| |
| 1. శ్రీ భగవానుడనెను: |
| విహితకర్మము లెవ్వడువిడక సేయు, |
| విహితకర్మము లెవ్వడువిడక సేయు, |
| అతడె సన్యాసి,యోగియునగును గాని, |
| యజ్ఞ దాన తపః క్రియాత్యాగి కాడు. |
|
| |
|
| 2. |
| ఏది సన్యాసమని పెద్దలెంచినారొ, |
| దానినే యోగ మంచునుదలపు మీవు, |
| సకల సంకల్పముల ఫలసహితముగను, |
| త్యాగమును సేయ కొక్కడుయోగికాడు. |
|
| |
|
| 3. |
| జ్ఞానయోగ మారోహింపబూను మునికి, |
| సాధనం బని చెపిరి నిష్కామకర్మ, |
| జ్ఞానయోగ సుస్థిరుడైనమౌని కగును, |
| సర్వకర్మ నివృత్తియేసాధనంబు. |
|
| |
|
| 4. |
| ఇంద్రియార్ధము లందెవ్వడిచ్చ గొనక, |
| సర్వకర్మములం దనాసక్తు డగుచు, |
| సకల సంకల్పము లెపుడుసన్యసించు, |
| అప్పుడతని యోగారూఢుడండ్రు బుధులు. |
|
| |
|
| 5. |
| నిష్కళంకపు బుద్ధిచేనీదు మనసు, |
| నుద్ధరింపు, మధోగతినొంద నీకు, |
| నిర్మలాత్మయె బంధువునీకు నెపుడు, |
| నీదు కలుషిత చిత్తమేనీ విరోధి. |
Play This Verse |
| |
|
| 6. |
| ఎవని మనసు జయించు దేహేంద్రియముల, |
| వాని మనసే యతని కాత్మబంధువగును, |
| ఎవని మనసట్టివాని జయింప లేదొ, |
| అదియె నతనికి రిపునట్లుహాని జేయు. |
|
| |
|
| 7. |
| సంయతాత్ముడు చిత్తప్రశాంతశీలి, |
| తుల్యుడై సుఖదుఃఖ శీతోష్ణములను, |
| (సమగ)నుండి మానావమానములయందు, |
| వఱలు పరమాత్మసంస్థితభావు డగుచు. |
|
| |
|
| 8. |
| జ్ఞానవిజ్ఞాన తృప్తాత్ముడైనవాని, |
| నిర్జితేంద్రియు,కూటస్థు,నిశ్చలితుని, |
| పసిడి, మట్టిని,రాలొకేపగిది జూచు, |
| యుక్తపురుషుని నారూఢయోగియండ్రు. |
|
| |
|
| 9. |
| మిత్రులందు,సుహృదులందు,శత్రులందు, |
| బంధు,మధ్యస్థ, తాటస్థ్యపాపు లందు, |
| సాధువులయందు,ద్వేష్యులసమతనుండు, |
| యుక్తపురుషుని నారూఢయోగియండ్రు. |
|
| |
|
| 10. |
| కాంక్షలను బాసి,ధన పరిగ్రహణ మాని, |
| దేహము మనస్సు తనకు స్వాధీన పఱచి, |
| యోగి నిర్జనస్థానమందొకడెయుండి, |
| సతత మంతఃకరణ సమాహితమొనర్చి; |
|
| |
|
| 11. |
| మిగుల పల్లము లేని, పెన్మిఱ్ఱులేని, |
| శుద్ధి జేసిన యొంటరిచోటునందు, |
| కుశలు మృగచర్మవస్త్రముల్గూర్చి వరుస, |
| తనకు స్థిరమైనయాసనమొనర జేసి; |
|
| |
|
| 12. |
| అందు గూర్చుండి మనసు నేకాగ్రపఱచి, |
| వివిధచిత్తేంద్రియక్రియావృత్తులణచి, |
| యోగి యంతఃకరణ శుద్ధినొందు కొఱకు, |
