| |
| 1. ధృతరాష్ట్రుఁడనెను: |
| ధర్మ సుక్షేత్రమని, ధరా తలమునందు, |
| కీర్తి బడసిన మన కురు క్షేత్రమందు |
| కూడి, నా కుమారులు, పాండు కొమరులపుడు, |
| సంజయా! యెట్లు సమరము సల్పుచుండ్రి |
Play This Verse |
| |
|
| 2. సంజయుడనెను: |
| అపుడు, పాండవ బలములనచట జూచె |
| వ్యూహ మేర్పడియుండ దుర్యోధనుండు, |
| కురుకులాచార్యు,ద్రోణునికూడజేరి, |
| యిట్లనెను రాజు, ధృతరాష్ట్రనృపతి!వినుమ. |
|
| |
|
| 3. |
| చూడుమాచార్య! యిచ్చట కూడియున్న |
| పాండుపుత్రుల, మహనీయ బలములెల్ల, |
| మీదు శిష్యుడు ద్రుపద భూ మీశు సుతుడు, |
| వ్యూహముగ బన్నె బహుయుక్తి యుతుడు వాడు. |
|
| |
|
| 4. |
| కలరు శూరులు, బలు విలు కాండ్రు నచట |
| ఆలమందున సములు, భీ మార్జునులకు, |
| వాడె సాత్యకి, విరట భూ పాలుడాత, |
| డతడె ద్రుపదరాజన్య మ హారథుండు. |
|
| |
|
| 5. |
| చేకితానుండతడు, వాడె చేది విభుడు, |
| వీర్యవంతుడు, కాశి భూ విభు డతండు, |
| పురుజితుడు వీ, డచట కుంతి భోజుడుండె, |
| శైబ్య నరపుంగవుడు, వారి సమితి గలడు. |
|
| |
|
| 6. |
| కను డతని, యుధామన్యు, వి క్రాంతు నచట, |
| శూరు డందులో నుత్తమౌ జుండు గలడు, |
| వారె ద్రౌపదీ సుతులు, సౌ భద్రుడతడు, |
| వీరలెల్ల మహారథ వీరు లచట. |
|
| |
|
| 7. |
| ప్రముఖు లెవ్వారలో మన బలమునందు, |
| ద్విజ కులోత్తమ! వారి నే దెలియ బఱతు, |
| నాదు సైన్యమునకు మహా నాయకులను |
| గుర్తుకై వారి పేర్లు వా క్రుత్తు మీకు. |
|
| |
|
| 8. |
| కలరు మీరలు, భీష్ముడుకర్ణు డుండె, |
| సమితి జయశీలి, మన కృపాచార్యు డుండె, |
| ద్రౌణియు,వికర్ణుడును, సౌమదత్తి గలడు, |
| సైంధవుండును గలడు, నాసైన్యమందు. |
|
| |
|
| 9. |
| మద్గతప్రాణ చిత్తులైమామకీన |
| గుణము లన్యోన్యముగ జెప్పుకొనుచు నుండి, |
| సతత సంకీర్తనము నన్నుసలుపువారు, |
| ఆత్మరతిదేలి సంతుష్టిననుభవింత్రు. |
|
| |
|
| 10. |
| మనది భీష్మాది రక్షితమైన యిచటి |
| బల మపర్యాప్తముగనె,కన్పట్టుచుండె, |
| కాని భీమాభిరక్షితమైన వారి |
| బలము పర్యాప్తముగను కన్పట్టుచుండె. |
|
| |
|
| 11. |
| చెలువు మీఱగ మీరు మీనెలవు లందు |
| వ్యూహమార్గములన్ని కాపుండి విడక, |
| మీరు మనవార లందఱుమెఱపు గొలుప, |
| కంటికిని ఱెప్పవలె భీష్ముగావ వలయు. |
|
| |
|
| 12. |
| అంత, మన సుయోధనునకుహర్ష మొదవ, |
