Tetagitulu with
 
 
 
 
Book Release Event
 
   Subscribe To Slokas
  
     
 
  Introduction
  Home
  Foreword
  Prayer
  What is Tetagiti ?
  Commentaries
  Provide Feedback
 
శ్రీమద్భగవద్గీత
తేటగీతులలొ తెనుగుసేత
  by Late Dr. P.V. Satyanarayana Rao
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ:
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18
 
  18. అష్టాదశాధ్యాయము: మోక్షసన్యాసయోగము
 
 1.  అర్జునుడనెను:
  ఏది సన్యాసమగు త్యాగమేది కృష్ణ!
  వేరు వేరుగ తత్త్వముల్వివరముగను
  తెలుపగోరెద నేమిమ్ముదేవదేవ!
  కేశిసంహార!ఓహృషీకేశ!ఈశ!
 
 
 2.  శ్రీ భగవానుడనెను:
  సర్వకామ్యకర్మముల విసర్జనమును
  కవులు సన్న్యాస మందురుకౌరవేంద్ర!
  సర్వకర్మముల ఫల విసర్జనమును,
  త్యాగ మండ్రు విచక్షణులైన వారు.
 
 
 3.  
  కర్మమే యన్నిటికి దోషకారణమని
  యెంచి కొందఱు బుధులు త్యజించు మనిరి,
  యజ్ఞ దాన తపఃక్రియలన్ని గూడ,
  విడువ రా దని కొందఱువిభుధులనిరి.
 
 
 4.  
  త్యాగమును గూర్చి నానిశ్చయమును వినుమ,
  భరతసత్తమ! నీవింకబాగుగాను,
  పురుషపుంగవ!త్యాగముల్ముత్తెఱగుల,
  చెప్పె శాస్త్రములిట్లు ప్రసిద్ధి గాను.
 
 
 5.  
  యజ్ఞ దాన తపఃక్రియలన్ని గూడ,
  వదల రానివి, చేయంగవలయు వాని,
  యజ్ఞ దాన తపః క్రియలన్ని పార్థ!
  ప్రాజ్ఞులను గూడ పరమపావనుల జేయు.
 
 
 6.  
  ఇట్లు జెప్పిన కర్మములెల్ల పార్థ!
  సంగమును వీడి ఫలకాంక్షసలుప బోక,
  చేయ కర్తవ్యమని సు నిశ్చితముగాను,
  తలతు నుత్తమ మంచు నెంతయును నేను.
 
 
 7.  
  కాని, నియతకర్మముల త్యాగంబు జేసి,
  యూరకుండుట మిగుల నయుక్త మగును,
  వాని నవివేక వశమునవదలివేయ,
  అట్టి త్యాగము తామసత్యాగమగును.
 
 
 8.  
  దఃఖకరము, కాయక్లేశదుర్భర మని,
  వెఱపుచే నిత్యకర్మమువిడుచు నెడల,
  నట్టి త్యాగము రాజసమగును గాన,
  కలుగ దాతని కేత్యాగఫలము గాని.
 
 
 9.  
  కర్మఫలసంగములయందుకాంక్ష విడిచి,
  నియతకర్మము తప్పకనిత్యమెవడు,
  చేయ కర్తవ్యమని యెంచిచేయు నేని
  యట్టి త్యాగము సాత్త్వికమని తలంత్రు.
 
 
 10.  
  సత్త్వగుణ విశిష్టుడు, చిన్నసంశయుండు,
  ఆత్మవిజ్ఞాని, మేధావిత్యాగధనుడు,
  చెడుగు కర్మము లంచు ద్వేషింప బోడు,
  మంచి కర్మము లంచునుమమత నిడడు.
 
 
 11.  
  కాని, దేహభృతునకు శక్యంబు గాదు,
  కర్మనిశ్శేషముగ వీడ గలిగి యుంట,
  కర్మఫలముల త్యజియింపగలుగు నెవ్వ
  డాతడే త్యాగియని బుధులనుచు నుంద్రు.
 
 
 12.  
  ప్రియము లప్రియములును మిశ్రితములనగ
  కర్మఫలముల త్రివిధముల్గలుగు చుండు,
  త్యాగహీనుల కిట్లు జన్మంతరమున,
  కాని,సన్యాసి కట్టిదికలుగ దొకటి.
 
 
 13.  
  సర్వకర్మల సంసిద్ధిసంఘటింప,
  సాంఖ్యసిద్ధాంతమందునసవివరముగ,
  కారణము లైదు జెప్పిరికౌరవేంద్ర!
  వినుము తెలుపుదు వానినేవివరముగను.
 
 
 14.  
  కార్యనిలయమౌ దేహముకర్తయహము
  కర్మములు జేయు వేర్వేరుకరణములును,
  బహువిధములైన ప్రాణాదివ్యాపృతులును,
  దైవ మవ్వాని యందు నైదవది యగును.
 
 
 15.  
  త్రికరణములైన వాజ్ఙనోదేహములను,
  న్యాయమైనను మఱియు నన్యాయమైన,
  కర్మ మేదేని చేయగాగడగు మనుజు,
  డట్టి కర్మకు హేతువీయైదు పార్థ!
 
 
 16.  
  కర్మహేతువు లిట్లైదు కలిగియుండ,
  ఎట్టి సంస్కారబుద్ధి వాడెనయకుంట,
  తానె కేవలకర్తగాదలచు నెవ్వ,
  డట్టి దుర్మతి నిజతత్త్వమరయ లేడు.
 