| అభ్యసింపగవలె యోగమచలు డగుచు. |
|
| |
|
| 13. |
| తలయు,మెడయును,నొడలునుతలక నీక, |
| సమముగా నిల్పి మనసు నిశ్చలత నెఱపి, |
| చూపు నటు నిటు దిక్కులచొనప బోక, |
| తనదు భ్రూమధ్యమందునదనర నిలిపి; |
|
| |
|
| 14. |
| శాంతమానసుడై భయభ్రాంతి బాసి, |
| బ్రహ్మచర్యవ్రతస్థిరత్వమున నిలిచి, |
| మనసు నియమించి,నాలోనిమగ్ను డగుచు, |
| యోగమందు మత్పరత గూర్చుండ వలయు. |
|
| |
|
| 15. |
| నియతమానసు డింద్రియనిగ్రహుండు, |
| యోగి మనసెపుడు సమాధినుంచి యిట్లు, |
| ధ్యానమును జేసి,యస్మదధీనమైన, |
| పరమ నిర్వాణమౌ శాంతిపదము బొందు. |
|
| |
|
| 16. |
| వెక్కసము గాక భుజియించువెక్కలికిని, |
| మరియు నేమియు దిననట్టిమానవునకు, |
| కరము నిద్రాణున కతిజాగరిత కైన, |
| ఫల్గునా!ధ్యానయోగముపట్టువడదు. |
|
| |
|
| 17. |
| సముచితాహారి నియత సంచారి మఱియు |
| తగిన మెలుకువయు, తగు నిద్ర గలవాడు, |
| కర్మముల యుక్తరీతినిగడపువాడు, |
| దుఃఖహరమైన యోగముదొరయ గలుగు. |
|
| |
|
| 18. |
| చిత్తమును నిగ్రహింపగజేసి యుంచి, |
| ఆత్మయందె సమహితుడగు నెవండు |
| సర్వకామేచ్చలను వీడజాలు నెప్పు |
| డప్పుడే యోగియని వానిననుచు నుంద్రు. |
|
| |
|
| 19. |
| వాయుగీతిలేనిచోట,దీపంబు యెట్లు |
| కదలికే లేక వెలుగు నేకాగ్రముగను, |
| అట్లె, యాత్మసంయమయోగమభ్యసించు |
| యోగి, చిత్తమేకాగ్రమైయుండ వలయు. |
|
| |
|
| 20. |
| నిగ్రహింపబడి యోగనిష్ఠవలన |
| చిత్త మెయ్యెడ నుపరతిజెందియుండు |
| ఆత్మచే నేస్థితిని బరమాత్మ జూచి |
| అనుభవించునొ యానందమాత్మయందె; |
|
| |
|
| 21. |
| ఎట్టి స్ఠితియందు నింద్రియాలెఱుగ లేక |
| నే యనంతసుఖము బుద్ధియే గ్రహించు, |
| తెలిసి దానిని యోగి యేస్ఠితిని నున్న |
| ఆత్మ తత్త్వము నందె తానచలు డగునొ; |
|
| |
|
| 22. |
| ఆత్మసుఖలాభ మెట్టిదియబ్బియున్న |
| యితర లాభము మిన్నగానెంచబోడొ, |
| ఆత్మతత్త్వము నెద్ధానినాశ్రయింప, |
| దుస్సహంబగు దుఃఖాలదురపిలండొ; |
|
| |
|
| 23. |
| దుకఃఖసంయోగ మద్దానితొలగ ద్రోయు |
| స్ఠితిని యోగము పేర గుర్తింప వలయు |
| విసుగు జెందని చిత్త ప్రవృత్తి తోడ, |
| సలుపు మాయోగమే పట్టుసడల నీక. |
|
| |
|
| 24. |
| కలుగు సంకల్ప జన్యమౌకామములను, |
| సర్వమును నిర్విశేషముసంత్యజించి |
