| |
| 1. |
| అట్లు కృపచేత పరవశు డైనవాని, |
| కన్నులశ్రు పూర్ణంబులై కలగువాని, |
| బహువిషాదము నొందిన పాండుసుతుని, |
| చూచి యీమాటలనె మధు సూదనుండు. |
Play This Verse |
| |
|
| 2. |
| ఇట్టి సమ్మోహ మర్జునా ! యెచటినుండి, |
| విషమ సమయమునందు బ్రా ప్తించె నీకు, |
| తగని దార్యుల కస్వర్గ దాయకమును, |
| కరము నీ కిది యపకీర్తి కరముగాదె. |
Play This Verse |
| |
|
| 3. |
| దైన్యమును పొందవలదు కా తరుని భంగి, |
| తగదు నీకిట్టి దీ యుద్ధ తరుణ మందు, |
| తుచ్ఛమగు గాన హృదినున్న దుర్బలతను, |
| త్రోసి లెమ్మిక విజయ ! శ త్రువుల దునుమ. |
Play This Verse |
| |
|
| 4. |
| తగుదునని యెట్లు రణమందు తాత భీష్మ, |
| గురువరేణ్యుని ద్రోణుని గూడ నేను, |
| సాయకములతో నెదురొడ్డ సాహసింతు, |
| పూజనీయులు వారుగా మురవిదారి ! |
Play This Verse |
| |
|
| 5. |
| గురువుల మహానుభావుల గూల్చు కంటె, |
| ఇలను భిక్షాన్నమే భుజి యింప మేలు, |
| కాని వధియింప గురులర్థ కాములంచు, |
| కుడువ వలె వారి నెత్తురు కూడె మహిని. |
Play This Verse |
| |
|
| 6. |
| మనమె గెల్తుమో, గెల్తురో మనల వారె, |
| శ్రేష్ఠతర మేదో తెలియదీ రెంట నాకు, |
| ఎవరు హతులైన జీవింప నిష్టపడమొ, |
| ధార్తరాష్ట్రులు వారలే తాకి రెదుట. |
|
| |
|
| 7. |
| దీనుడను నాదు ధైర్యము దెబ్బతినెను, |
| అడిగెదను ధర్మమూఢుడ నగుట మిమ్ము, |
| శ్రేయ మేదియొ నాకు ని శ్చితము జెపుమ, |
| శిష్యుడను మీ ప్రపన్ను శా సించి నన్ను. |
Play This Verse |
| |
|
| 8. |
| పృథ్వి రిపుశూన్యరాజ్య సం వృద్ధి గాని, |
| పరగ నమరాధిపత్యము బడసి గాని, |
| ఏది నా యీంద్రియముల ద హించు చుండె, |
| నట్టి శోకాగ్ని జల్లార్చు నది యొఱుంగ . |
|
| |
|
| 9. |
| ఆ గుడాకేశు డాశత్రు హంతకుండు |
| యిట్లు మాటడి ,యా హృషీ కేశు తోడ, |
| "చేయ యుద్ధము, గోవింద ! చేయ " నంచు, |
| పల్కి యంతనె మౌన భా వము వహించె . |
|
| |
|
| 10. |
| ఉభయ సేనల నడుమ గూ ర్చుండి యిట్లు, |
| వగల బొగులుచు నున్న యా పార్ఠు జూచి, |
| పరిహసించెడు లీల ని బ్భంగి బల్కె, |
| మందహాసము జేయుచు మాధవుండు. |
|
| |
|
| 11. |
| దుఃఖపడరానివారికైదుఃఖ పడుచు, |
| ప్రాజ్ఞ వాక్యము లెన్నియోపల్కు దీవు, |
| చన్న మఱియున్న తమబంధు సఖుల గూర్చి |
| పండితులు పార్థ!దుఃఖాలపాలు గారు. |
Play This Verse |
| |
|
| 12. |
| నేను నీవును గాని యీనృపులు గాని, |
| పూర్వ మెన్నడు లేక పోవుటయు లేదు, |
