Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  7. సప్తమాధ్యాయము : జ్ఞానవిజ్ఞానయోగము
 
 1.  శ్రీ భగవానుడనెను:
  ప్రీతితో పార్థ! నన్ను నీ హృదిని నిలిపి,
  శరణుగొని నన్ను, యోగమా చరణ బూని
  నాసమగ్రస్వరూప వి జ్ఞాన మీవు
  సంశయము లేక గ్రహియించు సరణి వినుము
 
 
 2.  
  ఎట్టి జ్ఞానము సిద్ధింప నితర మిలను
  తెలియదగినది మిగులంగ గలుగ బోదొ
  జ్ఞాన మది నేను విజ్ఞాన సహితముగను
  చెప్పుదును నీకు వినుము ని శ్శేషముగను
 
 
 3.  
  మహిని వేలాది వేలైన మనుజు లందు
  సిద్ధి బొందగ యత్నము జేయు నొకడె,
  యత్నసిద్ధులు వేవుర యందు గూడ,
  తవిలి తెలియును నానిజ తత్త్వమొకడె
 
 
 4.  
  పృథ్వి జలమగ్ని వాయువున్ విజయ! మరియు
  గగనమును, మనో బుద్ధ్యహం కారములుగ
  అష్టవిధముల నిట్లు నా యపర ప్రకృతి,
  భిన్నరూపములై పర్వు విశ్వమంత
 
 
 5.  
  కాని పార్థ! యీ యపరము కన్న వేరె,
  జీవభూతముగా నేది చెలగు చుండి,
  యేది ధరియించునో జగ మెల్ల దీని,
  నదియె నా పరాప్రకృతియం చరయు మీవు
 
 
 6.  
  సర్వభూతము లర్జునా! సంభవింప
  కారణములిట్టి ప్రకృతులు గాగ్రహింపు,
  సర్వజగతికి నిలయమౌ స్థాన మేను,
  ప్రభవమునకు, మఱిదాని ప్రళయమునకు
 
 
 7.  
  అర్జునా! నా వినా జగ మందు నిచట,
  శ్రేష్ఠతరమైన దొకటి వే రేది లేదు,
  భూతజాలము నాయందె ప్రోత మయ్యె
  మణిగణము సూత్రమందున్న మాడ్కి మెఱసి
 
 
 8.  
  జలమునందలి రసమను చవిని నేను,
  సూర్యరశ్మియు, చంద్రుని జ్యోత్స్న నేను,
  శబ్ద మాకాశమున, పౌరు షమును నరుల,
  ఎల్ల వేదములందు నోం కృతియు నేను
 
 
 9.  
  పుణ్యగంధము నేనె యీ పుడమి యందు,
  జాతవేదుని యందు తే జమును నేను,
  సర్వభూతాల కాయువు సారమేను,
  వఱలు తపమును నేను, త పస్వులందు
 
 
 10.  
  జగతి గల చరాచర భూత జాలమునకు,
  అరయుమీ సనాతనబీజ మంచు నన్ను,
  బుద్ధిమంతుల విజ్ఞాన బుద్ధి నేను,
  తేజుగలవార లందరి తేజ మేను
 
 
 11.  
  కామరాగముల జయింప గలిగియున్న
  బలముగలవార లందలి బలము నేను,
  ధర్మవర్తనులైన భూ తములయందు
  కలుగు ధర్మసమ్మతమైన కామ మేను
 
 
 12.  
  సత్త్వమును, రాజసము, తామ సంబులైన
  భూతభావము లెట్టివి పొడము నేని,
  తెలియు మవి యన్ని నానుండె కలుగు నంచు,
  అందు నే లేను, యవియె నా యందు కలవు
 
 
 13.  
  త్రిగుణమయములౌ భావముల్ దీటుకొనగ,
  జగతియందలి యీ భూత జాలమెల్ల
  అరయకున్నది పార్థ! మో హమును బొంది,
  అవ్యయుని, త్రిగుణాతీతు నైన నన్ను
 