| తాత,కురువృద్ధు, డతుల ప్రతాపశాలి, |
| సింహనాదము నెత్తునజేసి వేగ, |
| శంఖ మొత్తెను దివి భూరిశబ్ద మెసగ. |
|
| |
|
| 13. |
| అపుడు, శంఖములును, ఢక్క లానకములు, |
| కొమ్ము లుడుకలు, భేరులు గోముఖములు, |
| నొక్కమాఱుగ మ్రోయింప దిక్కులన్ని, |
| సంకులముగాగ మ్రోగె నా శబ్దమునకు. |
|
| |
|
| 14. |
| అపుడు, శ్వేతాశ్వయుత మహా స్యందనమున |
| నొప్పు మీఱగ గూర్చుండి యున్నవారు, |
| మాధవుండును, పాండవ మధ్యముండు, |
| దివ్య శంఖము లూదిరి దిశలు మ్రోయ. |
|
| |
|
| 15. |
| కెరలి, పాంచజన్యము, హృషీ కేసుడొత్తె, |
| ఎత్తునను దేవదత్తము నొత్తె క్రీడి, |
| పౌండ్రమను మహాశంఖము బట్టి యూదె |
| ఘోర కర్ముండు వాడు, వృ కోదరుండు. |
|
| |
|
| 16. |
| కుంతి పుత్రుడు, ధర్మరా జంతలోన |
| బిట్టునూదె, దనయనంత విజయమెత్తి |
| నకుల సహదేవులూదిరి నభము మ్రోయ |
| కరముల సుఘోష మణిపుష్ప కముల బట్టి. |
|
| |
|
| 17. |
| కార్ముక విశారదుండైన కాశిరాజు, |
| రణమునందజేయుడు మహా రథి శిఖండి |
| విరట భూపతి, ద్రుపద భూ విభుని సుతుడు |
| నాజి నపరాజితుండు సా త్యకియు మఱియు; |
|
| |
|
| 18. |
| బాహుబలశాలియైన సుభద్రసుతుడు |
| ద్రౌపదేయులు ద్రుపద భూధవుడు నంద |
| ఱన్ని దిక్కుల నుండియునవని నాథ! |
| తవిలి తమ తమ శంఖముల్తడయకొత్త; |
|
| |
|
| 19. |
| భూరి శంఖారవము, కురు భూమి నిండె, |
| మన్ను మిన్నేకమై దిశల్ మాఱు మ్రోగె, |
| సంకులంబైన యాఘోర శబ్ద మెసగె, |
| ధార్తరాష్ట్రుల హృదయ వి దారకముగ. |
|
| |
|
| 20. |
| అంత, యుద్ధసన్నద్ధులైయచట నున్న |
| ధార్తరాష్ట్రుల, నా కపిద్వజుడు చూచె, |
| శస్త్ర సంపాత సమయ మాసన్న మగుట, |
| సరగ ధనువును పైకెత్తిస్యందనమున; |
|
| |
|
| 21. |
| పార్థుడా హృషీకేశునువైపు జూచి |
| యిట్లు మాటడె, ధృతరాష్ట్రనృపతి!వినుమ. |
| ఆపు మచ్యుతా! నారథ మాపు మచట |
| నుభయ సేనల, నడువీధి నుండునట్లు; |
|
| |
|
| 22. |
| ఒప్పుగా నిట్టి ఘోర ర ణోద్యమమున |
| నెవరితో నేను శరముల నెదురవలెనొ, |
| యుద్ధకామను లిట నెవ రున్నవారొ, |
| వారి నందఱ జూడగా వలయు నేను. |
|
| |
|
| 23. |
| కుత్సితుండైన ధృతరాష్ట్రు కొమరునకును |
| యుద్ధమందున సంప్రియ మొనర జేయ |
| నెవరు సమకూడి యుండిరో యిప్పు డిచట |
| చూతు వారల యుద్ధ కా మాతురులను. |
|
| |
|
| 24. |
| ఆ గుడాకేశు, డాశత్రు హంతకుండు, |
| ఇట్లు కోరగ విని హృషీ కేశు డప్పు |