 
 17.  
  ఎవ్వనికి కర్తనని యహం కృతియు లేదొ,
  ఎవని బుద్ధి విషయ కలుషితము గాదొ,
  అతడీలోకులను జంపినప్పటికిని,
  హంతయును గాడు బంధములంట వతని.
 
 
 18.  
  జ్ఞానమని,జ్ఞేయమని, పరిజ్ఞాత యనియు,
  కర్మచోదన కివి మూడుకారణములు,
  కర్మయని, కర్తయని, యుపకరణములని,
  కర్మసంగ్రహవిధములుకలవు మూడు.
 
 
 19.  
  జ్ఞానమును, కర్మయును, దానికర్త గూడ,
  మూడు విధములు గుణభేదములనుబట్టి,
  సర్వమివి జెప్పబడె గుణసాంఖ్యమందు,
  ఉన్న తీరున జెప్పుచునుంటివినుము.
 
 
 20.  
  భిన్నరూపములౌ భూతవితతియందు,
  అవ్యయం బవిభక్తమౌనాత్మయొకటె,
  యంచు నెట్టి జ్ఞానముచే గ్రహించగలుగు,
  నట్టి జ్ఞానము సాత్త్వికమని యెఱుంగు.
 
 
 21.  
  కాని, తెలియునో నరుడెట్టిజ్ఞానమున్న,
  వేరు వేరైన యీ భూతవితతియందు,
  వేరు వేరైన యాత్మలువెలయునంచు,
  అట్టి జ్ఞానము రాజసమని యెఱుంగు.
 
 
 22.  
  జ్ఞానమెద్దాన నొక్కటేకార్య మందు,
  సర్వమున్నట్ట్లు నెంచు నాసక్తితోడ,
  అల్పము నహైతుకం బతత్వార్థమైన,
  యట్టి జ్ఞానము తామసమని యెఱుంగు.
 
 
 23.  
  నియత కర్మము నిష్ఠతోనిత్య మెవడు,
  రాగ విద్వేష సంగ విరహితముగను,
  ఫలముకై కాంక్ష గొనకుండిసలుపునెడల,
  నట్టి కర్మము సాత్త్వికమైన దండ్రు.
 
 
 24.  
  కాని, యెట్టికర్మము ఫలాకాంక్షనైన,
  మఱి యహంకారబుద్ధితోమసలి యైన,
  ఆచరించునో బహుళ ప్రయాస తోడ,
  నట్టి కర్మము రాజసమైన దండ్రు.
 
 
 25.  
  కార్య పర్యవసానము,క్షయము,హింస,
  శక్తి సామర్థ్యముల నేమిసడ్డ గొనక,
  మోహ వశమున నేకర్మమూని సలుపు,
  అట్టి కర్మము తామసమైన దండ్రు.
 
 
 26.  
  ధృతియుతుం, డనహంకారి,ధీవిశాలి,
  సంగరహితుడు, సమధికోత్సాహశీలి,
  సిద్ధ్యసిద్ధుల యందు నిశ్చింతుడైన
  కర్త నందురు సాత్త్వికకర్తయనుచు.
 
 
 27.  
  కర్మఫలకామియు, నిషిద్ధకర్మరతుడు,
  అశుచి,లోభగుణుండు, హింసాత్మకుండు,
  కష్టసుఖములు గలిగినకలత జెందు,
  కర్తనందురు రాజసకర్త యనుచు.
 
 
 28.  
  చంచలాత్మకు, డల్ప సంస్కారి, మొండి,
  జాగుపనివాడు, స్తబ్ధుడు,స్వార్థపరుడు,
  వంచకుం డలసుడు దఃఖవశుడు నైన,
  కర్తనందురు తామసకర్తయనుచు.
 
 
 29.  
  ధృతియు, బుద్ధియు ననువానితీరులెల్ల,
  మూడు విధములు గుణభేదములను బట్టి,
  వేరువేరుగ నవ్వానివివరముగను,
  చెప్పెదను విను పార్థ!నిశ్శేషముగను.
 
 
 30.  
  ఎట్టి బుద్ధి ప్రవృత్తి నివృత్తి నెఱుగు,
  కార్యము నకార్యము తెలియగలిగియుండు,
  బంధమోక్షములను భయాభయము లెఱుగు,
  నట్టి బుద్దియె సాత్త్వికమగును పార్థ!
 
 
 31.  
  ధర్మమేదియొ మఱియు నధర్మమేదొ,
  కార్యమేదియొ మఱియు నకార్యమేదొ,
  నిశ్చయంబుగ నెఱుగంగనీయ కుండు,
  నట్టి బుద్ధియె రాజసమగును పార్థ!
 
 
 32.  
  ఎట్టిది యధర్మమును ధర్మమిదియె నంచు
  తమసుచే కప్పబడినదైతలపుగొనునొ,
  అట్లె తాఱుమాఱెంచు సర్వార్థములను,
  నట్టి బుద్ధియె తామసమగును పార్థ!
 
 
 33.  
  ఇంద్రియ ప్రాణ మానసవృత్తులన్ని
  యొక్కనిష్ఠనెయోగమందుండ జేసి,
  యెట్టి ధృతిచేత వాని ధరించ గలుగు,
  నట్టి ధైర్యము సాత్త్వికమగును పార్థ!
 
