౯
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18