| |
| 1. శ్రీ భగవానుడనెను: |
| అనఘ! సూర్యున కవ్యయ మైన యిట్టి |
| జ్ఞానయోగము గఱపియున్నాడనేను, |
| వాడు దానిని జెప్పె వై వస్వతునకు, |
| మనువు నిక్ష్వాకునకు జెప్పెమరలదాని |
|
| |
|
| 2. |
| తరతరాలుగ నీరీతితరలు చున్న, |
| నిట్టి యోగము రాజర్షులెఱిగి యుండి |
| రట్టి యోగము దీర్ఘ కాలానుగతిని, |
| భ్రష్టమై సంప్రదాయమునష్టమయ్యె. |
|
| |
|
| 3. |
| నాదు సఖుడవు,భక్తుడ వౌదు గాన, |
| అతిరహస్యము,నుత్తమ మైన యట్టి |
| ఆపురాతనయోగమేనయ్యమరల |
| నేడు వచియించు చుంటినినీకు పార్థ ! |
|
| |
|
| 4. అర్జునుడనెను: |
| ముందు కాదొకొ,సూర్యుండుబుట్టియుంట, |
| నీదు జన్మము,తరువాతకాదొ,కృష్ణ! |
| సృష్టియారంభమున నీవుజెప్పితంటి |
| వెట్టు లీక్లిష్టహక్కు,గ్రహింతునేను. |
|
| |
|
| 5. శ్రీ భగవానుడనెను: |
| జన్మ లెన్నెన్నొ యర్జునాజగతి యందు |
| కడచె నాకును నీకునుగతము నందు, |
| వాని నన్నింటి నెఱిగినవాడ నేను, |
| నీవు మాత్ర మెఱుంగ వవేవి గాని. |
|
| |
|
| 6. |
| అజుడ నయ్యును నే నవ్య యాత్మకుండ |
| సర్వ భూతములకు మహే శ్వరుడ నేను, |
| కాని,నాదు ప్రకృతిని స్వా ధీన పఱచి, |
| ఆత్మమాయచే సంభవ మగుదు నేను. |
|
| |
|
| 7. |
| ఎప్పు డెపుడు,ధర్మమ్మున కిద్ధచరిత |
| హాని గలుగుచు నుండునో యవని యందు |
| ఎప్పు డెపు డధర్మమునకు వృద్ధి గలుగు, |
| నప్పు డపుడ, నాయంతనే నవతరింతు |
|
| |
|
| 8. |
| సాధుజనులను రక్షించిసాకు కొఱకు, |
| దుష్టజనులను తలబట్టిత్రుంచు కొఱకు, |
| పృథ్వి ధర్మము మఱల స్థా పించు కొఱకు |
| యుగ యుగము లందు సంభవ మగుదు నేను. |
|
| |
|
| 9. |
| దివ్యములు జన్మ కర్మముల్ దెలియ నావి, |
| ఇవ్విధంబుగ నాతత్త్వమెవ్వ డెఱుగు |
| దేహమునువీడి జన్మము తిరిగి మరల |
| పొంద డాతడు ఫల్గునా! పొందు నన్నె. |
|
| |
|
| 10. |
| భయము,రాగము,క్రోధముబాసి మదిని, |
| నన్నె యెదగొని,యెపుడు నన్నాశ్రయించి, |
| తనర పలువు రాత్మజ్ఞానతపముచేత |
| పూతులై, నా స్వరూపము బొందినారు. |
|
| |
|
| 11. |
| ఎవ్వ రేభావముల భజి యింత్రొ నన్ను, |
| ఏను వారల నట్టులేయేలికొందు, |
| సర్వవిధముల పూజలుసలిపి జనులు, |
| నాదు మార్గము వెంటనేనడతు రెల్ల. |
|
| |
|
| 12. |
| కర్మజాతఫలంబులకాంక్ష జేసి, |
| ఇతర దేవతలను గొల్తురిలను జనులు, |
| మనుజసంతతికెల్ల నిమ్మహిని పార్థ! |
| కర్మఫలసిద్ధి శీఘ్రమేకలుగు గాదె. |
|
| |
|
| 13. |
| గుణము కర్మల విభజనకనుగుణముగ, |
| సృష్టిజేసితి వర్ణచతుష్టయమును, |