| డుభయ సేనల మధ్యమం దుండునట్లు |
| తళ్కులొత్తెడు నారథో త్తమము బఱపి; |
|
| |
|
| 25. |
| భీష్మకుంభజులును, కురు వీరులందు |
| ముఖ్యులౌ భూపు లందఱ మ్రోల నిలిపి, |
| "ఇందు గూడిన కురుజన బాంధవులను |
| జూడు మర్జునా!" యంచు న చ్యుతుడు పల్కె |
|
| |
|
| 26. |
| పార్ధు డా రథమందుండి పాఱ జూచె, |
| తండ్రులను తాతలను, తన తండ్రివంటి |
| గురువులను, మేనమామల కూర్మి సఖుల |
| భ్రాతలను, పుత్ర, పౌత్రాది బంధు జనుల |
|
| |
|
| 27. |
| మామలను, బాల్యమిత్రుల మఱియు నచట |
| నుభయ సేనల యందున నున్నవారి, |
| సమర యోధుల తనబంధు సఖులనెల్ల |
| దేఱ పరికించి చూచి కౌం తేయు డపుడు; |
|
| |
|
| 28. |
| పరమ కృప మానసంబున బైకొనంగ, |
| బల్కె నిట్టుల బహుఖిన్న వదనుడగుచు, |
| యుద్ధ కామనులై కూడి యున్న యిచటి |
| కృష్ణ! స్వజనము నే సమీ క్షించి చూడ; |
|
| |
|
| 29. |
| పట్టుదప్పెను నాదు స ర్వాంగకములు, |
| తాప మయ్యెను, నోరెండి దప్పి గలిగె, |
| కంపమొందె శరీరము కదల జాల, |
| గగురు పాఱెను మేనెల్ల ఘర్మ మొదవె; |
|
| |
|
| 30. అర్జునుడనెను: |
| కరము నందుండి జాఱు నా గాండివంబు, |
| దేహ మంతయు మంటల దేలు చుండె, |
| మఱియు నా మనసు భ్రమించు మాడ్కి నుండె |
| నిలువ జాలను తిరముగా నేను కృష్ణ! |
Play This Verse |
| |
|
| 31. |
| అచ్యుతా! నాకు నెంతయు నశుభమైన |
| దుర్నిమిత్తము లెన్నియో తోచుచుండె, |
| సమరమందున స్వజనము జంప మేము |
| కనెడు మేలొక్కటేనియుగలదె యెందు? |
Play This Verse |
| |
|
| 32. |
| కృష్ణ! యుద్ధవిజయము కాం క్షింప నేను |
| వలదు రాజ్యము, గీజ్యము, వలదు సుఖము, |
| ఏల గోవింద! యీరాజ్య మేల మాకు? |
| భోగమయమైన బ్రతుకుల పోక లేల? |
|
| |
|
| 33. |
| రాజ్యసుఖములు భొగానురాగములును |
| కోరియుంటిమొ, యెవరి మే ల్కొఱకు మేము, |
| వారె రణమందు మ్రోలను న్నారు మనకు, |
| ప్రాణ ధనముల వీడ పా ల్పడియుగూడ. |
|
| |
|
| 34. |
| గురువరేణ్యులు, తండ్రులు కొమరులుండ్రి |
| తాతలును గూడ నుండిరి తఱచి చూడ, |
| మామలును, మేనమామలు మనుమలుండ్రి |
| బావమఱదులు, సఖులును బంధుజనులు; |
|
| |
|
| 35. |
| వారె నను జంప తలపడు వారలైన, |
| మాధవా! వారి జంప నా మనసు రాదు, |
| కూల్ప త్రైలోక్య రాజ్యము కొఱకు గూడ |
| అనతి భూరాజ్య మిక హేతు వగునె చంప? |
|
| |
|
| 36. |