 
 34.  
  కాని, యాసక్తి చే ఫలాకాంక్ష జేసి,
  ధర్మ కామార్ధములనె ప్రధానముగను,
  ఎంచి యే ధృతిచేత ధరించి యుండు,
  నట్టి ధైర్యము రాజసమగును పార్థ!
 
 
 35.  
  స్వప్న భయ మద శోక విషాదములను,
  విడువ జాలక దుర్మతిపెనగులాడి,
  యెట్టి ధృతిచేతవాని ధరించి యుండు,
  నట్టి ధైర్యము తామసమగును పార్థ!
 
 
 36.  
  మూడు విధముల సుఖములీభువిని గలవు,
  వినుము చెప్పుదు వానినివిజయ!యిపుడు,
  ఏ సుఖావృత్తిచే పరితృప్తి గలుగు,
  అట్లె సంసార దఃఖములంత మొందు;
 
 
 37.  
  విషమువలె నే సుఖమ్ము కన్పించి తొలుత,
  అమృత తుల్యముగా బర్వునంత్యమందు,
  కలుగు నే దాత్మ బుద్ధి నిర్మలత నుండి,
  అట్టి సుఖమును సాత్త్వికమైన దండ్రు.
 
 
 38.  
  కలిగి విషయేంద్రియముల సంగమమువలన,
  తొలుత నెట్టి సుఖ మమృతతుల్యమగుచు,
  పరగు పరిణామమున విషప్రాయముగను,
  అట్టి సుఖమును రాజసమైన దండ్రు.
 
 
 39.  
  అలసతయు బ్రమాదము నిద్రలందు బుట్టి,
  ఆది యందున నంత్యమునందు గూడ,
  నెట్టి సుఖ మాత్మ నెపుడు భ్రమింప జేయు,
  అట్టి సుఖమును తామస మైన దండ్రు.
 
 
 40.  
  మర్త్యలోకము నందలిమానవులును,
  దివ్యలోకము నందలిదేవతలును,
  ప్రకృతి గుణములు మూడింటిబారినుండి,
  ఒక్క ప్రాణియు విడివడియుండ లేదు.
 
 
 41.  
  బ్రహ్మణులకును, క్షత్రియవంశజులకు,
  వైశ్యులకు, శూద్రులకు పార్థ!వారి వారి,
  ప్రకృతిజాతగుణ ప్రభావానుసరణి,
  ఎల్ల కర్మములును, విభజింప బడియె.
 
 
 42.  
  శమము, దమమును, తపమునుశౌచగుణము,
  ఆస్తికత్వము, క్షాంతియు,నార్జవమును,
  జ్ఞాన విజ్ఞాన భక్తి విశ్వాసములును,
  బ్రాహ్మణుల కగు సహజ కర్మములుపార్థ!
 
 
 43.  
  ధృతియు, శౌర్యము దక్షతతేజు, శక్తి,
  యుద్ధమందు పలాయనబుద్ధి లేమి,
  దానమును పరిపాలనాదక్షతయును,
  క్షత్రియ స్వభావజనితకర్మము లగు.
 
 
 44.  
  వర్తకమ్మును గృషియు గోపాలనంబు,
  సహజకర్మములగు వైశ్యసంతతికిని,
  పార్థ!పరిచర్య యందె తత్పరుడు నగుట,
  సహజకర్మము శూద్ర సంజాతునకును.
 
 
 45.  
  నరుడు తన తన కర్మమునిరతి తోడ,
  చేయ పొందును జ్ఞాన సంసిద్ధి వాడు,
  స్వీయకర్మాభినిరతుడైసిద్ధి యెట్లు
  పొంద గలుగునొ విను దాని చంద మీవు.
 
 
 46.  
  ఎవని లోనుండి యీ భూతసృష్టి వెలిసె,
  ఎవనిచే వ్యాపితంబాయెనీ జగంబు,
  స్వీయకర్మముచేత నర్చించి వాని,
  పొందవచ్చును మనుజుడుమోక్షసిద్ధి.
 Play This Verse
 
 47.  
  స్వీయధర్మమె శ్రేయమువిగుణమయ్యు,
  చక్కగా పరధర్మముసలుపుకంటె
  సహజకర్మము నియతితోసలుపుచున్న,
  కలుగబో దెట్టి పాప పంకిలము గాని.
 
 
 48.  
  సహజకర్మము లేవైనసవ్యసాచి!
  దోషయుక్తము లేయనిత్రోయరాదు,
  నిప్పు నెబ్భంగి ధూమము గప్పియుండు,
  కర్మముల నెల్ల దొసగులుగప్పునట్లె.
 
 
 49.  
  కర్మముల నెల్ల దొసగులుగప్పునట్లె.
  నియతమానసమును, ఫలనిస్పృహతయు,
  కర్మసన్యాసయోగపుగడన గలిగి,
  పరమనైష్కర్మ్యసిద్దినిబడయు నరుడు.
 
 
 50.  
  ఇట్టి సిద్ధిని బొందినయట్టివాడు,
  బ్రహ్మ మే జ్ఞాననిష్ఠచేబడయగలడొ,
  జ్ఞాననిష్ఠకు గల పరాకాష్థ యేదొ,
  సంగ్రహంబుగ వచియింతుసవ్యసాచి!
 