| అట్టి సృష్టికి కర్త నేనైన గూడ, |
| అవ్యయుడ నన్నకర్తగానరయు మీవు. |
|
| |
|
| 14. |
| కర్మ లెట్టివి నన్నంటగట్ట రావు, |
| కర్మఫలమందు నాకెట్టికాంక్ష లేదు, |
| ఎవడకర్త న భోక్త నంచెఱుగు నన్ను, |
| కర్మములచేత నాతడుకట్టు వడడు. |
|
| |
|
| 15. |
| మును ముముక్షువులైన పూర్వులును గూడ, |
| కర్మ సలిపిరి దీని పోకల నెఱింగి, |
| కాన నీవును సల్పుముకర్మ మట్లె, |
| పూర్వు లే తీరు జేసిరోపూర్వ మందు. |
|
| |
|
| 16. |
| కర్మ మెట్టిదొ,యెట్టి దకర్మమగునొ, |
| పండితులు కూడ తెలియకభ్రాంతు లైరి, |
| ఏది తెలియగ నశుభము లెల్ల తొలగు, |
| నట్టి దానిని తెలిపెదనాలకింపు. |
|
| |
|
| 17. |
| ఏది కర్మమొ దాని నీవెఱుగ వలయు, |
| అట్టులే వికర్మమును నీవరయ వలయు, |
| మఱియు నీ వకర్మము గూడనెఱుగ వలయు, |
| కర్మ నిజతత్త్వ మెఱుగుటకష్టతరము. |
|
| |
|
| 18. |
| కర్మ మందున నెవ్వడకర్మ జూచు, |
| కర్మమును జూచు నెవ్వడకర్మ మందు, |
| మనుజు లందున కడుబుద్ధిమంతు డతడె, |
| అతడే యోగి,కృతకృత్యుడైన నతడె. |
|
| |
|
| 19. |
| కామ సంకల్పముల వీడగలిగి యుండి, |
| సకలకర్మము లెవనివిసాగుచుండు, |
| కర్మ లెవనివి జ్ఞానాగ్నికాల్పబడునొ, |
| అట్టి పురుషుని పండితుడండ్రు బుధులు. |
Play This Verse |
| |
|
| 20. |
| కర్మఫలములయందు సంగమును వీడి, |
| సతతసంతృప్తుడై నిరాశ్రయుడు నగుచు, |
| కర్మ మందు ప్రవృత్తినిగలిగి కూడ, |
| వాడు కర్మలు చేయనివాడె యగును. |
|
| |
|
| 21. |
| ఆశల ద్యజించి, నియతచిత్తాత్మకు డయి, |
| త్యక్తసర్వపరిగ్రహుడైనవాడు, |
| జీవయాత్రకు మాత్రమేజేయ కర్మ, |
| పాపపంకిల మాతడుబడయ బోడు. |
|
| |
|
| 22. |
| తనకు దానబ్బు దానితోదనియు వాడు, |
| ద్వంద్వముల కతీతుడు;విమత్సరగుణుండు, |
| సిద్ధ్యసిద్ధుల యెడ సమచిత్తగుండు, |
| కర్మ జేసియు,బద్ధుడుగాడు వాడు. |
Play This Verse |
| |
|
| 23. |
| సంగరహితుడు,ముక్తసంసారజీవి, |
| జ్ఞాననిష్ఠలో స్థిరమతియైన వాడు, |
| ఈశ్వరార్థము కర్మమునెంచి సేయ, |
| ఫల సహితముగ తత్కర్మవిలయ మొందు. |
|
| |
|
| 24. |
| అర్పణము లన్నియును బ్రహ్మ,హవిసు బ్రహ్మ, |
| హుతము హోమాగ్నులును బ్రహ్మ,హోత బ్రహ్మ, |
| బ్రహ్మకర్మసమాధిచేబడయ దగిన, |
| ఫలితమైనను గూడ నాబ్రహ్మమ యగు. |
|
| |
|
| 25. |
| యజ్ఞకర్మము దేవతాయజన మంచు, |
| కొల్చు చుందురు ఫలమెంచికొంత మంది, |
| అన్యయోగులు జీవు జీవాత్మచేత, |
| నాహుతులొసంగు చుంద్రు బ్రహ్మాగ్ని యందు. |
|
| |
|
| 26. |
