| |
| 1. |
| కర్మసన్యాసమును జేయ గడగు మనియు, |
| చెప్పెదవు కర్మయోగంబె చేయ మరల, |
| శ్రేయ మేదియొ నీరెంట జెపుమ కృష్ణ! |
| ఒక్కదానినే నిశ్చయ మొనరజేసి |
|
| |
|
| 2. శ్రీ భగవానుడనెను: |
| కర్మసన్యాస కర్మయో గములు రెండు |
| ధరణి జనులకు మోక్షప్ర దాయకములె |
| కర్మయోగము త్యాగము కన్న గూడ |
| శ్రేష్ఠతరమగు పార్థ యీ రెంటి లోన |
|
| |
|
| 3. |
| ఇచ్చ మచ్చరముల బాసి యెవ్వ డుండు, |
| అరయదగు వాని నిత్య స న్యాసి గాను |
| ద్వంద్వరహితుండె సంసార బంధములను |
| పాయు సులభముగా మహా బాహువీర! |
|
| |
|
| 4. |
| కర్మసన్యాస కర్మయో గమ్ములకును |
| ఫలము వేర్వేరటంచు న ల్పజ్ఞు లండ్రు, |
| అందు నొకటైన జక్కగా నాచరింప |
| నబ్బు నీరెంటి ఫలమని ఆర్యులంద్రు |
|
| |
|
| 5. |
| సాంఖ్యయోగులు బొందెడు స్థాన మేదొ, |
| కర్మయోగులు జేరెడు గమ్యమదియె, |
| జ్ఞాన కర్మము లొకటిగా గాంచు నెవ్వ |
| డాతడె యథార్థజ్ఞాన మరయువాడు |
|
| |
|
| 6. |
| కర్మనిష్కాముగ జేయ గడగ కున్న |
| కర్మసన్యాస మబ్బుట కష్ట తరము, |
| కరము నిష్కామముగ మౌని కర్మ సలిపి |
| శీఘ్రమే బ్రహ్మ పదమును జేర వచ్చు |
|
| |
|
| 7. |
| నిర్మలాత్ముడు, నిష్కామ నిష్ఠయోగి, |
| నియతశారీరి, యింద్రియ నిగ్రహుండు, |
| సర్వభూతాత్మ తనయాత్మ సర్వమొకటె |
| యని తెలిసి చేయ, కర్మము లంటవతని |
|
| |
|
| 8. |
| తత్త్వవేత్తయు, యోగయు క్తాత్మకుండు |
| ఇంచుకేనియు దాజేయ నంచు దలచు, |
| చూచి, విని, తాకి, వాసన జూచుచుండి, |
| తినియు, శ్వాసించి, నడచి, నిద్రించియైన |
|
| |
|
| 9. |
| ఇచ్చియును, బుచ్చుకొనుచు, భా షించుచుండి |
| కనులు దెఱచియు, మూసియు కర్మయోగి |
| ఇంద్రియములన్ని విషయాల నెపుడు దవిలి, |
| తిరిగెడు నటంచు నిక్కము దెలిసియుండు |
|
| |
|
| 10. |
| కర్మఫలసంగములవీడ గలిగి యెవడు, |
| ఫలము బ్రహ్మార్పణంబని పనులు సేయు, |
| అతడు పాపపుణ్యములచే నంటువడడు, |
| తామరాకును నీరము తాకనట్లు |
|
| |
|
| 11. |
| మమతబాసిన సర్వేంద్రి యములచేత, |
| తనువుచే బుద్ధిచేతను మనసుచేత, |
| కర్మయోగులు ఫలమందు కాంక్ష బాసి |
| ఆత్మసంశుద్ధికై కర్మ మాచరింత్రు |
|
| |
|
| 12. |
| కర్మజాతఫలంబుల కాంక్ష బాసి, |
| పరమనైష్ఠికశాంతిని బడయు యోగి, |
| కామపరవశుడై, ఫల కాంక్షయందు |
| సక్తుడై బద్ధుడగుచుండ యుక్తరాగి |
|
| |
|
| 13. |
| సర్వకర్మల మనసార సంత్యజించి, |
| కారయితగాక చేయ దా కర్త గాక, |
| పరమసుఖమును వశి నవ ద్వార యుక్త |
| పురమనెడు దేహ మందున పొందు చుండు |
|
| |
|
| 14. |
| కర్మకర్తృత్వమును గాని కర్మ గాని, |
| కలుగ జేయడు ప్రభువు లో కమున కొకటి, |
