| |
| 1. అర్జునుడనెను: |
| ఏది యాబ్రహ్మ, మధ్యాత్మమేది కృష్ణ! |
| ఏది పురుషోత్తమా!కర్మమెఱుగజెపుమ, |
| ఏది యధిభూత మని వచియింపబడెను |
| దేని నధిదైవ మందురుధీరవరులు? |
|
| |
|
| 2. |
| ఎవ్వ డధియజ్ఞు డనగ, వాడెట్టు లుండు, |
| దేవ!యీదేహమందు గుర్తింపగాను, |
| నియతచిత్తులు నిన్నెట్టినిష్ఠ బూని |
| అరయగల రంత్యకాలము నందు గూడ. |
|
| |
|
| 3. శ్రీ భగవానుడనెను: |
| పరమ మక్షరమైనదిబ్రహ్మ మండ్రు, |
| దాని జీవాంశభావ మధ్యాత్మమండ్రు |
| ఇందుగల భూతసృష్టికిహేతువైన |
| యజ్ఞద్రవ్యార్పణమె కర్మమని వచింత్రు. |
|
| |
|
| 4. |
| పుట్టి నశియించునది యధిభూతమనిరి, |
| తగ హిరణ్యగర్భుని నధిదైవమనిరి, |
| దేహమంతట లోన వర్తించు వాని |
| నన్నె యధియజ్ఞు డని బుధులెన్నుచుంద్రు. |
|
| |
|
| 5. |
| అంత్యకాలమునన్ హృదయమున నన్నె, |
| స్మరణ జేయుచు తనువు నేజనుడు వీడు, |
| వాడు నా స్వస్వరూపమెపడయ గలడు, |
| లేదు సందియ మిందునలేశ మైన. |
|
| |
|
| 6. |
| ఎవ్వ డె ట్టెట్టి భావమునెద వహించి |
| తనువు నిట వీడి యాతడుతరలు చుండు, |
| అత డ ట్టట్టి భావమేయందు కొనును, |
| నిత్య మాభావమే మదినిలిపి యుంట. |
|
| |
|
| 7. |
| కాన,అర్జునా!నన్నెల్లకాలములను, |
| స్మరణ జేయుచు యుద్ధము సలుపు మీవు, |
| మనసు, బుద్ధిని, నాకె యర్పణము జేసి, |
| పొందెదవు నన్నె లే దెట్టిసందియంబు. |
|
| |
|
| 8. |
| చిత్త మితరము నందునజేర నీక, |
| నిత్యమభ్యాసయోగవినిష్ఠు డగుచు, |
| పరుని, పురుషుని, దివ్య సంస్మరణ జేసి, |
| పడయు నాయోగి వానినేపాండుపుత్ర! |
|
| |
|
| 9. |
| బహుపురాణుని, సర్వజ్ఞుభానువర్ణు, |
| అణువు కన్నను బరమాణువైన వాని, |
| చీకటుల మించు వాని, నచింత్యరూపు, |
| సర్వధారకు, విశ్వశాసకు నెవండు; |
|
| |
|
| 10. |
| భక్తి సంయుక్తుడై, యోగబలము మెఱయ, |
| బొమల నడుమను దృస్ఠిని బూని నిలిపి, |
| అచలమతి తోడ స్మరియించునంత్య మందు,. |
| పరమ పురుషుని, దివ్యునిబడయునతడు. |
|
| |
|
| 11. |
| ఏది యక్షర మందురోవేదవిదులు, |
| వీతరాగులు యతులునువేగ జేర, |
| బ్రహ్మచర్యము గొందు రేపదము గోరి, |
| అట్టి పదమును నే సంగ్రహముగ జెపుదు. |
|
| |
|
| 12. |
| ఇంద్రియద్వారముల నిగ్రహించి యుంచి, |
| మనసు నియమించి హృత్స్థానమందు జేర్చి |
| ప్రాణవాయువును తనమూర్ధమున నిలిపి |
| ఆత్మసంయమ యోగమందచలు డగుచు. |
|
| |
|
| 13. |
| ప్రణవ మేకాక్షరబ్రహ్మవాచకమును, |
| ఓమ్మని పఠించి,స్మరియించు చుండి నన్ను, |
| తనువు నిట వీడి యెవ్వడుతరలు చుండు, |