| మనసు చేతనె యింద్రియగణము నెల్ల |
| ఎల్ల విషయాలనుండి నివృత్తిపఱచి; |
|
| |
|
| 25. |
| ధైర్య మొనసిన బుద్ధిచేతనదు మనసు, |
| నాత్మయందున స్ఠిరముగానమర నిలిపి, |
| ఉల్లమున నుపరతి మెలమెల్ల పొంది, |
| ఒండొకింతయు చింతింపకుండ వలయు. |
Play This Verse |
| |
|
| 26. |
| అస్ఠిరంబును, జంచలమైన మనసు, |
| విడక యేయే విషయములవెంట దిరుగు |
| దాని నాయావిషయములదగుల నీక, |
| త్రిప్పి స్థిరబఱ్చు మాత్మ స్వాధీన మందె. |
Play This Verse |
| |
|
| 27. |
| శాంతరజసుడు, మానసశాంతశీలి, |
| పాపరహితుడు, బ్రహ్య్మైక్యభావనుండు, |
| ఎవని స్వాధీనమై మనసెప్పు డుండు, |
| ఉత్తమసుఖ మాయోగినేయొనర జెందు. |
|
| |
|
| 28. |
| ఇట్లు మనసును యోగమందెప్పు డుంచి, |
| పాపపంకిల మెల్లనుబాసి యోగి, |
| బ్రహ్మసందర్శనము లెస్సబడసి యుండి |
| సులభముగ బొందు, నత్యంతసుఖము వాడు. |
|
| |
|
| 29. |
| సకలభూతముల సమ వీక్షణము గలిగి, |
| అన్నిభూతము లందు దానున్న యట్లు, |
| అన్నిభుతములు దనయందున్నయట్లు, |
| యోగయుక్తాత్మ దర్శించుచుండు నెపుడు. |
Play This Verse |
| |
|
| 30. |
| ఎవడు సర్వత్ర నన్నె దర్శించు చుండు, |
| ఎవడు నాయందె దర్శించునెల్ల వాని, |
| వానికిని నేను దూరపువాడ గాను, |
| వాడు నాకును దూరపువాడు గాడు. |
|
| |
|
| 31. |
| ఎవడు సర్వభూతస్ఠితుడే నటంచు, |
| భజన సేయునో, యేకత్వభావనిరతి, |
| సర్వవిధముల కర్మలుసలిపి కూడ |
| అతడు నాయందె వర్తించునట్టి యోగి. |
|
| |
|
| 32. |
| సుఖమె కలిగిన, దుఃఖమేచొప్పడిలిన |
| భూతచయ మెట్టిదేనియుపొందు నేని, |
| తనదు సుఖదుఃఖముల భంగితలచు నెవ్వ |
| డట్టి యోగియె శ్రేష్ఠుడౌనని దలంతు. |
|
| |
|
| 33. అర్జునుడనెను: |
| మాధవా!నీవు సర్వ సమత్వబుద్ధి |
| యోగ మిట్లేది జెపితివోయొప్పు మీఱ, |
| మనసు మిక్కిలి చంచలమైన దగుట |
| దీని స్ఠిరమైన స్ఠితిని నేదెలియ నైతి. |
|
| |
|
| 34. |
| చంచలం బెంతయు దృఢ మసాధ్యమయ్యు |
| ఇంద్రియములను మనసు క్షోభింప జేయు, |
| ఇట్టి మనసును నే నిగ్రహింప నెంచ |
| గాలి వలె మూటగట్ట దుష్కరము గాదె. |
|
| |
|
| 35. శ్రీ భగవానుడనెను: |
| సంశయము లేదొకింతయుసవ్యసాచి! |
| మనసు దుర్నిగ్రహమె, చలమైన గాని, |
| ధ్యాన వైరాగ్యముల రెంటినభ్యసించి |
| నిగ్రహింపగ వచ్చునునిశ్చలముగ. |
|
| |
|
| 36. |