| ధార్తరాష్ట్రుల నాజి నం దఱ వధింప, |
| నెట్టి ప్రియములు సమకూరు కృష్ణ! మాకు, |
| ఆతతాయుల జంపనౌ నైన గాని, |
| పాపమే వచ్చు వారి జం పంగ మాకు. |
|
| |
|
| 37. |
| పరగ ధృతరాష్ట్రుసుతుల, స్వబంధుజనుల, |
| పట్టి చంపగ మాకిది పాడి గాదు |
| స్వజనమునె పట్టి వధియింప సమరమందు |
| మాధవా! యెట్టి సుఖములు మాకు గలుగు? |
|
| |
|
| 38. |
| అనఘ! లోభోపహతచిత్తు లగుట జేసి, |
| కులవినాశముచే గల్గు కలుచ గాని, |
| బంధుమిత్రాది విద్రోహ పాపమైన, |
| కనగజాలని వారైన గానివారు; |
|
| |
|
| 39. |
| వంశ విక్షయకరమైన పాపములను |
| ఓ జనార్దన! చూచుచు నుండి కూడ, |
| ఏల మనమైన తెలియరా దిప్పుడైన, |
| దోషములు వీని నుండివై తొలగి చనగ. |
|
| |
|
| 40. |
| కలహకారణమున కుల క్షయము గలుగు |
| దాన జెడు సనాతనకుల ధర్మములును, |
| అట్టి కులధర్మములు నష్ట మైన కృష్ణ! |
| కులము నంత నధర్మము కొల్ల వెట్టు |
|
| |
|
| 41. |
| అట్లధర్మము కులముల నాక్రమింప |
| కృష్ణ! చెడుదురు మనకుల ! స్త్రీలుగూడ, |
| స్త్రీజనములట్లు కులటలై తిరుగుచున్న, |
| వర్ణసంకరమగుగాదె వాసుదేవ? |
|
| |
|
| 42. |
| కులమునకుగాని, యీ కుల ఘ్నులకుగాని, |
| నరకమే గతి వర్ణసం కరము వలన, |
| పతితులగుదురు వారల పితరులెల్ల |
| పిండ తర్పణములు విలో పించుగాన. |
|
| |
|
| 43. |
| ఇట్టి కులవినాశకుల దు ష్కృత్యములను, |
| కలుగు జాతికి వర్ణ సం కరము గాన, |
| జాతి, కుల, వర్ణములకు సం స్థానమైన |
| శాశ్వతంబైన ధర్మముల్ సమసిపోవు. |
|
| |
|
| 44. |
| కులధర్మములన్నియున్ కోలుపడిన |
| మనుజసంతతి కెల్ల ని మ్మహిని కృష్ణ, |
| నిత్యవాసము నరకమే నియతగతిగ, |
| కలుగునని చెప్ప వింటిమికాదెమనము. |
|
| |
|
| 45. |
| రాజ్యసుఖముల లోభ కా రణము వలన |
| చంప సమకట్టి యుంటిమి స్వజనములను, |
| అయ్యయో! మనమెంత దు రాశ చేత |
| ఘోరపాపమునకు దొర కొంటిమయ్య! |
|
| |
|
| 46. |
| మార్గణంబుల బూన, నే మారుకొనను, |
| శస్త్రపాణులునై వారు సమరమందు |
| ధార్తరాష్ట్రులు నను బరి ! మార్తురేని, |
| అదియె, నాపట్ల మిగుల మే లౌను కాదె? |
|
| |
|
| 47. |
| అట్లు మాటాడుచును సమ రాంగణమున, |
| దుఃఖసంవిగ్న చిత్తుడై తూలిపడుచు, |
| సశర గాండీవ మందు చేజార విడిచి, |
| చదికిలంబడె రథమందు సవ్యసాచి! |
Play This Verse |
| |
|
|
| |
| 1. ధృతరాష్ట్ర ఉవాచ: |
| ధర్మక్షేత్రే కురుక్షేత్రే |