 
 14.  
  త్రిగుణమయమైన నామాయ దివ్యమగుట
  దాటగా దాని బహుకష్ట తరము గాన,
  శరణు నన్నే యెవరు మన సార గొంద్రొ
  వారి కీమాయ దాటగ వశ్యమగును
 
 
 15.  
  పాపకర్ములు, మూఢులు బండగులును
  మాయచే జ్ఞాననాశన మైన వారు,
  ఆసురంబైన భావము నాశ్రయించి
  నన్ను గొల్వరు నీచమా నవులు గాన
 
 
 16.  
  నన్ను భజియించు సుజనులు నాల్గుతెగలు,
  అర్థకాములు, నిడుమల నార్తజనులు,
  జ్ఞానవంతులు, తత్త్వజి జ్ఞాసువులును
  పుణ్యజను లిట్లు గొల్తురు పురుషవృషభ!
 Play This Verse
 
 17.  
  నిత్యభక్తిని నన్నేక నిష్ఠగొల్చు
  జ్ఞానియే పార్థ! శ్రేష్ఠుడా నల్వురందు,
  అట్టి జ్ఞానికి నేను అ త్యంత ప్రియుడ,
  ఆతడట్టులె నాకు న త్యంత ప్రియుడు
 Play This Verse
 
 18.  
  కడునుదారులే వీరెల్ల గాని పార్థ!
  జ్ఞాని మాత్రము నాయాత్మ గానె తలతు
  నన్నె యుత్తమగతిగాగ నమ్మి వాడు
  ఏక చిత్తముతో నాశ్ర యించుగాన
 
 
 19.  
  ఎన్ని యెన్నియో జన్మము లెత్తి తుదిని,
  అంతయును వాసుదేవ మ యమ్మటంచు
  జ్ఞానమును బొంది, నను జేర గలుగునట్టి,
  అమ్మహాత్మకు డెంతయు నరుదు పార్థ!
 Play This Verse
 
 20.  
  వారి వారి పూర్వస్వభా వానుసరణి,
  కోరికలచేత జ్ఞానము కోలుపోయి,
  క్షుద్రదేవతల భజింత్రు కొంద ఱిలను,
  వాని వానికి నియమిత వ్రతము సలిపి
 
 
 21.  
  ఇఛ్ఛతోభక్తు డెవ డెవం డెట్టి యెట్టి,
  ఇష్టదేవత శ్రద్ధతో నెలమి గొల్చు
  వాని వాని కా యామూర్తి భక్తియందె,
  నిశ్చలంబగు శ్రద్ధ నే నిలువనిత్తు
 
 
 22.  
  భక్తుడట్టుల వాని దే వతను గూర్చి
  శ్రద్ధతోడను జేయ నా రాధనంబు,
  ఏనె విధియించు నవ్వాని యీప్సితముల
  పొందు నాతని దేవతా మూర్తి వలన
 
 
 23.  
  అన్యదేవతాభక్తులౌ నల్పమతులు
  పొందు ఫలమన్నచో నంద మొందు నదియె,
  దేవతల బొందుచుందురు దేవయజులు,
  నాదు భక్తులు వత్తురు నన్నె చేర
 
 
 24.  
  అవ్యయము, నిరతిశయ మైనయట్టి,
  పరమరూపము నాది వా రరయ లేక,
  రూపకుని జేసి, యవ్యక్త రూపు నన్ను,
  మనుజ మాత్రునిగా నెంత్రు మందమతులు
 
 
 25.  
  యోగమాయాపరివృతులై యొప్పుచుంట,
  కానరా నందఱకును లో కాన నేను,
  మోహమున మున్గియుంట నీ మూఢజనులు,
  అరయగా జాల రజుడ న వ్యయుడ నన్ను
 
 
 26.  
  కడచియున్న, గడచుచున్న గడువనున్న,
  కాలముల యందు భూతాల కాంతు నేను,
  కాన రానిది నా కెందుకలుగ బోదు,
  కాని నను మాత్ర మెవ్వడు గాంచ లేడు
 