| అట్లె యికముందు నీ మనమందఱమును |
| లేక పోవుదు మనుమాటలేనె లేదు. |
Play This Verse |
| |
|
| 13. |
| దేహి జీవికి యీ స్థూలదేహమందు |
| బాల్య,యౌవన,జర లెట్లుప్రాప్తమగునొ, |
| అట్లె ప్రాప్తించు నితర దేహంబు గూడ, |
| దీనిచే మోహితులు గారుధీరు లెవరు. |
Play This Verse |
| |
|
| 14. |
| కాని విషయేంద్రియంబులుకలుగ జేయు, |
| భువిని శీతోష్ణ సుఖ దుఃఖములను పార్థ! |
| వచ్చి పోయెడు నివి యశాశ్వతము గాన, |
| వాని ధీరుడవై యోర్వవలయు నీవు. |
|
| |
|
| 15. |
| పురుష వృషభమయే ధీర పురుషవరుని, |
| యిట్టి ద్వంద్వాలు వ్యథలను బెట్ట లేవొ, |
| సకల సుఖదుఃఖముల యెడసము డెవండొ, |
| వాడె యర్హుండగు నమృత త్వమును బొంద. |
|
| |
|
| 16. |
| ఉనికి లేకుంట సద్వస్తువునకు లేదు, |
| ఉనికి యెన్న డసద్వస్తువునకు లేదు, |
| అరసి చూచిరి యాత్మ దేహముల రెంటి, |
| నిశితరూపము తత్వార్థనిపుణమతులు. |
Play This Verse |
| |
|
| 17. |
| ఏది సర్వమీ జగతి వ్యాపించి మించు, |
| అరయు మద్దాని నవినాశినాత్మగాను, |
| అవ్యయంబగు గాన నీయాత్మ నెవడు, |
| చెఱుప జాలడు దానికిన్జేటు లేదు. |
Play This Verse |
| |
|
| 18. |
| ఆత్మదాల్చు శరీరములంత మొందు, |
| నిత్యుడై యీశరీరుడునెగడు నండ్రు, |
| ఆత్మయవినాశి యప్రమేయంబు పార్థ! |
| కాన యుద్ధము చేయగాకడగు మీవు. |
|
| |
|
| 19. |
| ఆత్మ నెవ్వడు తలచునోహంత యనియు, |
| ఆత్మ నెవ్వడు యెంచునోహతుని గాను, |
| వార లిర్వురు తెలియనివారె సుమ్ము, |
| హంత కాదది మఱియునుహతము కాదు. |
|
| |
|
| 20. |
| పుట్ట దొక్కప్పు డీయాత్మగిట్ట దెపుడు, |
| ఉండి యొకపుడు మఱల లేకుండ బోదు, |
| ఆత్మ నిత్యము శాశ్వతమజ మనాది, |
| హతము కాదది హతము దేహంబె యగును. |
Play This Verse |
| |
|
| 21. |
| జనన మరణములును జరాక్షయము లేదు, |
| ఆత్మ యవినాశి నిత్య మవ్యయ మజంబు, |
| ఇట్లు తెలిసిన పూరుషుండెవ్వడైన, |
| నెవని జంపించు,పార్థ !వాడెవని జంపు. |
|
| |
|
| 22. |
| జీర్ణవస్త్రముల బరిత్యజించి నరుడు, |
| క్రొత్త వస్త్రము లెట్లు తాకూర్మి దాల్చు, |
| జీర్ణదేహముల బరిత్యజించి దేహి, |
| క్రొత్త దేహము లట్లె చేకొనియు దాల్చు. |
Play This Verse |
| |
|
| 23. |
| శస్త్రములు నాత్మ ఛేదింపజాల నెపుడు, |
| అగ్ని దహియింప జాల దీయాత్మ నెపుడు, |
| జలము దీనిని తడుపంగజాల కుండు, |
| గాలి యైనను యెండింపజాలి లేదు. |
Play This Verse |
| |
|