| కర్మఫలయోగమునకైన కర్త గాడు, |
| పఱగు నవి యన్ని ప్రకృతిస్వ భావమునను |
|
| |
|
| 15. |
| పాపపుణ్యము లొకనివి ప్రభువు గొనడు, |
| కర్మ కారణ మాతడు కాదు గాన, |
| జ్ఞానమును కప్పియుంట న జ్ఞాన మెపుడు, |
| మోహమందున జీవులు మునిగి యుంద్రు |
|
| |
|
| 16. |
| కాని, యెవరి యజ్ఞానాంధ కారమెల్ల |
| నాశితంబగు నాత్మవి జ్ఞానమునను, |
| వారి యా జ్ఞానమే పర బ్రహ్మపదము, |
| దీప్తి మంతము జేయు నా దిత్యు భంగి |
Play This Verse |
| |
|
| 17. |
| బ్రహ్మబుద్ధులు, బ్రహ్మాత్మ భావనులును, |
| బ్రహ్మనిష్ఠులు, బ్రహ్మప రాయణులును, |
| జ్ఞాననిర్ధూతకల్మషు లైనవారు |
| పొందుదురు పునర్జన్మ వి ముక్తపదము |
Play This Verse |
| |
|
| 18. |
| వినయమును, విద్యయుంగల విప్రునందు, |
| గోవు నందున కరియందు కుక్కయందు, |
| కుక్కపాల గుడ్చు చండాల కులజునందు, |
| పండితులు, సమదర్శనుల్ బ్రహ్మగాంత్రు |
Play This Verse |
| |
|
| 19. |
| చిత్తమెవరిది సమమైన స్థితిని నుండు, |
| వారు తరియింతు రిలనె సం సార వనధి, |
| బ్రహ్మ సమదర్శియును దోష రహితుడగుట |
| వార లుందురు స్థిరముగా బ్రహ్మమందు |
|
| |
|
| 20. |
| బ్రహ్మవేత్తయు, మోహవి వర్జితుండు, |
| స్థిరమతియును, బ్రాహ్మీస్థిత చిత్తశీలి, |
| సంతసింపడు సుఖములు సంభవింప, |
| వంత జెందడు దుఃఖాలు ప్రాప్తమైన |
|
| |
|
| 21. |
| బాహ్యవిషయాల నాసక్తి బాయు యోగి |
| ఆత్మయందలి సుఖమునే యనుభవించు, |
| బ్రహ్మయోగ వినిష్ఠుడై బఱగి యతడు, |
| అక్షయపరమానందము నందుకొనును |
|
| |
|
| 22. |
| ఎట్టిసుఖములు విషయ ప్ర వృత్తజములొ, |
| కారణం బవే పార్థ! దుః ఖాల కెల్ల, |
| మొదలు తుదియును గలవని బుధు లెఱింగి |
| రతులుగారందు క్షణభంగు రములు గాన |
|
| |
|
| 23. |
| తనువు నిటవీడి నరుడు తా జనక ముందె |
| కామ విక్రోధజన్య వే గములనెల్ల |
| యిహమునందె సమర్థుడై యెవ్వడోపు, |
| ఆతడే యోగి సుఖవంతు డతడె నరుల |
|
| |
|
| 24. |
| అంతరారాము డంత స్సు ఖాధికుండు, |
| అంతరాత్మ ప్రదీప్తుడై యలరు నెవడు, |
| బ్రహ్మభూతస్వరూపము బడసి యిలనె, |
| బ్రహ్మనిర్వాణ మాయోగి బడయు పిదప |
|
| |
|
| 25. |
| సంయతాత్ములు, సంచ్ఛిన్న సంశయులు |
| ప్రాణిచయ హిత మందను ర క్తిమతులు |
| క్షీణకల్మషులైన ఋ షి వ్రజంబు, |
| బ్రహ్మనిర్వాణపదమును బడయుచుంద్రు |
|
| |
|
| 26. |
| కామమును క్రోధమును బాయ గలుగువారు |
| నియతచిత్తులు యింద్రియ నిగ్రహులును, |
| ఆత్మవిజ్ఞానులౌ యతు లందుకొంద్రు, |
| బ్రహ్మనిర్వాణపద మిహ పరములందు |
Play This Verse |
| |
|
| 27. |
| బాహ్యవిషయాల మనసును బఱగ నీక, |
| బొమల నడుమను దృష్టిని బూని నిలిపి, |