 
 51.  
  నిశ్చయంబైన బుద్ధి వినిర్మలతను,
  ధృతిని దేహేంద్రియముల సంయత మొనర్చి,
  సకల శబ్దాదివిషయ సంసక్తి విడిచి,
  రాగ విద్వేషములను దూరాన బుచ్చి;
 Play This Verse
 
 52.  
  స్వల్పముగ దిని, యొంటరిస్థలము జేరి,
  వాఙ్మనోదేహముల దనవశ మొనర్చి,
  ధ్యానయోగతత్పరత నిత్యమును నిల్చి,
  పరగవైరాగ్యమును సముపాశ్రయించి;
 Play This Verse
 
 53.  
  అహము, బలమును, దర్పములన్ని వదలి,
  కామమును, క్రోధమును, పరిగ్రహము వీడి,
  మమతలను బాసి, బహుశాంతిమంతుడైన,
  అర్హతను బొందు నరుడు బ్రహ్మైక్యమొంద.
 Play This Verse
 
 54.  
  అపుడు బ్రహ్మభూతుడు ప్రశాంతాత్ముడగుచు
  ఏది కాంక్షింప బోడు, శోకింప డతడు,
  సర్వభూతము లందునసమత మెలగి,
  పడయు నాయందు ప్రబ్బినపరమ భక్తి.
 
 
 55.  
  ఎంతవాడనో నారూపమెట్టిదగునొ
  యీ పరమభక్తిచే నాతడెఱుగు నన్ను,
  అట్లు సచ్చిదానందు నన్నరయ గలిగి,
  పిదప నాయందె వాడు బ్రవేశ మొందు.
 
 
 56.  
  సర్వకర్మము లెవ్వడుసంతతమును
  సల్పుచుండునొ నన్నె యాశ్రయము గొనుచు
  వాడు నా ప్రసాదమునకుపాత్రుడగుచు,
  పడయు శాశ్వతమైన యవ్యయ పదంబు.
 
 
 57.  
  సర్వకర్మములను మనసార నీవు
  నాకె యర్పించి,పరముగానన్నె యెంచి,
  బుద్ధియోగమునండగాబూనియుండి
  హత్తియుంచుము నాయందెచిత్త మెపుడు.
 
 
 58.  
  తొడరి మది నన్నె గొన సర్వదుస్తరముల,
  దాట గలుగుదు నా ప్రసాదమున నీవు,
  అట్లు గాక,నహంకారమాశ్రయించి,
  నాదు మాటలు వినకున్ననాశమగుదు.
 
 
 59.  
  అర్జునా! నీవహంకారమాశ్రయించి
  యుద్ధమును జేయనని యెంచుచుంటివేమొ,
  వ్యర్థమే యట్టి నీ నిశ్చయంబు సుమ్ము
  నీదు ప్రకృతియే నియమించునిన్ను పోర.
 
 
 60.  
  నీ స్వభావగుణములచేనియమితమైన
  క్షాత్రకర్మమునకు నీవుకట్టువడుచు,
  ఇచ్చగింపవొ భ్రాంతిచేనేది చేయ,
  నవశుడవునయ్యు చేతు వీవదియె పార్థ!
 
 
 61.  
  సర్వ భూతముల హృదయస్థానమందు,
  ఈశ్వరుం డర్జునా! యధిష్థించి యుండు,
  భూతములనెల్ల యంత్రానబొమ్మల బలె
  త్రిప్పుచుండును నిజమాయదీటుగొలిపి.
 Play This Verse
 
 62.  
  సర్వవిధముల వాని నీశ్వరునె యొకని,
  ఆశ్రయింపుము నీ మనసార పార్థ!
  వాని కృపచేత పొందగవచ్చు నీవు,
  పరమ శాంతియు నిత్య నిర్వాణపదము.
 Play This Verse
 
 63.  
  కూర్మితో నేను గుహ్యాతిగుహ్యమైన,
  జ్ఞానమును వచించితిని విఖ్యాతముగను,
  చిత్తమున నశేషము విమర్శించి దీని
  నెట్లు నీ కిష్టమో చేయు మట్లె పార్థ!
 
 
 64.  
  గుహ్యతమమైన శాస్త్రముగూర్చి నాదు,
  పరమవచనము మఱియొకపరిని వినుమ,
  నీవు నా ప్రియుడ వగుటనిశ్చయముగ,
  మదిని నీ హిత మెంచి చెప్పుదును మరల.
 
 
 65.  
  నన్నె మదినిల్పు భక్తిమైనన్నె కొలువు,
  నన్నె పూజించు సాగిలినాకె మ్రొక్కు,
  నన్నె పొందుట సత్యమునన్నె నమ్ము,
  బాస జేసితి నా ప్రియభక్తుడగుట.
 Play This Verse
 
 66.  
  సర్వధర్మము లెంతయుసంత్యజించి,
  శరణు నన్నే యొకని మనసార గొనుము
  పార్థ! నిన్ను నే సర్వపాపములనుండి,
  ముక్తునిం జేతు శోకముపొందవలదు.
 Play This Verse
 
 67.  
  భక్తిహీనులకును, నతపస్కులకును,
  గురుల సేవించి విననట్టికుమతులకును,
  నన్ను ద్వేషించు, దూఱు మానవుల కెపుడు,
  ఇట్టి ధర్మశాస్త్రము వచియింపరాదు.
 Play This Verse
 