| 24. |
| చీల్చరానిది యీయాత్మకాల్ప బడదు, |
| తడుప రానిది యెండింపతరము గాదు, |
| శాశ్వతము నిత్య మీయాత్మసర్వగతము, |
| స్థాణు వచలము బహు సనాతనము పార్థ! |
Play This Verse |
| |
|
| 25. |
| మనసు కందని దీయాత్మకనుల బడదు, |
| ఆత్మ యవికారి యని, బుధులనుచునుంద్రు, |
| ఇట్టిదని దీని నిజతత్వమెఱిగి యుండి, |
| వగను బొందుట భారతాతగవు గాదు. |
|
| |
|
| 26. |
| కాని యీయాత్మ నీవెల్లకాలములను, |
| పుట్టి గిట్టెడిదని తలపోయు దేని, |
| అట్టి పట్టున గూడ మహా భుజుండ! |
| తగవుగాదిట్లు నీపు పెన్వగను జెంద. |
Play This Verse |
| |
|
| 27. |
| జనన మొందిన దానికిచావు ధ్రువము, |
| మరణ మొందిన మరల జన్మంబు ధ్రువము, |
| కాన, తప్పింప జాలని దాని గూర్చి, |
| వగను బొగులగ నీ కిదితగవు గాదు. |
Play This Verse |
| |
|
| 28. |
| ఆది భూతము లవ్యక్తమగుచు నుండు, |
| వ్యక్తమై తోచు మద్యమునందె పార్థ! |
| నాశమై కూడ కావు ప్రకాశితములు, |
| ఇట్టివానికి దుఃఖింపనేల నీవు. |
Play This Verse |
| |
|
| 29. |
| చూచు నొక్కడు దీనినిచోద్యమట్లు, |
| చెప్పునొక్కడు దీనినిచిత్ర మట్లు, |
| వినును వేరొక్కడిది యెంతొవింత యట్లు, |
| అట్లగుట దీని నిజత త్వమరయ డెవడు. |
|
| |
|
| 30. |
| అన్ని దెహము లందుననలరు చున్న, |
| దెహి నిత్యుడు, వాని వధింప లేము, |
| కాన, నీసర్వభూత సంఘముల గూర్చి, |
| వగను బొందుట భారతా! తగునె నీకు. |
|
| |
|
| 31. |
| స్వీయధర్మము మిగుల యోచించి కూడ, |
| పార్థ! నీవిట్లు చలియింపపాడి గాదు, |
| ధర్మయుద్ధముకన్న నీధరణి వేరె, |
| కలుగ బోదెట్టి శ్రేయముక్షత్రియునకు. |
|
| |
|
| 32. |
| అప్రయత్నముగానె,సం ప్రాప్తమగుచు, |
| ద్వారములు దెఱ్చియుంచినస్వర్గమైన, |
| యుద్ధ మిట్టిది లభియించుచుండు వారు, |
| క్రీడి!సుఖవంతులైన క్షత్రియులు సుమ్ము. |
|
| |
|
| 33. |
| కాని కౌంతేయ!యిపుడట్లుగాక నీవు, |
| ధర్మ్య సంగ్రామమిది చేయదలప వేని, |
| దాన నీకీర్తి నీక్షాత్రధర్మములను |
| కోలుపడి ఘోరపాపముకొందు వీవు. |
|
| |
|
| 34. |
| క్రీడి!జనులెల్ల నీయపకీర్తి గూర్చి, |
| చిరము తరుగని కథలనుచెప్పుకొంద్రు, |
| మానధనులకి ట్లపకీర్తిమాట బడుట, |
| మరణమున కన్న మిగుల దుర్బరము గాదె. |
|
| |
|
| 35. |
| భయముచే యుద్ధమందుండిపాఱి తనుచు, |
| యీమహారథు లెల్ల నిన్నెంచు చుంద్రు, |
| ఎవరు సమ్మాన్యుగా పూర్వమెంచినారొ, |
| చులకనగ వారె, నిన్నికచూడగలరు. |
|
| |
