| |
| 1. అర్జునుడనెను: |
| జ్ఞాననిష్ఠయె కర్మము సలుపుకన్న |
| మిన్నయని నీ యభిప్రాయ మేని యిపుడు |
| ఘోరమౌ యుద్ధ కర్మము కోరి సలుప |
| కేశవా! యేల నను నియోగింతు వీవు? |
|
| |
|
| 2. |
| కలగలపులైన చతుర వాక్యముల తోడ, |
| నాదుబుద్ధిని భ్రమగొల్పునట్టు లుంటి, |
| శ్రేయమొనగూడు నెద్దానిచేత నాకు, |
| ఒక్కటే దాని నిశ్చయమొనర జెపుమ. |
|
| |
|
| 3. శ్రీ భగవానుడనెను: |
| ద్వివిధనిష్ఠల నీలోక విదితముగను, |
| అనఘ! చెప్పితి సృష్ట్యాది యందె నేను, |
| సాంఖ్యులకు జ్ఞానయోగపు సాధనమును, |
| కర్మయోగులు నిష్కామ కర్మ సలుప |
|
| |
|
| 4. |
| విహితకర్మల జేయక విడిచి పుచ్చ |
| పురుషు డెవ్వడు నైష్కర్మ్య మొంద లేడు, |
| కాని కర్మ మాత్రంబె త్యా గంబు జేయ, |
| పొందజాలడు మనుజుడు మోక్షసిద్ధి |
|
| |
|
| 5. |
| కర్మమును జేయ కెపు డొక్క క్షణము గాని |
| మనగ జాలడు జగమందు మనుజు డెవడు, |
| ప్రకృతి జాత గుణంబుల బద్ధుడగుచు |
| కర్మమును జేయ ప్రతిజీవి కడగుచుండు. |
|
| |
|
| 6. |
| సకల కర్మేంద్రియముల యాచరణముడిపి, |
| ఇంద్రియార్థములను మూఢుడెవడు గాని, |
| మనసు నందున వీడకస్మరణ జేయు, |
| తగగ నతడు కపట వర్తనుడు సూవె. |
|
| |
|
| 7. |
| మనసు చేత జ్ఞానేంద్రియ గణము నెవ్వ |
| డణచి యుంచియు, కర్మేంద్రి యముల చేత, |
| కర్మయోగము సలుపు సం గమును వీడి |
| ఆతడే, యర్జునా! శ్రేష్ఠు డైన వాడు. |
|
| |
|
| 8. |
| కాన, కర్మమే శ్రేష్ఠ మ కర్మ కన్న, |
| నియత కర్మము సలుపుము నీవు పార్థ! |
| స్వీయకర్మము నీ విక జేయకున్న, |
| కడువ జాలదు నీ మను గడయుగూడ. |
|
| |
|
| 9. |
| ఈశ్వరార్థము గాకుండు నెట్టి కర్మ, |
| కర్మబద్ధుల జేయు లో కాన నదియె, |
| కాన, భగవదర్థంబుగ కర్మ మీవు |
| ముక్తసంగుడవై నిష్ఠ బూని సలుపు. |
|
| |
|
| 10. |
| ప్రజల నీయజ్ఞముల తోడ సృజన జేసి |
| పల్కెసృష్ట్యాదిలో ప్రజా పతియు నిట్లు, |
| "యజ్ఞముల జేసి యభివృద్ధి నందుకొనుడు, |
| ఇష్టకామమ్ములివియు మీ కిచ్చు బిదికి". |
|
| |
|
| 11. |
| తృప్తి బఱపుడు క్రతువులదేవతలను, |
| వారలిత్తురుమీకు సువర్షములను, |
| అట్టు లన్యోన్యసంభావ్యులయ్యు మీరు, |
| పరమనిశ్రేయస పదంబుబడయ గలరు. |
|
| |
|
| 12. |
| దేవతలు యజ్ఞముల చేత దృప్తి నొంది, |
| యిష్టభోగములను వార లిత్తురుగద, |
| ఇవ్వగొని వారికవి తిరి గివ్వ బోక, |
| తానె కుడుచునొ మ్రుచ్చన దగును వాని. |
|
| |
|
| 13. |
| యజ్ఞశేషము సజ్జను లారగించి |
| సర్వపాప విముక్తులై జనుచు నుంద్రు, |
| కూర్మి తమకోసమే వండి కుడుతు రెవరొ, |
| అఘము భుజియించు పాపాత్ము లట్టి వారె. |
|
| |
|
| 14. |
| అన్నమున ప్రాణికోటి యు త్పన్నమగును |
| అన్నముద్భవమొందు వర్షాంబువులను |
| వర్షములు యజ్ఞకర్మము వలన గలుగు |
| యజ్ఞములుగల్గు సత్కర్మ మాచరింప. |
|
| |
|
| 15. |
| వేదములనుండి కర్మమువెడలె సుమ్ము, |
| పరగు వేదము లక్షరబ్రహ్మ నుండి, |
| వేద మన్నిట వ్యాప్తమైవెలయు గాన, |