 68.  
  పరమగుహ్యము లీ శాస్త్రవాక్యములను,
  పరమభక్తిని నాయందుప్రబ్బ జేసి,
  ఎవడు నా భక్తులకు వివరించి చెప్పు,
  సందియము లేదు వాడిక పొందు నన్నె.
 Play This Verse
 
 69.  
  అనఘ!మనుజులం దిట్టి వ్యాఖ్యాత కన్న,
  వేరొకడు లేడు నాకు సంప్రీతికరుడు,
  వానికంటెను నితరు డెవండు గాని,
  భువిని ప్రియతరు డిక ముందు పుట్ట బోడు.
 Play This Verse
 
 70.  
  మన యిరువురకు సంవాదమైన యిట్టి
  ధర్మశాస్త్రము సల్పు నధ్యయన మెవడు,
  జ్ఞానయజ్ఞముచేత నవ్వాని వలన,
  పూజితుడనైతి నంచు నా బుద్ధి దలతు.
 Play This Verse
 
 71.  
  శ్రద్ధమీఱగ ననసూయబుద్ధితోడ,
  నిట్టి శాస్త్రోపదేశమునెవడు వినునొ,
  పొందు నాతడు పాప విముక్తి నొంది,
  పుణ్యకర్ములు బొందెడుపుణ్యగతులు.
 Play This Verse
 
 72.  
  చిత్తమేకాగ్రముగ నిల్పిచెదర నీక,
  విజయ! వింటివే నే జెప్పువిషయమెల్ల,
  బుద్ధి విక్షేపకరమైనమోహ మెల్ల,
  నాశమయ్యెగదోయి ధనంజయుండ!
 
 
 73.  అర్జునుడనెను:
  అచ్యుతా! నీ యపార కృపామృతమున,
  నాదు మోహము నశియించెజ్ఞాన మబ్బె,
  సంశయంబులు బాసె స్వస్థతయు జిక్కె,
  నీదు వచనము పాటింతునిశ్చయముగ.
 Play This Verse
 
 74.  సంజయుడనెను:
  అమ్మహాత్ములు, వాసుదేవార్జునులకు,
  నిట్లు నడచిన సంవాదమెల్ల నేను,
  వినెడు భాగ్యము గలిగెనువీనులార,
  అధ్బుతంబది కడు రోమహర్షణంబు.
 
 
 75.  
  కృష్ణపరమాత్మ మరమయోగేశ్వరుండు,
  పరమగుహ్య మీయోగ తత్త్వమును గూర్చి,
  పార్థునకు బ్రీతి బోధింపస్వయముగాను,
  వ్యాస కృపచేత నా చెవులార వింటి.
 
 
 76.  
  పుణ్యదాయకమును, మహాద్భుతమును గొల్పు,
  అచ్యుతార్జున సంవాదమధిప!నేను
  మాటి మాటికి మదిని సంస్మరణ జేసి,
  పరవశింతును హర్ష సంభరితునగుచు.
 
 
 77.  
  అద్భుతంబును భు విస్మయమును గొల్పు,
  పరుని హరి విశ్వరూపముస్వాంతమందు,
  సారె సారెకు రాజ!సంస్మరణ జేసి,
  పరవశింతును సంతోషభావమునను.
 
 
 78.  
  ఎచట యోగేశ్వరుండు శ్రీకృష్ణుడుండు,
  ఎచట పార్థుడు ధను వెక్కువెట్టి నిలుచు,
  అచట శ్రీయు, విభూతి, జయమ్ము, నీతి,
  శాస్వతంబని నామదివిశ్వసింతు.
 Play This Verse
 
 
 1.  అర్జున ఉవాచ:
  సంన్యాసస్య మహాబాహో
   తత్త్వమిచ్ఛామి వేదితుమ్
  త్యాగస్య చ హృషీకేశ
   పృథక్కేశినిషూదన
 
 
 2.  శ్రీభగవానువాచ:
  కామ్యానాం కర్మణాం న్యాసం
   సంన్యాసం కవయో విదుః
  సర్వకర్మఫలత్యాగం
  ప్రాహుస్త్యాగం విచక్షణాః
 
 
 3.  
  త్యాజ్యం దోషవదిత్యేకే
  కర్మ ప్రాహుర్మనీషిణః
  యజ్ఞదానతపఃకర్మ
   న త్యాజ్యమితి చాపరే
 
 
 4.  
  నిశ్చయం శృణు మే తత్ర
  త్యాగే భరతసత్తమ
  త్యాగో హి పురుషవ్యాఘ్ర
  త్రివిధః సంప్రకీర్తితః
 
 
 5.  
  యజ్ఞదానతపఃకర్మ
   న త్యాజ్యం కార్యమేవ తత్
  యజ్ఞో దానం తపశ్చైవ
   పావనాని మనీషిణామ్
 
 
 6.  
  ఏతాన్యపి తు కర్మాణి
   సఙ్గం త్యక్త్వా ఫలాని చ
  కర్తవ్యానీతి మే పార్థ
   నిశ్చితం మతముత్తమమ్
 
 
 7.  
  నియతస్య తు సంన్యాసః
   కర్మణో నోపపద్యతే
  మోహాత్తస్య పరిత్యాగ
  స్తామసః పరికీర్తితః
 
 
 8.  
  దుఃఖమిత్యేవ యత్కర్మ
  కాయక్లేశభయాత్త్యజేత్
  స కృత్వా రాజసం త్యాగం
   నైవ త్యాగఫలం లభేత్
 