| ఆత్మసంయమ మొనరింపనట్టి మూఢు |
| డట్టి యోగము పొంద లేడని తలంతు |
| కాని యత్నముచే వశ్యమానసుండు, |
| పడయ శక్తుండగు నుచితోపాయమునను. |
|
| |
|
| 37. అర్జునుడనెను: |
| శ్రద్ధ గలిగియు, నియమ విరహితు డగుచు, |
| యోగమున మనసు చలించియున్నవాడు, |
| యోగసంసిద్ధి పొందకయుంటె గాక |
| యెట్టి గతి జేరునో కృష్ణ! యెఱుగ జెపుమ. |
|
| |
|
| 38. |
| బ్రహ్మపథమున మూడుడైపరగు మనుజు |
| డిహ పరమ్ములం దాశ్రయమేది లేక, |
| జ్ఞాన కర్మము లీరెంటిగతిని జాఱి, |
| ఛిన్నమేఘము వలె కృష్ణచేటువడడొ. |
|
| |
|
| 39. |
| ఇట్టి నాసంశయమ్మునుకృష్ణ!నీవె, |
| సెలగ నర్హుండ వగుదు నిశ్శేషముగను, |
| ఇట్టి సంశయ మ్మీవుగాకితరు డెవడు |
| త్రుంపగలవాడు నాకెందుదొరక బోడు. |
|
| |
|
| 40. శ్రీ భగవానుడనెను: |
| ఇహమునం గాని, పరము నందేని పార్ఠ! |
| నాశ మొందడు కర్మవినష్టుడయ్యు, |
| వత్స!కళ్యాణకర్ము డెవండు గాని |
| యెట్టి దుర్గతి నేనియుమెట్టబోడు. |
|
| |
|
| 41. |
| అర్జునా!యోగభ్రష్టుడైనవాడు |
| పుణ్యకర్ముల లోకాలుపొంది యచట, |
| పెద్దకాలము నివసించిపిదప బుట్టు, |
| శ్రీయు, శుచియును గలవారిగృహము లందు. |
|
| |
|
| 42. |
| అట్లు కాదేని,భ్రష్టుడైనట్టివాడు |
| జ్ఞానయోగుల కులమందుజననమొందు |
| ఇట్టి జన్మకు తుల్యమౌనితర మొకటి, |
| పొంద దుర్లభ మీలోకమందు మిగుల. |
|
| |
|
| 43. |
| అట్టి జన్మము బొందినయట్టి యోగి |
| పూర్వదైహిక సంస్కారబుద్ధి నొంది, |
| అట్టి సంస్కారము వలననతడు మరల, |
| చేయు నత్యంతయత్నముసిద్ధి బొంద. |
|
| |
|
| 44. |
| పూర్వదైహికాబ్యాసమెప్రోత్సహింప, |
| లాగబడు నాత డవశుడైయోగ దిశకు, |
| అతడు యోగజిజ్ఞాసువేయైన గూడ, |
| కడువ గలుగును వేదోక్తకర్మఫలము. |
|
| |
|
| 45. |
| కాని, యత్యంతయత్నముజ్ఞాని సలిపి, |
| విగతకల్మషు డగుచు, బవిత్రు డగుచు, |
| వాని బహుజన్మ సంస్కారఫలితమైన, |
| పరమపదమును బిమ్మటబడయు నతడు. |
|
| |
|
| 46. |
| ధ్యాన యోగియె నధికుడౌతపసి కన్న, |
| ధ్యాన యోగియె మిన్న శాస్త్రజ్ఞు కన్న, |
| ధ్యానయోగియె కర్మఠుకన్న మిన్న, |
| కాన,అర్జునా!యోగివికమ్ము నీవు. |
|
| |
|
| 47. |
| అంతరాత్మను నాయందెహత్తియుంచి, |
| ఎవడు శ్రద్ధాళువై భజియించు నన్నె, |
| యోగు లందెల్ల నాధ్యానయోగి వరుని |
| సర్వతః శ్రేష్ఠుగా నేనుసమ్మతింతు. |