 
 27.  
  రాగవిద్వేషములు రెండు రగులు గొలుప,
  ద్వంద్వమోహము లందున దగులు కొనియు,
  పుట్టు నుండియె, నీసర్వ భూతములును
  మోహమును బొందియుండు, సం పూర్ణముగను
 
 
 28.  
  పుణ్యకర్మలచేత నీ పుడమి జనుల
  పాప మెవ్వారి దంతయుభస్మ మగునొ,
  ద్వంద్వమోహములను వారు తగులు బాసి,
  ధృఢనియమ మూని నన్ను భ జించు చుంద్రు
 
 
 29.  
  జరయు మరణమునుండి మో క్షమును గోరి,
  యత్న మొనరింతు రెవరు న న్నాశ్రయించి,
  వారలే సమగ్రముగ నా బ్రహ్మ నెఱిగి,
  అఖిలకర్మల నధ్యాత్మ నరయ గలరు
 
 
 30.  
  తగగ నధిభూత, మధిదైవ తముని తోడ,
  ఎవ్వ రధియజ్ఞు తోడ న న్నెఱుగ గలరొ,
  అట్టివా రంత్యకాలము నందు గూడ,
  యుక్తచేతస్కులై తెలి యుదురు నన్ను
 
 
 
 1.  శ్రీభగవానువాచ:
  మయ్యాసక్తమనాః పార్థ
   యోగం యుఞ్జన్మదాశ్రయః
  అసంశయం సమగ్రం మాం
   యథా జ్ఞాస్యసి తచ్ఛృణు
 
 
 2.  
  జ్ఞానం తేఽహం సవిజ్ఞాన
  మిదం వక్ష్యామ్యశేషతః
  యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్య
  జ్జ్ఞాతవ్యమవశిష్యతే
 
 
 3.  
  మనుష్యాణాం సహస్రేషు
   కశ్చిద్యతతి సిద్ధయే
  యతతామపి సిద్ధానాం
   కశ్చిన్మాం వేత్తి తత్త్వతః
 
 
 4.  
  భూమిరాపోఽనలో వాయుః
  ఖం మనో బుద్ధిరేవ చ
  అహంకార ఇతీయం మే
   భిన్నా ప్రకృతిరష్టధా
 
 
 5.  
  అపరేయమితస్త్వన్యాం
   ప్రకృతిం విద్ధి మే పరామ్
  జీవభూతాం మహాబాహో
   యయేదం ధార్యతే జగత్
 
 
 6.  
  ఏతద్యోనీని భూతాని
   సర్వాణీత్యుపధారయ
  అహం కృత్స్నస్య జగతః
   ప్రభవః ప్రలయస్తథా
 
 
 7.  
  మత్తః పరతరం నాన్య
  త్కించిదస్తి ధనంజయ
  మయి సర్వమిదం ప్రోతం
   సూత్రే మణిగణా ఇవ
 
 
 8.  
  రసోఽహమప్సు కౌన్తేయ
   ప్రభాస్మి శశిసూర్యయోః
  ప్రణవః సర్వవేదేషు
  శబ్దః ఖే పౌరుషం నృషు
 
 
 9.  
  పుణ్యో గన్ధః పృథివ్యాం
  చ తేజశ్చాస్మి విభావసౌ
  జీవనం సర్వభూతేషు
  తపశ్చాస్మి తపస్విషు ౯
 
 
 10.  
  బీజం మాం సర్వభూతానాం
   విద్ధి పార్థ సనాతనమ్
  బుద్ధిర్బుద్ధిమతామస్మి
  తేజస్తేజస్వినామహమ్ ౦
 
 
 11.  
  బలం బలవతాం చాహం
   కామరాగవివర్జితమ్
  ధర్మావిరుద్ధో భూతేషు
   కామోఽస్మి భరతర్షభ
 
 
 12.  
  యే చైవ సాత్త్వికా భావా
   రాజసాస్తామసాశ్చ యే
  మత్త ఏవేతి తాన్విద్ధి
  న త్వహం తేషు తే మయి
 