 
 9.  
  కార్యమిత్యేవ యత్కర్మ
   నియతం క్రియతేఽర్జున
  సఙ్గం త్యక్త్వా ఫలం చైవ
   స త్యాగః సాత్త్వికో మతః ౯
 
 
 10.  
  న ద్వేష్ట్యకుశలం కర్మ
  కుశలే నానుషజ్జతే
  త్యాగీ సత్త్వసమావిష్టో
  మేధావీ ఛిన్నసంశయః ౦
 
 
 11.  
  న హి దేహభృతా శక్యం
   త్యక్తుం కర్మాణ్యశేషతః
  యస్తు కర్మఫలత్యాగీ
   స త్యాగీత్యభిధీయతే
 
 
 12.  
  అనిష్టమిష్టం మిశ్రం చ
   త్రివిధం కర్మణః ఫలమ్
  భవత్యత్యాగినాం ప్రేత్య
   న తు సంన్యాసినాం క్వచిత్
 
 
 13.  
  పఞ్చైతాని మహాబాహో
  కారణాని నిబోధ మే
  సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని
   సిద్ధయే సర్వకర్మణామ్
 
 
 14.  
  అధిష్ఠానం తథా కర్తా
  కరణం చ పృథగ్విధమ్
  వివిధాశ్చ పృథక్చేష్టా
   దైవం చైవాత్ర పఞ్చమమ్
 
 
 15.  
  శరీరవాఙ్‌మనోభిర్య
  త్కర్మ ప్రారభతే నరః
  న్యాయ్యం వా విపరీతం
   వా పఞ్చైతే తస్య హేతవః
 
 
 16.  
  తత్రైవం సతి కర్తార
  మాత్మానం కేవలం తు యః
  పశ్యత్యకృతబుద్ధిత్వా
  న్న స పశ్యతి దుర్మతిః
 
 
 17.  
  యస్య నాహంకృతో
   భావో బుద్ధిర్యస్య న లిప్యతే
  హత్వాపి స ఇమాఁల్లోకా
  న్న హన్తి న నిబధ్యతే
 
 
 18.  
  జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
   త్రివిధా కర్మచోదనా
  కరణం కర్మ కర్తేతి
   త్రివిధః కర్మసంగ్రహః
 
 
 19.  
  జ్ఞానం కర్మ చ కర్తా చ
   త్రిధైవ గుణభేదతః
  ప్రోచ్యతే గుణసంఖ్యానే
   యథావచ్ఛృణు తాన్యపి ౯
 
 
 20.  
  సర్వభూతేషు యేనైకం
   భావమవ్యయమీక్షతే
  అవిభక్తం విభక్తేషు
  తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ౦
 
 
 21.  
  పృథక్త్వేన తు యజ్జ్ఞానం
   నానాభావాన్పృథగ్విధాన్
  వేత్తి సర్వేషు భూతేషు
   తజ్జ్ఞానం విద్ధి రాజసమ్
 
 
 22.  
  యత్తు కృత్స్నవదేకస్మి
  న్కార్యే సక్తమహైతుకమ్
  అతత్త్వార్థవదల్పం చ
  తత్తామసముదాహృతమ్
 
 
 23.  
  నియతం సఙ్గరహిత
  మరాగద్వేషతః కృతమ్
  అఫలప్రేప్సునా కర్మ
   యత్తత్సాత్త్వికముచ్యతే
 
 
 24.  
  యత్తు కామేప్సునా కర్మ
   సాహంకారేణ వా పునః
  క్రియతే బహులాయాసం
   తద్రాజసముదాహృతమ్
 
 
 25.  
  అనుబన్ధం క్షయం హింసా
  మనవేక్ష్య చ పౌరుషమ్
  మోహాదారభ్యతే కర్మ
  యత్తత్తామసముచ్యతే
 
 
 26.  
  ముక్తసఙ్గోఽనహంవాదీ
   ధృత్యుత్సాహసమన్వితః
  సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః
  కర్తా సాత్త్విక ఉచ్యతే
 
 
 27.  
  రాగీ కర్మఫలప్రేప్సు
  ర్లుబ్ధో హింసాత్మకోఽశుచిః
  హర్షశోకాన్వితః కర్తా
   రాజసః పరికీర్తితః
 
 
 28.  
  అయుక్తః ప్రాకృతః స్తబ్ధః
  శఠో నైష్కృతికోఽలసః
  విషాదీ దీర్ఘసూత్రీ చ
   కర్తా తామస ఉచ్యతే
 
 
 29.  
  బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
  గుణతస్త్రివిధం శృణు
  ప్రోచ్యమానమశేషేణ
   పృథక్త్వేన ధనంజయ ౯
 
 
 30.  
  ప్రవృత్తిం చ నివృత్తిం చ
   కార్యాకార్యే భయాభయే
  బన్ధం మోక్షం చ యా వేత్తి
   బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ౦
 
 
 31.  
  యయా ధర్మమధర్మం చ
  కార్యం చాకార్యమేవ చ
  అయథావత్ప్రజానాతి
  బుద్ధిః సా పార్థ రాజసీ
 
 
 32.  
  అధర్మం ధర్మమితి యా
   మన్యతే తమసావృతా
  సర్వార్థాన్విపరీతాంశ్చ
   బుద్ధిః సా పార్థ తామసీ
 