|
| |
|
|
| |
| 1. శ్రీభగవానువాచ: |
| అనాశ్రితః కర్మఫలం |
| కార్యం కర్మ కరోతి యః |
| స సంన్యాసీ చ యోగీ |
| చ న నిరగ్నిర్న చాక్రియః |
|
| |
|
| 2. |
| యం సంన్యాసమితి ప్రాహు |
| ర్యోగం తం విద్ధి పాణ్డవ |
| న హ్యసంన్యస్తసంకల్పో |
| యోగీ భవతి కశ్చన |
|
| |
|
| 3. |
| ఆరురుక్షోర్మునేర్యోగం |
| కర్మ కారణముచ్యతే |
| యోగారూఢస్య తస్యైవ |
| శమః కారణముచ్యతే |
|
| |
|
| 4. |
| యదా హి నేన్ద్రియార్థేషు |
| న కర్మస్వనుషజ్జతే |
| సర్వసంకల్పసంన్యాసీ |
| యోగారూఢస్తదోచ్యతే |
|
| |
|
| 5. |
| ఉద్ధరేదాత్మనాత్మానం |
| నాత్మానమవసాదయేత్ |
| ఆత్మైవ హ్యాత్మనో బన్ధు |
| రాత్మైవ రిపురాత్మనః |
Play This Verse |
| |
|
| 6. |
| బన్ధురాత్మాత్మనస్తస్య |
| యేనాత్మైవాత్మనా జితః |
| అనాత్మనస్తు శత్రుత్వే |
| వర్తేతాత్మైవ శత్రువత్ |
|
| |
|
| 7. |
| జితాత్మనః ప్రశాన్తస్య |
| పరమాత్మా సమాహితః |
| శీతోష్ణసుఖదుఃఖేషు |
| తథా మానాపమానయోః |
|
| |
|
| 8. |
| జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా |
| కూటస్థో విజితేన్ద్రియః |
| యుక్త ఇత్యుచ్యతే యోగీ |
| సమలోష్టాశ్మకాఞ్చనః |
|
| |
|
| 9. |
| సుహృన్మిత్రార్యుదాసీ |
| నమధ్యస్థద్వేష్యబన్ధుషు |
| సాధుష్వపి చ పాపేషు |
| సమబుద్ధిర్విశిష్యతే ౯ |
|
| |
|
| 10. |
| యోగీ యుఞ్జీత సతత |
| మాత్మానం రహసి స్థితః |
| ఏకాకీ యతచిత్తాత్మా |
| నిరాశీరపరిగ్రహః ౦ |
|
| |
|
| 11. |
| శుచౌ దేశే ప్రతిష్ఠాప్య |
| స్థిరమాసనమాత్మనః |
| నాత్యుచ్ఛ్రితం నాతినీచం |
| చైలాజినకుశోత్తరమ్ |
|
| |
|
| 12. |
| తత్రైకాగ్రం మనః కృత్వా |
| యతచిత్తేన్ద్రియక్రియః |
| ఉపవిశ్యాసనే యుఞ్జ్యా |
| ద్యోగమాత్మవిశుద్ధయే |
|
| |
|
| 13. |
| సమం కాయశిరోగ్రీవం |
| ధారయన్నచలం స్థిరః |
| సమ్ప్రేక్ష్య నాసికాగ్రం |
| స్వం దిశశ్చానవలోకయన్ |
|
| |
|
| 14. |
| ప్రశాన్తాత్మా విగతభీ |
| ర్బ్రహ్మచారివ్రతే స్థితః |
| మనః సంయమ్య మచ్చిత్తో |
| యుక్త ఆసీత మత్పరః |
|
| |
|
| 15. |
| యుఞ్జన్నేవం సదాత్మానం |
| యోగీ నియతమానసః |
| శాన్తిం నిర్వాణపరమాం |
| మత్సంస్థామధిగచ్ఛతి |
|
| |
|
| 16. |
| నాత్యశ్నతస్తు యోగోఽస్తి |
| న చైకాన్తమనశ్నతః |
| న చాతి స్వప్నశీలస్య |