| సమవేతా యుయుత్సవః |
| మామకాః పాణ్డవాశ్చైవ |
| కిమకుర్వత సంజయ |
Play This Verse |
| |
|
| 2. సంజయ ఉవాచ: |
| దృష్ట్వా తు పాణ్డవానీకం |
| వ్యూఢం దుర్యోధనస్తదా |
| ఆచార్యముపసంగమ్య |
| దృష్ట్వా తు పాణ్డవానీకం |
|
| |
|
| 3. |
| పశ్యైతాం పాణ్డుపుత్రాణా |
| మాచార్య మహతీం చమూమ్ |
| వ్యూఢాం ద్రుపదపుత్రేణ |
| తవ శిష్యేణ ధీమతా |
|
| |
|
| 4. |
| అత్ర శూరా మహేష్వాసా |
| భీమార్జునసమా యుధి |
| యుయుధానో విరాటశ్చ |
| ద్రుపదశ్చ మహారథః |
|
| |
|
| 5. |
| ధృష్టకేతుశ్చేకితానః |
| కాశిరాజశ్చ వీర్యవాన్ |
| పురుజిత్కున్తిభోజశ్చ |
| శైబ్యశ్చ నరపుఙ్గవః |
|
| |
|
| 6. |
| యుధామన్యుశ్చ విక్రాన్త |
| ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
| సౌభద్రో ద్రౌపదేయాశ్చ |
| సర్వ ఏవ మహారథాః |
|
| |
|
| 7. |
| అస్మాకం తు విశిష్టా యే |
| తాన్నిబోధ ద్విజోత్తమ |
| నాయకా మమ సైన్యస్య |
| సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే |
|
| |
|
| 8. |
| భవాన్భీష్మశ్చ కర్ణశ్చ |
| కృపశ్చ సమితింజయః |
| అశ్వత్థామా వికర్ణశ్చ |
| సౌమదత్తిస్తథైవ చ |
|
| |
|
| 9. |
| అన్యే చ బహవః శూరా |
| మదర్థే త్యక్తజీవితాః |
| నానాశస్త్రప్రహరణాః |
| సర్వే యుద్ధవిశారదాః |
|
| |
|
| 10. |
| అపర్యాప్తం తదస్మాకం |
| బలం భీష్మాభిరక్షితమ్ |
| పర్యాప్తం త్విదమేతేషాం |
| బలం భీమాభిరక్షితమ్ ౦ |
|
| |
|
| 11. |
| అయనేషు చ సర్వేషు |
| యథాభాగమవస్థితాః |
| భీష్మమేవాభిరక్షన్తు |
| భవన్తః సర్వ ఏవ హి |
|
| |
|
| 12. |
| తస్య సంజనయన్హర్షం |
| కురువృద్ధః పితామహః |
| సింహనాదం వినద్యోచ్చైః |
| శఙ్ఖం దధ్మౌ ప్రతాపవాన్ |
|
| |
|
| 13. |
| తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ |
| పణవానకగోముఖాః |
| సహసైవాభ్యహన్యన్త |
| స శబ్దస్తుములోఽభవత్ |
|
| |
|
| 14. |
| తతః శ్వేతైర్హయైర్యుక్తే |
| మహతి స్యన్దనే స్థితౌ |
| మాధవః పాణ్డవశ్చైవ |
| దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః |
|
| |
|
| 15. |
| పాఞ్చజన్యం హృషీకేశో |
| దేవదత్తం ధనఞ్జయః |
| పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం |
| భీమకర్మా వృకోదరః |
|
| |
|
| 16. |
| అనన్తవిజయం రాజా |
| కున్తీపుత్రో యుధిష్ఠిరః |
| నకులః సహదేవశ్చ |