 
 33.  
  ధృత్యా యయా ధారయతే
  మనఃప్రాణేన్ద్రియక్రియాః
  యోగేనావ్యభిచారిణ్యా
  ధృతిః సా పార్థ సాత్త్వికీ
 
 
 34.  
  యయా తు ధర్మకామార్థా
  న్ధృత్యా ధారయతేఽర్జున
  ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ
  ధృతిః సా పార్థ రాజసీ
 
 
 35.  
  యయా స్వప్నం భయం శోకం
  విషాదం మదమేవ చ
  న విముఞ్చతి దుర్మేధా
   ధృతిః సా పార్థ తామసీ
 
 
 36.  
  సుఖం త్విదానీం త్రివిధం
   శృణు మే భరతర్షభ
  అభ్యాసాద్రమతే యత్ర
  దుఃఖాన్తం చ నిగచ్ఛతి
 
 
 37.  
  యత్తదగ్రే విషమివ
   పరిణామేఽమృతోపమమ్
  తత్సుఖం సాత్త్వికం ప్రోక్త
  మాత్మబుద్ధిప్రసాదజమ్
 
 
 38.  
  విషయేన్ద్రియసంయోగా
  ద్యత్తదగ్రేఽమృతోపమమ్
  పరిణామే విషమివ
  తత్సుఖం రాజసం స్మృతమ్
 
 
 39.  
  యదగ్రే చానుబన్ధే చ
  సుఖం మోహనమాత్మనః
  నిద్రాలస్యప్రమాదోత్థం
   తత్తామసముదాహృతమ్ ౯
 
 
 40.  
  న తదస్తి పృథివ్యాం వా
   దివి దేవేషు వా పునః
  సత్త్వం ప్రకృతిజైర్ముక్తం
   యదేభిః స్యాత్త్రిభిర్గుణైః ౦
 
 
 41.  
  బ్రాహ్మణక్షత్రియవిశాం
   శూద్రాణాం చ పరన్తప
  కర్మాణి ప్రవిభక్తాని
  స్వభావప్రభవైర్గుణైః
 
 
 42.  
  శమో దమస్తపః శౌచం
   క్షాన్తిరార్జవమేవ చ
  జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం
   బ్రహ్మకర్మ స్వభావజమ్
 
 
 43.  
  శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
   యుద్ధే చాప్యపలాయనమ్
  దానమీశ్వరభావశ్చ
   క్షాత్రం కర్మ స్వభావజమ్
 
 
 44.  
  కృషిగౌరక్ష్యవాణిజ్యం
   వైశ్యకర్మ స్వభావజమ్
  పరిచర్యాత్మకం కర్మ
   శూద్రస్యాపి స్వభావజమ్
 
 
 45.  
  స్వే స్వే కర్మణ్యభిరతః
   సంసిద్ధిం లభతే నరః
  స్వకర్మనిరతః సిద్ధిం
  యథా విన్దతి తచ్ఛృణు
 
 
 46.  
  యతః ప్రవృత్తిర్భూతానాం
   యేన సర్వమిదం తతమ్
  స్వకర్మణా తమభ్యర్చ్య
   సిద్ధిం విన్దతి మానవః
 Play This Verse
 
 47.  
  శ్రేయాన్స్వధర్మో విగుణః
  పరధర్మాత్స్వనుష్ఠితాత్
  స్వభావనియతం కర్మ
   కుర్వన్నాప్నోతి కిల్బిషమ్
 
 
 48.  
  సహజం కర్మ కౌన్తేయ
   సదోషమపి న త్యజేత్
  సర్వారమ్భా హి దోషేణ
   ధూమేనాగ్నిరివావృతాః
 
 
 49.  
  అసక్తబుద్ధిః సర్వత్ర
   జితాత్మా విగతస్పృహః
  నైష్కర్మ్యసిద్ధిం పరమాం
   సంన్యాసేనాధిగచ్ఛతి ౯
 
 
 50.  
  సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
   తథాప్నోతి నిబోధ మే
  సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా
   జ్ఞానస్య యా పరా ౦
 
 
 51.  
  బుద్ధ్యా విశుద్ధ్యా యుక్తో
  ధృత్యాత్మానం నియమ్య చ
  శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా
  రాగద్వేషౌ వ్యుదస్య చ
 Play This Verse
 
 52.  
  వివిక్తసేవీ లఘ్వాశీ
  యతవాక్కాయమానసః
  ధ్యానయోగపరో నిత్యం
   వైరాగ్యం సముపాశ్రితః
 Play This Verse
 
 53.  
  అహంకారం బలం దర్పం
   కామం క్రోధం పరిగ్రహమ్
  విముచ్య నిర్మమః శాన్తో
  బ్రహ్మభూయాయ కల్పతే
 Play This Verse
 
 54.  
  బ్రహ్మభూతః ప్రసన్నాత్మా
   న శోచతి న కాఙ్క్షతి
  సమః సర్వేషు భూతేషు
  మద్భక్తిం లభతే పరామ్
 
 
 55.  
  భక్త్యా మామభిజానాతి
  యావాన్యశ్చాస్మి తత్త్వతః
  తతో మాం తత్త్వతో జ్ఞాత్వా
  విశతే తదనన్తరమ్
 
 
 56.  
  సర్వకర్మాణ్యపి సదా
   కుర్వాణో మద్వ్యపాశ్రయః
  మత్ప్రసాదాదవాప్నోతి
  శాశ్వతం పదమవ్యయమ్
 