| పరమ పదమర్జునా!వాడుపడయ గలడు. |
|
| |
|
| 14. |
| సతతమును వేరు చింతనసలుప బోక, |
| యెల్లెడల నన్నె మదిస్మరియించు చుండి, |
| నిత్య మచలసమాధిలోనిలుచు నెవ్వ |
| డట్టి యోగికి సులభుడనగుదు నేను. |
|
| |
|
| 15. |
| నన్ను బొందు మహత్ములెన్నండు గాని, |
| అస్ఠిరంబును దుఃఖాలయంబునైన |
| పుట్టి గిట్టెడు పొంతలబొంద బోరు, |
| పరమ సంసిద్ధి పదమునుబడసి యుంట. |
|
| |
|
| 16. |
| అర్జునా!బ్రహ్మలోక పర్యంతమైన |
| భువనములు పునరావృత్తిబొందు చుండు |
| కాని, ననుబొంది యున్నట్టివాని కెపుడు |
| మరల జన్మము గల దన్నమాట లేదు. |
|
| |
|
| 17. |
| యుగ సహస్ర పర్యంత మౌనొక్క పగలు, |
| యుగ సహస్రాంత మట్లెయౌనొక్క రేయి, |
| యీపగిది బ్రహ్మకాలమునెఱుగు వారె, |
| రేలబవళుల గణియించుకాల విదులు. |
|
| |
|
| 18. |
| ప్రభవమొందును బ్రహ్మకుపగలు రాగ, |
| వ్యక్తమై లోక మవ్యక్తమందు నుండి, |
| ప్రళయ మొందును బ్రహ్మకురాత్రి రాగ |
| సర్వ మవ్యక్తమైన యా సంజ్ఞ మందె. |
|
| |
|
| 19. |
| పూర్వకాలము నందలిభూతకోటి, |
| పుట్టి,పుట్టియు, ప్రవిలయమొందు మరల, |
| పొద్దు గ్రుంకిన నవశమైపొలియు చుండు, |
| ప్రొద్దు బొడిచిన మరితిర్గిబుట్టు నన్ని. |
|
| |
|
| 20. |
| కాని, యవ్యక్తమున కన్నకలదు వేరె, |
| పరమ మవ్యక్త శాశ్వతభావ మొకటి; |
| భూతములు నెల్ల నశియింపబొలియ దేదొ |
| అదియె నక్షరంబైన బ్రహ్మంబు పార్ఠ! |
|
| |
|
| 21. |
| అందు రెద్దాని నవ్యక్త మక్షర మని, |
| పరమపదమని దానినేపలుకు చుంద్రు, |
| ఏది ప్రాప్తింప తిరిగి వారిటకు రారొ, |
| అదియె నాపరమ నివాసపదము పార్ఠ! |
Play This Verse |
| |
|
| 22. |
| ఎవనిలో లీనమై ప్రాణులెల్ల నుండు, |
| ఎవనిచే లోక మంత వ్యాపింప బడియె, |
| పరుని, పురుషుని, దివ్యునవ్వాని పార్ఠ! |
| పడయ వచ్చు న నన్యమౌ భక్తి చేత. |
|
| |
|
| 23. |
| ఎట్టి కాలము నందుననెట్టి త్రోవ, |
| కర్మయోగులు జనినచోకౌరవేంద్ర! |
| వా రనావృత్తి నావృత్తిబడయ గలరొ, |
| అట్టి కాలమార్గముల నీవరయ జెపుదు. |
|
| |
|
| 24. |
| శుక్లపక్షము, పవ, లగ్నిజ్యోతి గూడి, |
| ఆరుమాసాల నుత్తరాయణమునందు, |
| మరణమును బొంది, చన, దేవమార్గమందు, |
| బ్రహ్మమును జేరి, యుందురుబ్రహ్మవిదులు. |
|
| |
|
| 25. |
| కృష్ణపక్షము, ధూమమురేయి గూడి, |
| ఆరు మాసాల దక్షిణాయనము నందు, |
| కామ్య కర్మలు, పితృమార్గగాము లగుచు, |
| చంద్రకళ జేరి కొందురుజన్మ మఱల. |
|
| |
|
| 26. |
| శుక్లకృష్ణము లను రెండుసూక్ష్మగతులు, |
| జగతి యందున శాశ్వతసమ్మతములు, |