| జాగ్రతో నైవ చార్జున |
|
| |
|
| 17. |
| యుక్తాహారవిహారస్య |
| యుక్తచేష్టస్య కర్మసు |
| యుక్తస్వప్నావబోధస్య |
| యోగో భవతి దుఃఖహా |
|
| |
|
| 18. |
| యదా వినియతం చిత్త |
| మాత్మన్యేవావతిష్ఠతే |
| నిఃస్పృహః సర్వకామేభ్యో |
| యుక్త ఇత్యుచ్యతే తదా |
|
| |
|
| 19. |
| యథా దీపో నివాతస్థో |
| నేఙ్గతే సోపమా స్మృతా |
| యోగినో యతచిత్తస్య |
| యుఞ్జతో యోగమాత్మనః ౯ |
|
| |
|
| 20. |
| యత్రోపరమతే చిత్తం |
| నిరుద్ధం యోగసేవయా |
| యత్ర చైవాత్మనాత్మానం |
| పశ్యన్నాత్మని తుష్యతి ౦ |
|
| |
|
| 21. |
| సుఖమాత్యన్తికం యత్తద్ |
| బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |
| వేత్తి యత్ర న చైవాయం |
| స్థితశ్చలతి తత్త్వతః |
|
| |
|
| 22. |
| యం లబ్ధ్వా చాపరం లాభం |
| మన్యతే నాధికం తతః |
| యస్మిన్స్థితో న దుఃఖేన |
| గురుణాపి విచాల్యతే |
|
| |
|
| 23. |
| తం విద్యాద్‌దుఃఖసంయోగ |
| వియోగం యోగసంజ్ఞితమ్ |
| స నిశ్చయేన యోక్తవ్యో |
| యోగోఽనిర్విణ్ణచేతసా |
|
| |
|
| 24. |
| సంకల్పప్రభవాన్కామాం |
| స్త్యక్త్వా సర్వానశేషతః |
| మనసైవేన్ద్రియగ్రామం |
| వినియమ్య సమన్తతః |
|
| |
|
| 25. |
| శనైః శనైరుపరమేద్ |
| బుద్ధ్యా ధృతిగృహీతయా |
| ఆత్మసంస్థం మనః కృత్వా |
| న కించిదపి చిన్తయేత్ |
Play This Verse |
| |
|
| 26. |
| యతో యతో నిశ్చరతి |
| మనశ్చఞ్చలమస్థిరమ్ |
| తతస్తతో నియమ్యైత |
| దాత్మన్యేవ వశం నయేత్ |
Play This Verse |
| |
|
| 27. |
| ప్రశాన్తమనసం హ్యేనం |
| యోగినం సుఖముత్తమమ్ |
| ఉపైతి శాన్తరజసం |
| బ్రహ్మభూతమకల్మషమ్ |
|
| |
|
| 28. |
| యుఞ్జన్నేవం సదాత్మానం |
| యోగీ విగతకల్మషః |
| సుఖేన బ్రహ్మసంస్పర్శ |
| మత్యన్తం సుఖమశ్నుతే |
|
| |
|
| 29. |
| సర్వభూతస్థమాత్మానం |
| సర్వభూతాని చాత్మని |
| ఈక్షతే యోగయుక్తాత్మా |
| సర్వత్ర సమదర్శనః ౯ |
Play This Verse |
| |
|
| 30. |
| యో మాం పశ్యతి సర్వత్ర |
| సర్వం చ మయి పశ్యతి |
| తస్యాహం న ప్రణశ్యామి |
| స చ మే న ప్రణశ్యతి ౦ |
|
| |
|
| 31. |
| సర్వభూతస్థితం యో మాం |
| భజత్యేకత్వమాస్థితః |
| సర్వథా వర్తమానోఽపి స |
| యోగీ మయి వర్తతే |
|
| |
|
| 32. |
| ఆత్మౌపమ్యేన సర్వత్ర |
| సమం పశ్యతి యోఽర్జున |