 
 57.  
  చేతసా సర్వకర్మాణి
  మయి సంన్యస్య మత్పరః
  బుద్ధియోగముపాశ్రిత్య
   మచ్చిత్తః సతతం భవ
 
 
 58.  
  మచ్చిత్తః సర్వదుర్గాణి
   మత్ప్రసాదాత్తరిష్యసి
  అథ చేత్త్వమహంకారాన్న
   శ్రోష్యసి వినఙ్క్ష్యసి
 
 
 59.  
  యదహంకారమాశ్రిత్య
   న యోత్స్య ఇతి మన్యసే
  మిథ్యైష వ్యవసాయస్తే
   ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ౯
 
 
 60.  
  స్వభావజేన కౌన్తేయ
  నిబద్ధః స్వేన కర్మణా
  కర్తుం నేచ్ఛసి యన్మోహా
  త్కరిష్యస్యవశోఽపి తత్ ౦
 
 
 61.  
  ఈశ్వరః సర్వభూతానాం
   హృద్దేశేఽర్జున తిష్ఠతి
  భ్రామయన్సర్వభూతాని
   యన్త్రారూఢాని మాయయా
 Play This Verse
 
 62.  
  తమేవ శరణం గచ్ఛ
   సర్వభావేన భారత
  తత్ప్రసాదాత్పరాం శాన్తిం
   స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్
 Play This Verse
 
 63.  
  ఇతి తే జ్ఞానమాఖ్యాతం
   గుహ్యాద్‌గుహ్యతరం మయా
  విమృశ్యైతదశేషేణ
  యథేచ్ఛసి తథా కురు
 
 
 64.  
  సర్వగుహ్యతమం భూయః
   శృణు మే పరమం వచః
  ఇష్టోఽసి మే దృఢమితి
  తతో వక్ష్యామి తే హితమ్
 
 
 65.  
  మన్మనా భవ మద్భక్తో
   మద్యాజీ మాం నమస్కురు
  మామేవైష్యసి సత్యం తే
   ప్రతిజానే ప్రియోఽసి మే
 Play This Verse
 
 66.  
  సర్వధర్మాన్పరిత్యజ్య
   మామేకం శరణం వ్రజ
  అహం త్వాం సర్వపాపేభ్యో
   మోక్షయిష్యామి మా శుచః
 Play This Verse
 
 67.  
  ఇదం తే నాతపస్కాయ
   నాభక్తాయ కదాచన
  న చాశుశ్రూషవే వాచ్యం
   న చ మాం యోఽభ్యసూయతి
 Play This Verse
 
 68.  
  య ఇమం పరమం గుహ్యం
   మద్భక్తేష్వభిధాస్యతి
  భక్తిం మయి పరాం కృత్వా
   మామేవైష్యత్యసంశయః
 Play This Verse
 
 69.  
  న చ తస్మాన్మనుష్యేషు
   కశ్చిన్మే ప్రియకృత్తమః
  భవితా న చ మే తస్మా
  దన్యః ప్రియతరో భువి ౯
 Play This Verse
 
 70.  
  అధ్యేష్యతే చ య ఇమం
   ధర్మ్యం సంవాదమావయోః
  జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః
   స్యామితి మే మతిః ౦
 Play This Verse
 
 71.  
  శ్రద్ధావాననసూయశ్చ
  శృణుయాదపి యో నరః
  సోఽపి ముక్తః శుభాఁల్లోకా
  న్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్
 Play This Verse
 
 72.  
  కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
  త్వయైకాగ్రేణ చేతసా
  కచ్చిదజ్ఞానసంమోహః
   ప్రనష్టస్తే ధనంజయ
 
 
 73.  అర్జున ఉవాచ:
  నష్టో మోహః స్మృతిర్లబ్ధా
  త్వత్ప్రసాదాన్మయాచ్యుత
  స్థితోఽస్మి గతసన్దేహః
  కరిష్యే వచనం తవ
 Play This Verse
 
 74.  సంజయ ఉవాచ:
  ఇత్యహం వాసుదేవస్య
   పార్థస్య చ మహాత్మనః
  సంవాదమిమమశ్రౌష
  మద్భుతం రోమహర్షణమ్
 
 
 75.  
  వ్యాసప్రసాదాచ్ఛ్రుతవా
  నేతద్గుహ్యమహం పరమ్
  యోగం యోగేశ్వరాత్కృష్ణా
  త్సాక్షాత్కథయతః స్వయమ్
 
 
 76.  
  రాజన్సంస్మృత్య సంస్మృత్య
   సంవాదమిమమద్భుతమ్
  కేశవార్జునయోః పుణ్యం
  హృష్యామి చ ముహుర్ముహుః
 
 
 77.  
  తచ్చ సంస్మృత్య సంస్మృత్య
   రూపమత్యద్భుతం హరేః
  విస్మయో మే మహాన్ రాజ
  న్హృష్యామి చ పునః పునః
 
 
 78.  
  యత్ర యోగేశ్వరః కృష్ణో
   యత్ర పార్థో ధనుర్ధరః
  తత్ర శ్రీర్విజయో భూతి
  ర్ధ్రువా నీతిర్మతిర్మమ
 Play This Verse
 
 
  1 |  2 |  3 |  4 |  5 |  6 |  7 |  8 |  9 |  10 |  11 |  12 |  13 |  14 |  15 |  16 |  17 |  18