| కలుగ దిక జన్మ శుక్లమార్గమున బోవ, |
| కలుగు మరు జన్మకృష్ణమార్గమున బోవ. |
|
| |
|
| 27. |
| ఇట్టు లీరెండు బాటలనెఱిగియున్న |
| యోగి యెవ్వడు మోహమునొంద బోడు; |
| కాన, నోయర్జునా!సర్వకాలములను, |
| యోగ యుక్తుండ వగుచు నీవుండ వలయు. |
Play This Verse |
| |
|
| 28. |
| వేదముల, తపో యజ్ఞ దానాదిక్రియల |
| కెట్టి పుణ్యఫలము నిర్ణయింప బడెనొ, |
| అట్టి ఫలముల నన్నింటినధిగమించి |
| పరమపదుడైన యాద్యునిబడయు యోగి. |
|
| |
|
|
| |
| 1. అర్జున ఉవాచ: |
| కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం |
| కిం కర్మ పురుషోత్తమ |
| అధిభూతం చ కిం ప్రోక్త |
| మధిదైవం కిముచ్యతే |
|
| |
|
| 2. |
| అధియజ్ఞః కథం కోఽత్ర |
| దేహేఽస్మిన్మధుసూదన |
| ప్రయాణకాలే చ కథం |
| జ్ఞేయోఽసి నియతాత్మభిః |
|
| |
|
| 3. శ్రీభగవానువాచ: |
| అక్షరం బ్రహ్మ పరమం |
| స్వభావోఽధ్యాత్మముచ్యతే |
| భూతభావోద్భవకరో |
| విసర్గః కర్మసంజ్ఞితః |
|
| |
|
| 4. |
| అధిభూతం క్షరో భావః |
| పురుషశ్చాధిదైవతమ్ |
| అధియజ్ఞోఽహమేవాత్ర |
| దేహే దేహభృతాం వర |
|
| |
|
| 5. |
| అన్తకాలే చ మామేవ |
| స్మరన్ముక్త్వా కలేవరమ్ |
| యః ప్రయాతి స మద్భావం |
| యాతి నాస్త్యత్ర సంశయః |
|
| |
|
| 6. |
| యం యం వాపి స్మరన్భావం |
| త్యజత్యన్తే కలేవరమ్ |
| తం తమేవైతి కౌన్తేయ |
| సదా తద్భావభావితః |
|
| |
|
| 7. |
| తస్మాత్సర్వేషు కాలేషు |
| మామనుస్మర యుధ్య చ |
| మయ్యర్పితమనోబుద్ధి |
| ర్మామేవైష్యస్యసంశయమ్ |
|
| |
|
| 8. |
| అభ్యాసయోగయుక్తేన |
| చేతసా నాన్యగామినా |
| పరమం పురుషం దివ్యం |
| యాతి పార్థానుచిన్తయన్ |
|
| |
|
| 9. |
| కవిం పురాణమనుశాసితార |
| మణోరణీయాంసమనుస్మరేద్యః |
| సర్వస్య ధాతారమచిన్త్యరూప |
| మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ౯ |
|
| |
|
| 10. |
| ప్రయాణకాలే మనసాచలేన |
| భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
| భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ |
| స తం పరం పురుషముపైతి దివ్యమ్ ౦ |
|
| |
|
| 11. |
| యదక్షరం వేదవిదో వదన్తి |
| విశన్తి యద్యతయో వీతరాగాః |
| యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి |
| తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే |
|
| |
|
| 12. |
| సర్వద్వారాణి సంయమ్య |
| మనో హృది నిరుధ్య చ |
| మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణ |
| మాస్థితో యోగధారణామ్ |
|
| |
|
| 13. |