|
| 36. |
| నీదు సామర్థ్యమును వారునింద జేసి, |
| నోట వచియింపగారానిమాట లెన్నొ, |
| పల్కుచుందురు నీ శత్రుపక్ష జనులు, |
| ఇంతకును మిన్న దుఃఖమింకేమి గలదు. |
|
| |
|
| 37. |
| హతుడవో స్వర్గసుఖములెయబ్బు నీకు, |
| గెల్తువో నీవు రహిని భోగింతు విలను, |
| కాన లెమ్మిక కౌంతేయకలత దేఱి, |
| యుద్ధమును జేయ కృతనిశ్చయుండ వగుచు. |
|
| |
|
| 38. |
| కష్ట సుఖములు, మఱి లాభనష్టములును, |
| జయ పరాజయములనెల్లసమత నెంచి, |
| పిదప సిద్ధము గమ్మీవు పెనగి పోర, |
| పాపమును పొంద వీవిట్టి పథము గొనిన. |
|
| |
|
| 39. |
| ఆత్మతత్వము నిట్లు, సాంఖ్యమున జెపితి, |
| కాని,నీవెట్టి జ్ఞానము కలిగి యున్న, |
| కర్మబంధము లన్నియున్ కట్టు వాయు, |
| కర్మయోగము వినుమదికౌరవేంద్ర! |
|
| |
|
| 40. |
| కొంత సాధించి విడిచిన కొఱత లేదు, |
| ప్రత్యవాయము దానిచేపడయ రాదు, |
| ఇమ్మహాధర్మ్య మించుకయేని సేయ, |
| కాచు భవభయఘోరసాగరము నుండి. |
|
| |
|
| 41. |
| నిశ్చయాత్మకమై యొకేనిష్ఠ నుండు, |
| పార్థ! నిష్కామయోగియౌవాని బుద్ధి, |
| చంచలాత్మకు,నవ్యవసాయబుద్ధి, |
| వివిధ శాఖోప శాఖలైవిస్తరించు. |
|
| |
|
| 42. |
| స్వర్గమున కన్న నన్యాపవర్గ మేది, |
| పొంద లే దిహ పరకర్మములను జేయ, |
| వేదవాదము లందల్పవేదులిట్లు, |
| పల్కుచుందురు పుష్పితవాక్యములను. |
|
| |
|
| 43. |
| కర్మఫలమైన జన్మముకలుగ జేయు, |
| సిరియు నైశ్వర్య భోగముల్సెంద జేయు, |
| బహువిధములైన కర్మలపలుకుచుంద్రు, |
| కామచిత్తులు స్వర్లోకకాము లగుచు. |
|
| |
|
| 44. |
| సకలసుఖభోగభాగ్య ప్రసక్తి చేత, |
| చిత్త మెవరిది యిట్లు వచింప బడునొ, |
| వారలను నిశ్చయంబుగవారి బుద్ధి, |
| నిశ్చల సమాధియందుననిలుపలేదు. |
|
| |
|
| 45. |
| వేదములు జెప్పు త్రైగుణ్యవిషయములను, |
| కాని,త్రైగుణ్యుడవు నీవుగాకు పార్థ! |
| ద్వంద్వముల బాసి,నిత్య సత్త్వస్థు డగుము, |
| క్షేమ యోగము వీగి దర్శింపు మాత్మ. |
|
| |
|
| 46. |
| నీర మంతట వెల్లువైనిండి యుండ, |
| కూపజలమెంత పని సమకూర్ప గలుగు, |
| సర్వ వేదముల వలని సాయ మంతె, |
| కర్మఫలవేత్త బ్రహ్మ విజ్ఞాని కగును. |
|
| |
|
| 47. |
| కలదు నీకధికారముకర్మమందె, |
| లేదు ఫలమునం దెన్నడులేశ మైన, |
| కర్మఫలహేతు వైననుగాకు మీవు, |
| కాని సంగివి గాకు మకర్మమందు. |
|
| |
|
| 48. |
| కర్మఫలములయందు సంగమును వీడి, |
| సిద్ధ్యసిద్ధులలో సమస్థితిని నుండి, |