| ఇతర యోగులు కర్ణాదియింద్రియముల, |
| నాహుతు లొసంగుదురు సంయమాగ్నియందు, |
| అన్యయోగులు సకల శబ్దాదులైన, |
| విషయముల నింద్రియాగ్నినివ్రేల్చుచుంద్రు. |
|
| |
|
| 27. |
| |
| ప్రాణవాయువుల సకలవ్యాపృతులను, |
| ధృతిని యోగులు జ్ఞానప్రదీప్తమైన, |
| యాత్మసంయమయోగాగ్నియందు వేల్తృ. |
|
| |
|
| 28. |
| దానముల,దపోయజ్ఞ సాధనములందు, |
| యజ్ఞభావముగొని కొందఱాచరింత్రు, |
| అట్లె స్వాధ్యాయ ముల,జ్ఞానయజ్ఞములను, |
| యత్నశీలురు,దృఢనిష్ఠులాచరింత్రు. |
|
| |
|
| 29. |
| ప్రాణవాయువువేల్తు రపాన మందు, |
| ప్రాణమున వేల్తు రితరులపాన మట్లె |
| నిగ్రహించి ప్రాణాపాననియతగతుల, |
| హోమ మొనరింత్రు ప్రాణనియామపరులు. |
|
| |
|
| 30. |
| అన్య పురుషులు నియమితాహారులగుచు, |
| ప్రాణవాయువు వేల్తు రద్దాని యందె, |
| యజ్ఞవిదులైన యట్టివారంద ఱిలను, |
| క్షపితకల్మషులైరి యజ్ఞముల చేత. |
|
| |
|
| 31. |
| యజ్ఞశిష్టామృతము గ్రోలునట్టివారు, |
| పరమశాశ్వతమౌ బ్రహ్మపదము గొంద్రు, |
| యజ్ఞహీనుల కీలోకమందె లేదు, |
| యింక పరలోకమున సుఖమెచట పార్థ! |
|
| |
|
| 32. |
| వేదముఖమున నివి బహువిధములైన, |
| యజ్ఞములు విస్తరించి విఖ్యాత మయ్యె, |
| కర్మముల నుండి నివియన్నిగలుగు నంచు, |
| తెలిసికొనినచో బంధాలుతెగును నీకు. |
|
| |
|
| 33. |
| ద్రవ్యమయమైన యజ్ఞకర్మమున కన్న, |
| జ్ఞాన యజ్ఞమె శ్రేష్ఠమైక్రాలు పార్థ! |
| సర్వ కర్మలు నిర్విశేషముగ విజయ! |
| ఆత్మవిజ్ఞానమందె సమాప్త మగును. |
|
| |
|
| 34. |
| తత్త్వ వేత్తల,విజ్ఞానధనుల జేరి, |
| వినయ సాష్టాంగ వందనవిధుల చేత, |
| జ్ఞాన మర్థించి శుశ్రూషసలుపుచుండి, |
| తెలియవిను వారి జ్ఞానోపదేశ మీవు. |
|
| |
|
| 35. |
| బ్రహ్మవిజ్ఞాన మేదీవుబడసియున్న, |
| మోహ మీగతి మరితిర్గిపొంద బోవొ, |
| జ్ఞాన మద్దాని చే భూతజాల మెల్ల, |
| చూచి నీయందు, నాయందుజూతు వట్లె. |
|
| |
|
| 36. |
| పాపులందెల్ల మిక్కిలిపాపివయ్యు, |
| పాపకృత్యములకు లెస్సపాలుపడియు, |
| దాటగావచ్చు పాపపుతరణి పెలుచ, |
| సర్వమును జ్ఞానమను తెప్పసాయముననె. |
|
| |
|
| 37. |
| మండుమంటలు సమిధలపిండు నెట్లు, |
| కాల్చివేయునో భస్మముగాగ పార్థ! |
| అట్లె కర్మజాలమును,జ్ఞానానలంబు, |
| సర్వమును కాల్చివేయు భస్మమ్ముగాగ. |
Play This Verse |
| |
|
| 38. |
| జ్ఞాన సదృశమైన పవిత్రకారి విజయ! |
| లేదు లోకమునందు వేరేది కాని, |
| యోగసిద్ధుడు తాను కాలోచితముగ, |
| జ్ఞాన మయ్యది తనలోనెకాంచగలుగు. |