| ఓమిత్యేకాక్షరం బ్రహ్మ |
| వ్యాహరన్మామనుస్మరన్ |
| యః ప్రయాతి త్యజన్దేహం |
| స యాతి పరమాం గతిమ్ |
|
| |
|
| 14. |
| అనన్యచేతాః సతతం |
| యో మాం స్మరతి నిత్యశః |
| తస్యాహం సులభః పార్థ |
| నిత్యయుక్తస్య యోగినః |
|
| |
|
| 15. |
| మాముపేత్య పునర్జన్మ |
| దుఃఖాలయమశాశ్వతమ్ |
| నాప్నువన్తి మహాత్మానః |
| సంసిద్ధిం పరమాం గతాః |
|
| |
|
| 16. |
| ఆబ్రహ్మభువనాల్లోకాః |
| పునరావర్తినోఽర్జున |
| మాముపేత్య తు కౌన్తేయ |
| పునర్జన్మ న విద్యతే |
|
| |
|
| 17. |
| సహస్రయుగపర్యన్త |
| మహర్యద్బ్రహ్మణో విదుః |
| రాత్రిం యుగసహస్రాన్తాం |
| తేఽహోరాత్రవిదో జనాః |
|
| |
|
| 18. |
| అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః |
| ప్రభవన్త్యహరాగమే |
| రాత్ర్యాగమే ప్రలీయన్తే |
| తత్రైవావ్యక్తసంజ్ఞకే |
|
| |
|
| 19. |
| భూతగ్రామః స ఏవాయం |
| భూత్వా భూత్వా ప్రలీయతే |
| రాత్ర్యాగమేఽవశః పార్థ |
| ప్రభవత్యహరాగమే ౯ |
|
| |
|
| 20. |
| పరస్తస్మాత్తు భావోఽన్యోఽ |
| వ్యక్తోఽవ్యక్తాత్సనాతనః |
| యః స సర్వేషు భూతేషు |
| నశ్యత్సు న వినశ్యతి ౦ |
|
| |
|
| 21. |
| అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్త |
| మాహుః పరమాం గతిమ్ |
| యం ప్రాప్య న నివర్తన్తే |
| తద్ధామ పరమం మమ |
Play This Verse |
| |
|
| 22. |
| పురుషః స పరః పార్థ |
| భక్త్యా లభ్యస్త్వనన్యయా |
| యస్యాన్తఃస్థాని భూతాని |
| యేన సర్వమిదం తతమ్ |
|
| |
|
| 23. |
| యత్ర కాలే త్వనావృత్తి |
| మావృత్తిం చైవ యోగినః |
| ప్రయాతా యాన్తి తం కాలం |
| వక్ష్యామి భరతర్షభ |
|
| |
|
| 24. |
| అగ్నిర్జ్యోతిరహః శుక్లః |
| షణ్మాసా ఉత్తరాయణమ్ |
| తత్ర ప్రయాతా గచ్ఛన్తి |
| బ్రహ్మ బ్రహ్మవిదో జనాః |
|
| |
|
| 25. |
| ధూమో రాత్రిస్తథా కృష్ణః |
| షణ్మాసా దక్షిణాయనమ్ |
| తత్ర చాన్ద్రమసం జ్యోతి |
| ర్యోగీ ప్రాప్య నివర్తతే |
|
| |
|
| 26. |
| శుక్లకృష్ణే గతీ హ్యేతే |
| జగతః శాశ్వతే మతే |
| ఏకయా యాత్యనావృత్తి |
| మన్యయావర్తతే పునః |
|
| |
|
| 27. |
| నైతే సృతీ పార్థ జాన |
| న్యోగీ ముహ్యతి కశ్చన |
| తస్మాత్సర్వేషు కాలేషు |
| యోగయుక్తో భవార్జున |
Play This Verse |
| |
|
| 28. |
| వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ |
| దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టమ్ |
| అత్యేతి తత్సర్వమిదం విదిత్వా |
| యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ |
|
| |
|
|