| వాయుసంచరన్నాసికా ద్వారమందు, |
| ప్రాణము నపానమును సమ పాళ్ళ నుంచి, |
|
| |
|
| 28. |
| మనసు బుద్ధీంద్రియమ్ముల మసల నీక, |
| భయము రాగము క్రోధము పారద్రోలి, |
| మోక్షమొక్కటె కోరెడు ముని యెవండొ, |
| ఆతడే నిత్యముక్తుడై యలరు వాడు |
Play This Verse |
| |
|
| 29. |
| యజ్ఞతపముల భోక్త నేనగుదునంచు |
| సర్వలోకములకు మహేశ్వరుడ నంచు, |
| ఎల్ల భూతములకు నే సుహృదుడ నంచు, |
| నరయు యోగియె శాంతి సౌఖ్యమ్ములందు. |
|
| |
|
|
| |
| 1. |
| సంన్యాసం కర్మణాం కృష్ణ |
| పునర్యోగం చ శంససి |
| యచ్ఛ్రేయ ఏతయోరేకం |
| తన్మే బ్రూహి సునిశ్చితమ్ |
|
| |
|
| 2. శ్రీభగవానువాచ: |
| సంన్యాసః కర్మయోగశ్చ |
| నిఃశ్రేయసకరావుభౌ |
| తయోస్తు కర్మసంన్యాసా |
| త్కర్మయోగో విశిష్యతే |
|
| |
|
| 3. |
| జ్ఞేయః స నిత్యసంన్యాసీ |
| యో న ద్వేష్టి న కాఙ్క్షతి |
| నిర్ద్వన్ద్వో హి మహాబాహో |
| సుఖం బన్ధాత్ప్రముచ్యతే |
|
| |
|
| 4. |
| సాంఖ్యయోగౌ పృథగ్బాలాః |
| ప్రవదన్తి న పణ్డితాః |
| ఏకమప్యాస్థితః సమ్య |
| గుభయోర్విన్దతే ఫలమ్ |
|
| |
|
| 5. |
| యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం |
| తద్యోగైరపి గమ్యతే |
| ఏకం సాంఖ్యం చ యోగం |
| చ యః పశ్యతి స పశ్యతి |
|
| |
|
| 6. |
| సంన్యాసస్తు మహాబాహో |
| దుఃఖమాప్తుమయోగతః |
| యోగయుక్తో మునిర్బ్రహ్మ |
| నచిరేణాధిగచ్ఛతి |
|
| |
|
| 7. |
| యోగయుక్తో విశుద్ధాత్మా |
| విజితాత్మా జితేన్ద్రియః |
| సర్వభూతాత్మభూతాత్మా |
| కుర్వన్నపి న లిప్యతే |
|
| |
|
| 8. |
| నైవ కించిత్కరోమీతి |
| యుక్తో మన్యేత తత్త్వవిత్ |
| పశ్యఞ్శ్రృణ్వన్స్పృశఞ్జిఘ్ర |
| న్నశ్నన్‌గచ్ఛన్స్వపఞ్శ్వసన్ |
|
| |
|
| 9. |
| ప్రలపన్విసృజన్గృహ్ణ |
| న్నున్మిషన్నిమిషన్నపి |
| ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు |
| వర్తన్త ఇతి ధారయన్౯ |
|
| |
|
| 10. |
| బ్రహ్మణ్యాధాయ కర్మాణి |
| సఙ్గం త్యక్త్వా కరోతి యః |
| లిప్యతే న స పాపేన |
| పద్మపత్రమివామ్భసా ౦ |
|
| |
|
| 11. |
| కాయేన మనసా బుద్ధ్యా |
| కేవలైరిన్ద్రియైరపి |
| యోగినః కర్మ కుర్వన్తి |
| సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే |
|
| |
|
| 12. |
| యుక్తః కర్మఫలం త్యక్త్వా |
| శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్ |
| అయుక్తః కామకారేణ |
| ఫలే సక్తో నిబధ్యతే |
|
| |
|
| 13. |
| సర్వకర్మాణి మనసా |
| సంన్యస్యాస్తే సుఖం వశీ |
| నవద్వారే పురే దేహీ |
| నైవ కుర్వన్న కారయన్ |
|
| |
|
| 14. |
| న కర్తృత్వం న కర్మాణి |