Play This Verse |
| |
|
| 39. |
| శ్రద్ధగలవానికి,గురుపరాయణునకు, |
| నిర్జితేంద్రియునకు జ్ఞాననిష్ఠయబ్బు, |
| ఆత్మవిజ్ఞానమును పొందియతడు పార్థ! |
| పరమశాంతిని శీఘ్రమేపడయ గలడు. |
Play This Verse |
| |
|
| 40. |
| జ్ఞానశూన్యుడు,శ్రద్ధావిహీనమతియు, |
| సంశయాత్మకుడైన యాజనుడు చెడును, |
| లేదిహమ్మును వానికిలేదు పరము, |
| లేదు సుఖమైన వానికిలేశ మేని. |
Play This Verse |
| |
|
| 41. |
| యోగమున సర్వకర్మలనీగువాని, |
| జ్ఞాన సంఛిన్నసంశయుడైనవాని, |
| ఆత్మనిష్ఠలో సుస్థిరుడైనవాని, |
| కర్మ లెట్టివి యైననుకట్టరావు. |
|
| |
|
| 42. |
| కాన నజ్ఞానజన్యమైకాలుచుండి, |
| ఆత్మ విషయాన నీహృదిహత్తుకొన్న, |
| సంశయము పార్థ!జ్ఞానాసిదీసమయజేసి, |
| యోగయుక్తు డవై లెమ్ముయుద్ధమునకు. |
|
| |
|
|
| |
| 1. శ్రీభగవానువాచ: |
| ఇమం వివస్వతే యోగం |
| ప్రోక్తవానహమవ్యయమ్ |
| వివస్వాన్మనవే ప్రాహ |
| మనురిక్ష్వాకవేఽబ్రవీత్ |
|
| |
|
| 2. |
| ఏవం పరమ్పరాప్రాప్త |
| మిమం రాజర్షయో విదుః |
| స కాలేనేహ మహతా |
| యోగో నష్టః పరన్తప |
|
| |
|
| 3. |
| స ఏవాయం మయా తేఽద్య |
| యోగః ప్రోక్తః పురాతనః |
| భక్తోఽసి మే సఖా చేతి |
| రహస్యం హ్యేతదుత్తమమ్ |
|
| |
|
| 4. అర్జున ఉవాచ: |
| అపరం భవతో జన్మ |
| పరం జన్మ వివస్వతః |
| కథమేతద్విజానీయాం |
| త్వమాదౌ ప్రోక్తవానితి |
|
| |
|
| 5. శ్రీభగవానువాచ: |
| బహూని మే వ్యతీతాని |
| జన్మాని తవ చార్జున |
| తాన్యహం వేద సర్వాణి |
| న త్వం వేత్థ పరన్తప |
|
| |
|
| 6. |
| అజోఽపి సన్నవ్యయాత్మా |
| భూతానామీశ్వరోఽపి సన్ |
| ప్రకృతిం స్వామధిష్ఠాయ |
| సంభవామ్యాత్మమాయయా |
|
| |
|
| 7. |
| యదా యదా హి ధర్మస్య |
| గ్లానిర్భవతి భారత |
| అభ్యుత్థానమధర్మస్య |
| తదాత్మానం సృజామ్యహమ్ |
|
| |
|
| 8. |
| పరిత్రాణాయ సాధూనాం |
| వినాశాయ చ దుష్కృతామ్ |
| ధర్మసంస్థాపనార్థాయ |
| సమ్భవామి యుగే యుగే |
|
| |
|
| 9. |
| జన్మ కర్మ చ మే దివ్య |
| మేవం యో వేత్తి తత్త్వతః |
| త్యక్త్వా దేహం పునర్జన్మ |
| నైతి మామేతి సోఽర్జున ౯ |
|
| |
|
| 10. |
| వీతరాగభయక్రోధా |
| మన్మయా మాముపాశ్రితాః |
| బహవో జ్ఞానతపసా |
| పూతా మద్భావమాగతాః ౦ |
|
| |
|
| 11. |
| యే యథా మాం ప్రపద్యన్తే |
| తాంస్తథైవ భజామ్యహమ్ |
| మమ వర్త్మానువర్తన్తే |
| మనుష్యాః పార్థ సర్వశః |
|
| |
|
| 12. |
| కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం |
| యజన్త ఇహ దేవతాః |