| యోగయుక్తుడవై కర్మమూని సలుపు, |
| మట్టి సమభావమే యోగమండ్రు బుధులు. |
|
| |
|
| 49. |
| కామ్యకర్మము లందాసగలిగి యుంట, |
| కరము నీచము బుద్ధియోగమ్ము కంటె, |
| బుద్ధియోగమె శరణముపొంద నెమకు, |
| ఫలము గోరెడువారు కృపణులు పార్థ! |
|
| |
|
| 50. |
| ఎవడు సమబుద్ధియుక్తుడై యెసగు నతడె, |
| పాప పుణ్యఫలంబులబాయు నిలనె, |
| కాన నిష్కామకర్మయోగంబె సలుపు, |
| కర్మముల కౌశలంబె యోగంబు విజయ. |
|
| |
|
| 51. |
| ఒనర బ్రాజ్ఞులు నిష్కామయోగివరులు, |
| కర్మ జాతఫలంబులకాంక్ష బాసి, |
| జన్మ బంధాలనుండి మోక్షమును బొంది, |
| చేటెఱుంగని చోటునుజేరుకొనిరి. |
|
| |
|
| 52. |
| మోహపంకము నందునమునగబోక, |
| దాట గలుగునొ నీబుద్ధిదాని నెపుడు, |
| విన్న విననున్న ప్రతిఫలవిషయమందు, |
| అర్జునా! నీకు నిర్వేదమపుడె యబ్బు. |
|
| |
|
| 53. |
| వివిధకర్మఫలంబులవినుట చేత, |
| చెదరి పోయిన నీబుద్ధిస్థిరముగాను, |
| నిశ్చలముగ సమాధిలోనిలుచు నెప్పు, |
| డప్పుడే యోగ మర్జునాయబ్బు నీకు. |
|
| |
|
| 54. |
| స్థిరసమాధిష్ఠు నిష్ఠ యేతీరునున్న, |
| పల్కబడు కేశవా!స్థితప్రజ్ఞు డనగ, |
| ఎట్లు మాటాడు, స్థితధీరుడెట్టులుండు, |
| ఎట్లు కూర్చుండు వర్తనమెట్టులుండు. |
|
| |
|
| 55. |
| మనసు బెనవేసి మసలు కామముల నెవడు, |
| సర్వమెప్పుడు మనసారసంత్యజించి, |
| అత్మచే పొందు సంతుష్టినాత్మయందె, |
| అట్టివాని స్థితప్రజ్ఞుడందు రపుడు. |
Play This Verse |
| |
|
| 56. |
| దుఃఖేష్వనుద్విగ్నమనాః |
| సుఖేషు విగతస్పృహః |
| వీతరాగభయక్రోధ |
| స్థితధీర్మునిరుచ్యతే |
|
| |
|
| 57. |
| ఎవ్వడసక్తి శూన్యుడైయెల్లయెడల |
| శుభములశుభము లెయ్యేవిచొప్పడి విన, |
| హర్ష విద్వేషముల మదినడర నీడో, |
| అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును. |
|
| |
|
| 58. |
| కూర్మమంగము లన్ని లోగొనెడు భంగి, |
| విషయముల నుండి యింద్రియవితతి నెల్ల, |
| ఎప్పు డీయోగి వెనుకకుద్రిప్పునపుడె, |
| అతని ప్రజ్ఞ ప్రతిష్టిత మైన దగును. |
|
| |
|
| 59. |
| దేహి విషయ నిరాహారదీక్ష నున్న, |
| యింద్రియార్థములను నిగ్రహించు గాని, |
| విషయతృష్ణయు వానినివీడ కుండు, |
| పరము దర్శింప బాయు, పిపాస కూడ. |
|
| |
|
| 60. |
| పార్థ ! పురుషు డెంతటి యత్నపరుడు గాని, |
| యెట్టి విజ్ఞాని గాని,యీయింద్రియములు, |
| కలతలను బెట్టియును బలాత్కారముగను, |
| వాని మనసును తమవైపు పట్టిలాగు. |
|
| |
|
| 61. |