 
 13.  
  త్రిభిర్గుణమయైర్భావై
  రేభిః సర్వమిదం జగత్
  మోహితం నాభిజానాతి
  మామేభ్యః పరమవ్యయమ్
 
 
 14.  
  దైవీ హ్యేషా గుణమయీ
  మమ మాయా దురత్యయా
  మామేవ యే ప్రపద్యన్తే
   మాయామేతాం తరన్తి తే
 
 
 15.  
  న మాం దుష్కృతినో మూఢాః
   ప్రపద్యన్తే నరాధమాః
  మాయయాపహృతజ్ఞానా
  ఆసురం భావమాశ్రితాః
 
 
 16.  
  చతుర్విధా భజన్తే మాం
   జనాః సుకృతినోఽర్జున
  ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ
  జ్ఞానీ చ భరతర్షభ
 Play This Verse
 
 17.  
  తేషాం జ్ఞానీ నిత్యయుక్త
  ఏకభక్తిర్విశిష్యతే
  ప్రియో హి జ్ఞానినోఽత్యర్థ
  మహం స చ మమ ప్రియః
 Play This Verse
 
 18.  
  ఉదారాః సర్వ ఏవైతే
  జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
  ఆస్థితః స హి యుక్తాత్మా
   మామేవానుత్తమాం గతిమ్
 
 
 19.  
  బహూనాం జన్మనామన్తే
   జ్ఞానవాన్మాం ప్రపద్యతే
  వాసుదేవః సర్వమితి
   స మహాత్మా సుదుర్లభః ౯
 Play This Verse
 
 20.  
  కామైస్తైస్తైర్హృతజ్ఞానాః
   ప్రపద్యన్తేఽన్యదేవతాః
  తం తం నియమమాస్థాయ
   ప్రకృత్యా నియతాః స్వయా ౦
 
 
 21.  
  యో యో యాం యాం తనుం భక్తః
  శ్రద్ధయార్చితుమిచ్ఛతి
  తస్య తస్యాచలాం శ్రద్ధాం
  తామేవ విదధామ్యహమ్
 
 
 22.  
  స తయా శ్రద్ధయా యుక్త
  స్తస్యారాధనమీహతే
  లభతే చ తతః కామా
  న్మయైవ విహితాన్హి తాన్
 
 
 23.  
  అన్తవత్తు ఫలం తేషాం
  తద్భవత్యల్పమేధసామ్
  దేవాన్దేవయజో యాన్తి
   మద్భక్తా యాన్తి మామపి
 
 
 24.  
  అవ్యక్తం వ్యక్తిమాపన్నం
   మన్యన్తే మామబుద్ధయః
  పరం భావమజానన్తో
   మమావ్యయమనుత్తమమ్
 
 
 25.  
  నాహం ప్రకాశః సర్వస్య
   యోగమాయాసమావృతః
  మూఢోఽయం నాభిజానాతి
   లోకో మామజమవ్యయమ్
 
 
 26.  
  వేదాహం సమతీతాని
  వర్తమానాని చార్జున
  భవిష్యాణి చ భూతాని
  మాం తు వేద న కశ్చన
 
 
 27.  
  ఇచ్ఛాద్వేషసముత్థేన
   ద్వన్ద్వమోహేన భారత
  సర్వభూతాని సంమోహం
   సర్గే యాన్తి పరన్తప
 
 
 28.  
  యేషాం త్వన్తగతం పాపం
  జనానాం పుణ్యకర్మణామ్
  తే ద్వన్ద్వమోహనిర్ముక్తా
   భజన్తే మాం దృఢవ్రతాః
 
 
 29.  
  జరామరణమోక్షాయ
  మామాశ్రిత్య యతన్తి యే
  తే బ్రహ్మ తద్విదుః కృత్స్న
  మధ్యాత్మం కర్మ చాఖిలమ్ ౯
 
 
 30.  
  సాధిభూతాధిదైవం మాం
   సాధియజ్ఞం చ యే విదుః
  ప్రయాణకాలేఽపి చ మాం
   తే విదుర్యుక్తచేతసః ౦
 
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18