| లోకస్య సృజతి ప్రభుః |
| న కర్మఫలసంయోగం |
| స్వభావస్తు ప్రవర్తతే |
|
| |
|
| 15. |
| నాదత్తే కస్యచిత్పాపం |
| న చైవ సుకృతం విభుః |
| అజ్ఞానేనావృతం జ్ఞానం |
| తేన ముహ్యన్తి జన్తవః |
|
| |
|
| 16. |
| జ్ఞానేన తు తదజ్ఞానం |
| యేషాం నాశితమాత్మనః |
| తేషామాదిత్యవజ్జ్ఞానం |
| ప్రకాశయతి తత్పరమ్ |
Play This Verse |
| |
|
| 17. |
| తద్‌బుద్ధయస్తదాత్మా |
| నస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
| గచ్ఛన్త్యపునరావృత్తిం |
| జ్ఞాననిర్ధూతకల్మషాః |
Play This Verse |
| |
|
| 18. |
| విద్యావినయసంపన్నే |
| బ్రాహ్మణే గవి హస్తిని |
| శుని చైవ శ్వపాకే చ |
| పణ్డితాః సమదర్శినః |
Play This Verse |
| |
|
| 19. |
| ఇహైవ తైర్జితః సర్గో |
| యేషాం సామ్యే స్థితం మనః |
| నిర్దోషం హి సమం బ్రహ్మ |
| తస్మాద్బ్రహ్మణి తే స్థితాః ౯ |
|
| |
|
| 20. |
| న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య |
| నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
| స్థిరబుద్ధిరసంమూఢో |
| బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః |
|
| |
|
| 21. |
| బాహ్యస్పర్శేష్వసక్తాత్మా |
| విన్దత్యాత్మని యత్ సుఖమ్ |
| స బ్రహ్మయోగయుక్తాత్మా |
| సుఖమక్షయమశ్నుతే |
|
| |
|
| 22. |
| యే హి సంస్పర్శజా భోగా |
| దుఃఖయోనయ ఏవ తే |
| ఆద్యన్తవన్తః కౌన్తేయ |
| న తేషు రమతే బుధః |
|
| |
|
| 23. |
| శక్నోతీహైవ యః సోఢుం |
| ప్రాక్శరీరవిమోక్షణాత్ |
| కామక్రోధోద్భవం వేగం |
| స యుక్తః స సుఖీ నరః |
|
| |
|
| 24. |
| యోఽన్తఃసుఖోఽన్తరారామ |
| స్తథాన్తర్జ్యోతిరేవ యః |
| స యోగీ బ్రహ్మనిర్వాణం |
| బ్రహ్మభూతోఽధిగచ్ఛతి |
|
| |
|
| 25. |
| లభన్తే బ్రహ్మనిర్వాణ |
| మృషయః క్షీణకల్మషాః |
| ఛిన్నద్వైధా యతాత్మానః |
| సర్వభూతహితే రతాః |
|
| |
|
| 26. |
| కామక్రోధవియుక్తానాం |
| యతీనాం యతచేతసామ్ |
| అభితో బ్రహ్మనిర్వాణం |
| వర్తతే విదితాత్మనామ్ |
Play This Verse |
| |
|
| 27. |
| స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం |
| శ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః |
| ప్రాణాపానౌ సమౌ కృత్వా |
| నాసాభ్యన్తరచారిణౌ |
|
| |
|
| 28. |
| యతేన్ద్రియమనోబుద్ధి |
| ర్మునిర్మోక్షపరాయణః |
| విగతేచ్ఛాభయక్రోధో యః |
| సదా ముక్త ఏవ సః |
Play This Verse |
| |
|
| 29. |
| భోక్తారం యజ్ఞతపసాం |
| సర్వలోకమహేశ్వరమ్ |
| సుహృదం సర్వభూతానాం |
| జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ౯ |
|
| |
|
|