| సుఘోషమణిపుష్పకౌ |
|
| |
|
| 17. |
| కాశ్యశ్చ పరమేష్వాసః |
| శిఖణ్డీ చ మహారథః |
| ధృష్టద్యుమ్నో విరాటశ్చ |
| సాత్యకిశ్చాపరాజితః |
|
| |
|
| 18. |
| ద్రుపదో ద్రౌపదేయాశ్చ |
| సర్వశః పృథివీపతే |
| సౌభద్రశ్చ మహాబాహుః |
| శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ |
|
| |
|
| 19. |
| స ఘోషో ధార్తరాష్ట్రాణాం |
| హృదయాని వ్యదారయత్ |
| నభశ్చ పృథివీం చైవ |
| తుములో వ్యనునాదయన్ |
|
| |
|
| 20. |
| అథ వ్యవస్థితాన్దృష్ట్వా |
| ధార్తరాష్ట్రాన్కపిధ్వజః |
| ప్రవృత్తే శస్త్రసంపాతే |
| ధనురుద్యమ్య పాణ్డవః |
|
| |
|
| 21. |
| హృషీకేశం తదా వాక్య |
| మిదమాహ మహీపతే |
| సేనయోరుభయోర్మధ్యే |
| రథం స్థాపయ మేఽచ్యుత |
|
| |
|
| 22. |
| యావదేతాన్నిరిక్షేఽహం |
| యోద్ధుకామానవస్థితాన్ |
| కైర్మయా సహ యోద్ధవ్య |
| మస్మిన్ రణసముద్యమే |
|
| |
|
| 23. |
| యోత్స్యమానానవేక్షేఽహం |
| య ఏతేఽత్ర సమాగతాః |
| ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే |
| ర్యుద్ధే ప్రియచికీర్షవః |
|
| |
|
| 24. |
| ఏవముక్తో హృషీకేశో |
| గుడాకేశేన భారత |
| సేనయోరుభయోర్మధ్యే |
| స్థాపయిత్వా రథోత్తమమ్ |
|
| |
|
| 25. |
| భీష్మద్రోణప్రముఖతః |
| సర్వేషాం చ మహీక్షితామ్ |
| ఉవాచ పార్థ పశ్యైతా |
| న్సమవేతాన్కురూనితి |
|
| |
|
| 26. |
| తత్రాపశ్యత్స్థితాన్పార్థః |
| పితౄనథ పితామహాన్ |
| ఆచార్యాన్మాతులాన్భ్రాతౄ |
| న్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా |
|
| |
|
| 27. |
| శ్వశురాన్సుహృదశ్చైవ |
| సేనయోరుభయోరపి |
| తాన్సమీక్ష్య స కౌన్తేయః |
| సర్వాన్బన్ధూనవస్థితాన్ |
|
| |
|
| 28. |
| కృపయా పరయావిష్టో |
| విషీదన్నిదమబ్రవీత్ |
| దృష్ట్వేమం స్వజనం కృష్ణ |
| యుయుత్సుం సముపస్థితమ్ |
|
| |
|
| 29. |
| సీదన్తి మమ గాత్రాణి |
| ముఖం చ పరిశుష్యతి |
| వేపథుశ్చ శరీరే మే |
| రోమహర్షశ్చ జాయతే ౯ |
|
| |
|
| 30. అర్జున ఉవాచ: |
| గాణ్డీవం స్రంసతే హస్తా |
| త్త్వక్చైవ పరిదహ్యతే |
| న చ శక్నోమ్యవస్థాతుం |
| భ్రమతీవ చ మే మనః |
Play This Verse |
| |
|
| 31. |
| నిమిత్తాని చ పశ్యామి |
| విపరీతాని కేశవ |
| న చ శ్రేయోఽనుపశ్యామి |
| హత్వా స్వజనమాహవే |
Play This Verse |
| |
|
| 32. |
| న కాఙ్క్షే విజయం కృష్ణ |