| నిత్యమును యజ్ఞమందదినిలిచియుండు. |
|
| |
|
| 16. |
| ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు |
| ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు |
| లోక మందున విషయ వి లోలుడగుచు, |
| వ్యర్థ జీవనుడైన పా పాత్ముడగును. |
|
| |
|
| 17. |
| ననుసరించి ప్రవర్తింప నట్టి వాడు |
| ఆత్మరతిదేలి సంతృప్తిననుభవించు, |
| ఆత్మయందట్లె సంతుష్టుడగు నెవండు, |
| వాని కెట్టి కర్తవ్యముగాని లేదు. |
Play This Verse |
| |
|
| 18. |
| కర్మజేసిన మానిన గాని భువిని, |
| పుణ్యపాపము లతనికి పొసగ బోవు, |
| జ్ఞాని కే ప్రాణితో బ్రయో జనము లేమి |
| వాని కెవ్వని నర్థింప బనియు లేదు. |
Play This Verse |
| |
|
| 19. |
| కాన సతతము పార్థ! ని ష్కామముగను, |
| చేయదగినట్టి కర్మమే చేయు మీవు, |
| అట్లనాసక్తుడై కర్మ మాచరించు, |
| పురుషుడే పరమపదమ్ము పొందగలడు. |
|
| |
|
| 20. |
| కర్మ జనకాదు లెల్ల ని ష్కామముగనె, |
| చేసి పొందిరి పూర్వము చిత్తశుద్ధి, |
| లొక సంగ్రహదృష్టినే లో వహించి, |
| కర్మమును జేయ తగు నీవు కాంక్ష బాసి |
|
| |
|
| 21. |
| శ్రేష్ఠు లెట్టెట్టి కర్మలజేయు చుందు |
| రల్పు లట్టట్టి వానినేయాచ రింత్రు, |
| శ్రేష్ఠు లేప్రమాణములనుస్వీకరింతు |
| రట్టి వానినే యీలోకులనుసరింత్రు. |
Play This Verse |
| |
|
| 22. |
| నాకు కర్తవ్య మీమూడులోకములను, |
| కొంచెమైనను లేదోయికుంతి పుత్ర! |
| పొందనిది,పొందతగినదియెందు లేదు, |
| కాని వర్తింతు నెపుడు నేకర్మమందె. |
Play This Verse |
| |
|
| 23. |
| అప్రమత్తుడనై నేనొ కప్పుడేని, |
| కర్మ మందు ప్రవృత్తుడ గాక యున్న, |
| సర్వవిధముల నను జూచి సకల జనులు |
| నాదు మార్గము వెంటనే నడతురుగద. |
Play This Verse |
| |
|
| 24. |
| కర్మ నే జేయకున్న లో కములు పార్థ! |
| నడచి, చెడుమార్గములయందు నష్ట పడును, |
| కర్తనయ్యును వర్ణ సం కరమునకును, |
| ప్రజల చేజేత చెఱిచిన వాడ నగుదు. |
|
| |
|
| 25. |
| పాండవా పామరజనంబు వసుధలోన |
| సక్తులై యెట్లు కర్మల సలుపు వారొ, |
| వదలి యాకాంక్షనెల్ల వి ద్వాంసు లట్లె, |
| చేయవలె కర్మ లోకుల శ్రేయ మెంచి. |
|
| |
|
| 26. |
| కర్మములజేయ నాసక్తి గలిగి యున్న |
| పామరుల బుద్ధి కలతల బఱచబోక, |
| సర్వకర్మలు వారలు సలుప జేసి, |
| సలుప వలె కర్మ పూని వి జ్ఞాని కూడ. |
|
| |
|
| 27. |
| ప్రకృతి గుణములు మూడింటి బలిమిచేత |
| సర్వవిధముల కర్మలు సాగు చుండ, |
| మూఢమనుజు డహంకార బుద్ధి నొంది, |
| తాను మాత్రమె కర్తగా తలచుచుండు. |
|
| |
|
| 28. |
| తత్త్వవేత్త మహాభుజ సత్త్వశాలి! |
| గుణములును, కర్మముల వి భజనము నెఱిగి, |
| తిరుగు విషయములంటి యిం ద్రియము లనుచు |
| తెలిసి సక్తుడుగాడు క ర్తృత్వమందు. |
|
| |
|
| 29. |
| ప్రకృతిగుణముల కెంతయు భ్రాంతి జెంది |
| సకలదేహేంద్రి యక్రియా సక్తులైన, |
| మంద బుద్ధుల, నల్పజ్ఞ మానవులను, |