| క్షిప్రం హి మానుషే |
| లోకే సిద్ధిర్భవతి కర్మజా |
|
| |
|
| 13. |
| చాతుర్వర్ణ్యం మయా సృష్టం |
| గుణకర్మవిభాగశః |
| తస్య కర్తారమపి మాం |
| విద్ధ్యకర్తారమవ్యయమ్ |
|
| |
|
| 14. |
| న మాం కర్మాణి లిమ్పన్తి |
| న మే కర్మఫలే స్పృహా |
| ఇతి మాం యోఽభిజానాతి |
| కర్మభిర్న స బధ్యతే |
|
| |
|
| 15. |
| ఏవం జ్ఞాత్వా కృతం కర్మ |
| పూర్వైరపి ముముక్షుభిః |
| కురు కర్మైవ తస్మాత్త్వం |
| పూర్వైః పూర్వతరం కృతమ్ |
|
| |
|
| 16. |
| కిం కర్మ కిమకర్మేతి |
| కవయోఽప్యత్ర మోహితాః |
| తత్తే కర్మ ప్రవక్ష్యామి |
| యజ్జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ |
|
| |
|
| 17. |
| కర్మణో హ్యపి బోద్ధవ్యం |
| బోద్ధవ్యం చ వికర్మణః |
| అకర్మణశ్చ బోద్ధవ్యం |
| గహనా కర్మణో గతిః |
|
| |
|
| 18. |
| కర్మణ్యకర్మ యః పశ్యే |
| దకర్మణి చ కర్మ యః |
| స బుద్ధిమాన్మనుష్యేషు |
| స యుక్తః కృత్స్నకర్మకృత్ |
|
| |
|
| 19. |
| యస్య సర్వే సమారమ్భాః |
| కామసంకల్పవర్జితాః |
| జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం |
| తమాహుః పణ్డితం బుధాః౯ |
Play This Verse |
| |
|
| 20. |
| త్యక్త్వా కర్మఫలాసఙ్గం |
| నిత్యతృప్తో నిరాశ్రయః |
| కర్మణ్యభిప్రవృత్తోఽపి |
| నైవ కించిత్కరోతి సః |
|
| |
|
| 21. |
| నిరాశీర్యతచిత్తాత్మా |
| త్యక్తసర్వపరిగ్రహః |
| శారీరం కేవలం కర్మ |
| కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ |
|
| |
|
| 22. |
| యదృచ్ఛాలాభసంతుష్టో |
| ద్వన్ద్వాతీతో విమత్సరః |
| సమః సిద్ధావసిద్ధౌ చ |
| కృత్వాపి న నిబధ్యతే |
Play This Verse |
| |
|
| 23. |
| గతసఙ్గస్య ముక్తస్య |
| జ్ఞానావస్థితచేతసః |
| యజ్ఞాయాచరతః కర్మ |
| సమగ్రం ప్రవిలీయతే |
|
| |
|
| 24. |
| బ్రహ్మార్పణం బ్రహ్మ హవి |
| ర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
| బ్రహ్మైవ తేన గన్తవ్యం |
| బ్రహ్మకర్మసమాధినా |
|
| |
|
| 25. |
| దైవమేవాపరే యజ్ఞం |
| యోగినః పర్యుపాసతే |
| బ్రహ్మాగ్నావపరే యజ్ఞం |
| యజ్ఞేనైవోపజుహ్వతి |
|
| |
|
| 26. |
| శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే |
| సంయమాగ్నిషు జుహ్వతి |
| శబ్దాదీన్విషయానన్య |
| ఇన్ద్రియాగ్నిషు జుహ్వతి |
|
| |
|
| 27. |
| సర్వాణీన్ద్రియకర్మాణి |
| ప్రాణకర్మాణి చాపరే |
| ఆత్మసంయమయోగాగ్నౌ |
| జుహ్వతి జ్ఞానదీపితే |
|
| |
|
| 28. |
| ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా |
| యోగయజ్ఞాస్తథాపరే |
| స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ |
| యతయః సంశితవ్రతాః |
|
| |
|
| 29. |
| అపానే జుహ్వతి ప్రాణం |
| ప్రాణేఽపానం తథాపరే |
| ప్రాణాపానగతీ రుద్ధ్వా |
| ప్రాణాయామపరాయణాః౯ |
|
| |
|
| 30. |
| అపరే నియతాహారాః |
| ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి |
| సర్వేఽప్యేతే యజ్ఞవిదో |
| యజ్ఞక్షపితకల్మషాః |
|
| |
|
| 31. |
| యజ్ఞశిష్టామృతభుజో |
| యాన్తి బ్రహ్మ సనాతనమ్ |
| నాయం లోకోఽస్త్యయజ్ఞస్య |
| కుతోఽన్యః కురుసత్తమ |
|
| |
|
| 32. |
| ఏవం బహువిధా యజ్ఞా |
| వితతా బ్రహ్మణో ముఖే |
| కర్మజాన్విద్ధి తాన్సర్వా |
| నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే |
|
| |
|
| 33. |
| శ్రేయాన్ద్రవ్యమయాద్య |
| జ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరన్తప |
| సర్వం కర్మాఖిలం పార్థ |
| జ్ఞానే పరిసమాప్యతే |
|
| |
|
| 34. |
| తద్విద్ధి ప్రణిపాతేన |
| పరిప్రశ్నేన సేవయా |
| ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం |
| జ్ఞానినస్తత్త్వదర్శినః |
|
| |
|
| 35. |
| యజ్జ్ఞాత్వా న పునర్మోహ |
| మేవం యాస్యసి పాణ్డవ |
| యేన భూతాన్యశేషేణ |
| ద్రక్ష్యస్యాత్మన్యథో మయి |
|
| |
|
| 36. |
| అపి చేదసి పాపేభ్యః |
| సర్వేభ్యః పాపకృత్తమః |
| సర్వం జ్ఞానప్లవేనైవ |
| వృజినం సన్తరిష్యసి |
|
| |
|
| 37. |
| యథైధాంసి సమిద్ధోఽగ్ని |
| ర్భస్మసాత్కురుతేఽర్జున |
| జ్ఞానాగ్నిః సర్వకర్మాణి |
| భస్మసాత్కురుతే తథా |
Play This Verse |
| |
|
| 38. |
| న హి జ్ఞానేన సదృశం |
| పవిత్రమిహ విద్యతే |
| తత్స్వయం యోగసంసిద్ధః |
| కాలేనాత్మని విన్దతి |
Play This Verse |
| |
|
| 39. |
| శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం |
| తత్పరః సంయతేన్ద్రియః |
| జ్ఞానం లబ్ధ్వా పరాం |
| శాన్తిమచిరేణాధిగచ్ఛతి ౯ |
Play This Verse |
| |
|
| 40. |
| జ్ఞశ్చాశ్రద్దధానశ్చ |
| అసంశయాత్మా వినశ్యతి |
| నాయం లోకోఽస్తి న పరో |
| న సుఖం సంశయాత్మనః ౦ |
Play This Verse |
| |
|
| 41. |
| యోగసంన్యస్తకర్మాణం |
| జ్ఞానసంఛిన్నసంశయమ్ |
| ఆత్మవన్తం న కర్మాణి |
| నిబధ్నన్తి ధనంజయ |
|
| |
|
| 42. |
| తస్మాదజ్ఞానసమ్భూతం |
| హృత్స్థం జ్ఞానాసినాత్మనః |
| ఛిత్త్వైనం సంశయం యోగ |
| మాతిష్ఠోత్తిష్ఠ భారత |
|
| |
|
|