| సుఖం వా యది వా దుఃఖం |
| స యోగీ పరమో మతః |
|
| |
|
| 33. అర్జున ఉవాచ: |
| యోఽయం యోగస్త్వయా ప్రోక్తః |
| సామ్యేన మధుసూదన |
| ఏతస్యాహం న పశ్యామి |
| చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్ |
|
| |
|
| 34. |
| చఞ్చలం హి మనః కృష్ణ |
| ప్రమాథి బలవద్‌దృఢమ్ |
| తస్యాహం నిగ్రహం మన్యే |
| వాయోరివ సుదుష్కరమ్ |
|
| |
|
| 35. శ్రీభగవానువాచ: |
| అసంశయం మహాబాహో |
| మనో దుర్నిగ్రహం చలమ్ |
| అభ్యాసేన తు కౌన్తేయ |
| వైరాగ్యేణ చ గృహ్యతే |
|
| |
|
| 36. |
| అసంయతాత్మనా యోగో |
| దుష్ప్రాప ఇతి మే మతిః |
| వశ్యాత్మనా తు యతతా |
| శక్యోఽవాప్తుముపాయతః |
|
| |
|
| 37. అర్జున ఉవాచ: |
| అయతిః శ్రద్ధయోపేతో |
| యోగాచ్చలితమానసః |
| అప్రాప్య యోగసంసిద్ధిం |
| కాం గతిం కృష్ణ గచ్ఛతి |
|
| |
|
| 38. |
| కచ్చిన్నోభయవిభ్రష్ట |
| శ్ఛిన్నాభ్రమివ నశ్యతి |
| అప్రతిష్ఠో మహాబాహో |
| విమూఢో బ్రహ్మణః పథి |
|
| |
|
| 39. |
| ఏతన్మే సంశయం కృష్ణ |
| ఛేత్తుమర్హస్యశేషతః |
| త్వదన్యః సంశయస్యాస్య |
| ఛేత్తా న హ్యుపపద్యతే ౯ |
|
| |
|
| 40. శ్రీభగవానువాచ: |
| పార్థ నైవేహ నాముత్ర |
| వినాశస్తస్య విద్యతే |
| న హి కల్యాణకృత్కశ్చిద్ |
| దుర్గతిం తాత గచ్ఛతి ౦ |
|
| |
|
| 41. |
| ప్రాప్య పుణ్యకృతాం లోకా |
| నుషిత్వా శాశ్వతీః సమాః |
| శుచీనాం శ్రీమతాం గేహే |
| యోగభ్రష్టోఽభిజాయతే |
|
| |
|
| 42. |
| అథవా యోగినామేవ |
| కులే భవతి ధీమతామ్ |
| ఏతద్ధి దుర్లభతరం |
| లోకే జన్మ యదీదృశమ్ |
|
| |
|
| 43. |
| తత్ర తం బుద్ధిసంయోగం |
| లభతే పౌర్వదేహికమ్ |
| యతతే చ తతో భూయః |
| సంసిద్ధౌ కురునన్దన |
|
| |
|
| 44. |
| పూర్వాభ్యాసేన తేనైవ |
| హ్రియతే హ్యవశోఽపి సః |
| జిజ్ఞాసురపి యోగస్య |
| శబ్దబ్రహ్మాతివర్తతే |
|
| |
|
| 45. |
| ప్రయత్నాద్యతమానస్తు |
| యోగీ సంశుద్ధకిల్బిషః |
| అనేకజన్మసంసిద్ధ |
| స్తతో యాతి పరాం గతిమ్ |
|
| |
|
| 46. |
| తపస్విభ్యోఽధికో యోగీ |
| జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
| కర్మిభ్యశ్చాధికో యోగీ |
| తస్మాద్యోగీ భవార్జున |
|
| |
|
| 47. |
| యోగినామపి సర్వేషాం |
| మద్గతేనాన్తరాత్మనా |
| శ్రద్ధావాన్ భజతే యో మాం |
| స మే యుక్తతమో మతః |
|
| |
|
|