| తగదు సర్వజ్ఞులకు కల తలను బఱప. |
|
| |
|
| 30. |
| ఆత్మవిజ్ఞానబుద్ధి నీ వాశ్రయించి |
| సర్వకర్మల నాయందె సన్యసించు, |
| ఆశ మమతల నీమన సార విడిచి, |
| యుద్ధమునుసల్పు శోకశూ న్యుండ వగుచు. |
|
| |
|
| 31. |
| ఇట్టి నామతము మనుజు లెవ్వరేని, |
| శ్రద్ధ తోడను, ననసూయ బుద్ధి తోడ, |
| నిత్య మనుసరింతురో బహు నిష్ఠ బూని, |
| వారలును కర్మబంధాలు వాయు వారె. |
|
| |
|
| 32. |
| నేను జెప్పిన మతమిదినింద జేసి |
| యనుసరింప రసూయతో నల్పమతులు, |
| అరయు మవ్వారినెల్ల నష్టాత్ములైన |
| జ్ఞానశూన్యులునౌ మూఢ జనులు గాగ. |
|
| |
|
| 33. |
| జ్ఞానియే తన పూర్వ సం స్కార సరణి, |
| పనులు జేయ ప్రకృతి కను గుణము గాను, |
| ప్రాణు లనుసరింపరె తమ ప్రకృతి నట్లె, |
| ప్రకృతి నెవ్వరు నిగ్రహిం పంగలారు! |
|
| |
|
| 34. |
| ఇంద్రియములన్ని విషయప్ర వృత్త మగుట, |
| రాగవిద్వేషగుణము లే ర్పడుచునుండు, |
| వశము గారాదు పురుషుడు వాని కెపుడు; |
| శాంతికామున కవి బద్ధ శత్రులు గద! |
|
| |
|
| 35. |
| స్వీయ ధర్మమె శ్రేష్ఠము విగుణ మయ్యు, |
| చక్కగా పరధర్మము సలుపు కంటె, |
| మరణమైనను స్వీయధ ర్మమున మేలు, |
| పరులధర్మము లెంతయు భయకరములు. |
|
| |
|
| 36. అర్జునుడనెను: |
| అయిన, దేని చేత బ్రయుక్తు డగుచు నుండి, |
| బలముగా నియోజితుడైన వాని యట్లు, |
| ఇచ్ఛలేకయె పాపపు కృత్యములను, |
| చేయు పురుషుండు వీడు, వా ర్ష్ణేయ! చెపుమ |
|
| |
|
| 37. శ్రీ భగవానుడనెను: |
| అదియె కామము, క్రోధమ్ము నదియె పార్థ! |
| పొదలు నిది రజోగుణమున బుట్టుచుండి, |
| పాపకారణ మిది; తృప్తి బఱపరాని, |
| పరమ శత్రువు తెలియు మీ ప్రజల కిలను. |
|
| |
|
| 38. |
| నిప్పునెరీతి పొగచుట్టి కప్పియుండు, |
| అద్దమందెట్లు మాలిన్య మంటి యుండు |
| శిశువు నేగతి మూయంగ జేయు మావి |
| జ్ఞానమును కామ మట్టులే కప్పి యుండు. |
Play This Verse |
| |
|
| 39. |
| ఎంత నింపిన దీనికి దృప్తి లేదు, |
| ఆశరూపాన జెలగు కా మానలంబు, |
| జ్ఞానమును కామధూమము కప్పియుండు, |
| జ్ఞాని కిది నిత్యశత్రువు గా గ్రహింపు. |
|
| |
|
| 40. |
| మనసు బుద్ధీంద్రియమ్ములి మ్మహిని పార్థ! |
| ఆశ్రయంబులు కామము కండ్రు బుధులు |
| అండగొని వీని జ్ఞానమును నావరించి, |
| దేహి నీకామ మెపుడు స మ్మోహపఱచు. |
|
| |
|
| 41. |
| అందుచే నింద్రియమ్ముల నాది యందె, |
| అర్జునా! నీదు స్వాధీనమందు నుంచి, |
| జ్ఞాన విజ్ఞాన నాశన కారియైన |
| పాప రూపపు కామము రూపు మాపు. |
|
| |
|
| 42. |
| దేహమున కన్న శ్రేష్ఠ మిం ద్రియగణంబు, |
| వాని కన్నను మనసు, నా పైది బుద్ధి |
| అట్టి బుద్ధికి బరమైన యట్టి దాత్మ, |
| అట్టి పరమాత్మయే సర్వ సాక్షి యండ్రు |
Play This Verse |
| |
|
| 43. |
| అట్లు బుద్ధికి పరమైన యాత్మ నెఱిగి, |
| నిశ్చయాత్మక బుద్ధి, చే నిలిపి మనసు, |
| కామరూపున నోర్వ శ క్యంబు గాని |
| వైరి గెల్వుము లే, మహా బాహువీర! |
Play This Verse |
| |
|