| అట్టి యింద్రియములనెల్లనణచి యుంచి, |
| యోగమందు మత్పరత గూర్చుండ వలయు, |
| యింద్రియములట్లు స్వాధీనమెవని కగునొ, |
| అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును. |
|
| |
|
| 62. |
| విషయ చింతన జేయు పూరుషున కెపుడు, |
| విషయసుఖముల యందాసవిడువ కుండు, |
| కామములు గల్గు విషయ సంగమము వలన, |
| కోరికలవల్ల బుట్టును క్రోధ గుణము. |
|
| |
|
| 63. |
| అట్టి క్రోధంబు వలన మోహంబు పుట్టు, |
| మోహమందుండి విస్మృతిబుట్టు చుండు, |
| స్మృతియు నశియింప బుద్ధి నశించు సుమ్ము, |
| బుద్ధి నశియింప భ్రష్టుడైపోవు నతడు. |
|
| |
|
| 64. |
| కాన రాగవిద్వేషముల్కడకు ద్రోసి, |
| యింద్రియములన్ని విషయ ప్రవృత్తమయ్యు, |
| ఆత్మస్వాధీనమై యవియలరుచున్న |
| సంయతాత్ముడు బొందు, ప్రసాదసిద్ధి. |
|
| |
|
| 65. |
| చిత్తనైర్మల్య మాతడుచెంది యున్న |
| సకల సుఖదుఃఖములు నుపశమన మొందు, |
| శాంత చిత్తుడునైన ప్రసన్నబుద్ధి |
| నిశ్చలత శీఘ్రమే బ్రహ్మనిష్ఠ నుండు. |
|
| |
|
| 66. |
| ఒనర దాత్మైకబుద్ధి యయుక్తునకును, |
| బ్రహ్మభావ మయుక్తుడుబడయ లేడు, |
| శాంతి గలుగదు పరమార్ధచింతలేక, |
| శాంతి లేకున్న సుఖమెట్లుసంభవించు. |
|
| |
|
| 67. |
| విషయగతమైన యింద్రియవితతి యందు, |
| మనసు నెద్దాని దవిలి తామరలు చుండు, |
| అతని ప్రజ్ఞ నాయింద్రియమ్మపహరించు, |
| గాలి నావను నీటిపైకలచుమాడ్కి. |
|
| |
|
| 68. |
| కాన, అర్జునా! యింద్రియకరణములను, |
| విషయముల వెంట బడనీకవెనుక ద్రిప్పి, |
| ఎవ్వ డన్నియెడల నిగ్రహింప గలడొ, |
| అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైన దగును. |
|
| |
|
| 69. |
| సర్వ భుతములకు నిశాసమయ మేదొ, |
| సంయమీంద్రుడు మేల్కొనుసమయ మదియె, |
| సర్వ భుతముల్ మేల్కొనుసమయ మేదొ, |
| ఆత్మ దర్శించు మౌని కయ్యదియె రాత్రి. |
|
| |
|
| 70. |
| నీరు నిండుగ నదులన్నిజేర నెట్లు, |
| కడలి పొంగదొ చెలియలికట్టదాటి, |
| కామములు నట్లె చేరగాకలగ నతడె, |
| పొందు శాంతిని, కామోపభొగి కాదు. |
|
| |
|
| 71. |
| నేను నాదను భావమునెగడ నీక, |
| సర్వకామములను మనసార విడచి, |
| విషయ వాంఛల పురుషుండువీడు నెవడు, |
| పరమశాంతి పదంబునుబడయు నతడె. |
Play This Verse |
| |
|
| 72. |
| ఇదియె బ్రాహ్మీస్థితియనినీవెఱుగు పార్థ! |
| మోహమొందడు దీనినిపొందు వాడు, |
| అట్టి స్థితినున్న పోకాలమందు గూడ, |
| బ్రహ్మనిర్వాణ మాతడు పడయ గలడు. |
|
| |
|