| న చ రాజ్యం సుఖాని చ |
| కిం నో రాజ్యేన గోవిన్ద |
| కిం భోగైర్జీవితేన వా |
|
| |
|
| 33. |
| యేషామర్థే కాఙ్క్షితం నో |
| రాజ్యం భోగాః సుఖాని చ |
| త ఇమేఽవస్థితా యుద్ధే |
| ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ |
|
| |
|
| 34. |
| ఆచార్యాః పితరః పుత్రా |
| స్తథైవ చ పితామహాః |
| మాతులాః శ్వశురాః పౌత్రాః |
| శ్యాలాః సంబన్ధినస్తథా |
|
| |
|
| 35. |
| ఏతాన్న హన్తుమిచ్ఛామి |
| ఘ్నతోఽపి మధుసూదన |
| అపి త్రైలోక్యరాజ్యస్య |
| హేతోః కిం ను మహీకృతే |
|
| |
|
| 36. |
| నిహత్య ధార్తరాష్ట్రాన్నః |
| కా ప్రీతిః స్యాజ్జనార్దన |
| పాపమేవాశ్రయేదస్మా |
| న్హత్వైతానాతతాయినః |
|
| |
|
| 37. |
| తస్మాన్నార్హా వయం హన్తుం |
| ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
| స్వజనం హి కథం హత్వా |
| సుఖినః స్యామ మాధవ |
|
| |
|
| 38. |
| యద్యప్యేతే న పశ్యన్తి |
| లోభోపహతచేతసః |
| కులక్షయకృతం దోషం |
| మిత్రద్రోహే చ పాతకమ్ |
|
| |
|
| 39. |
| కథం న జ్ఞేయమస్మాభిః |
| పాపాదస్మాన్నివర్తితుమ్ |
| కులక్షయకృతం దోషం |
| ప్రపశ్యద్భిర్జనార్దన ౯ |
|
| |
|
| 40. |
| కులక్షయే ప్రణశ్యన్తి |
| కులధర్మాః సనాతనాః |
| ధర్మే నష్టే కులం కృత్స్న |
| మధర్మోఽభిభవత్యుత ౦ |
|
| |
|
| 41. |
| అధర్మాభిభవాత్కృష్ణ |
| ప్రదుష్యన్తి కులస్త్రియః |
| స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ |
| జాయతే వర్ణసంకరః |
|
| |
|
| 42. |
| సంకరో నరకాయైవ |
| కులఘ్నానాం కులస్య చ |
| పతన్తి పితరో హ్యేషాం |
| లుప్తపిణ్డోదకక్రియాః |
|
| |
|
| 43. |
| దోషైరేతైః కులఘ్నానాం |
| వర్ణసంకరకారకైః |
| ఉత్సాద్యన్తే జాతిధర్మాః |
| కులధర్మాశ్చ శాశ్వతాః |
|
| |
|
| 44. |
| ఉత్సన్నకులధర్మాణాం |
| మనుష్యాణాం జనార్దన |
| నరకేఽనియతం వాసో |
| భవతీత్యనుశుశ్రుమ |
|
| |
|
| 45. |
| అహో బత మహత్పాపం |
| కర్తుం వ్యవసితా వయమ్ |
| యద్రాజ్యసుఖలోభేన |
| హన్తుం స్వజనముద్యతాః |
|
| |
|
| 46. |
| యది మామప్రతీకార |
| మశస్త్రం శస్త్రపాణయః |
| ధార్తరాష్ట్రా రణే హన్యు |
| స్తన్మే క్షేమతరం భవేత్ |
|
| |
|
| 47. |
| ఏవముక్త్వార్జునః సంఖ్యే |
| రథోపస్థ ఉపావిశత్ |
| విసృజ్య సశరం చాపం |
| శోకసంవిగ్నమానసః |
Play This Verse |
| |
|
|