| |
| 1. అర్జునుడనెను: |
| శాస్త్రవిధులను విడనాడి శ్రద్ధతోడ, |
| అర్చనల నెవ్వ రేనియు నాచరింప, |
| ఎట్టి నిష్ఠయొ వారి దీ వెఱుగ జెపుమ, |
| సాత్త్వికమొ, రాజసమొ, తామ సంబొ కృష్ణ! |
|
| |
|
| 2. శ్రీ భగవానుడనెను: |
| త్రివిధములు శ్రద్ధ లీ భువి దేహులందు, |
| సాత్త్వికము, రాజసము తామ సంబు నాగ |
| వారి వారి స్వభావమువలన గలుగు, |
| పూర్వజన్మసంస్కారానుపూర్వకముగ. |
|
| |
|
| 3. |
| సర్వమానవు లందున శ్రద్ధ గలుగు, |
| వారి తొలిబాము సంస్కార భావ సరణి, |
| ఈమనుష్యుండు పార్థ! శ్ర ద్ధామయుండు, |
| ఎవని శ్రద్ధ యెట్టిదొ పూర్వ మిప్పు డదియె. |
Play This Verse |
| |
|
| 4. |
| దేవతల యజియింత్రు సా త్త్వికజనంబు, |
| రాక్షసుల, యక్షుల, యజింత్రు రాజసికులు, |
| ప్రేత భూత గణంబు ల ర్చించు చుంద్రు |
| తామసికులైన జనులు భూ తలము నందు. |
|
| |
|
| 5. |
| దంభమాను లహంకార దర్పగుణులు, |
| కామ, రాగ బలాన్విత గర్వమతులు, |
| ఏవి మూఢులు శాస్త్ర వి హీనమైన, |
| ఘోర తపముల జేయగా కోరుచుంద్రొ; |
|
| |
|
| 6. |
| ఈ శరీరమందున్న స ర్వేంద్రియముల, |
| ఆత్మ యందున్న పరమాత్మనైన నన్ను, |
| కృఛ్రవ్రతములతో కృశి యింప జేయు, |
| వారి నెఱుగుమ యసుర స్వ భావులనుచు. |
|
| |
|
| 7. |
| ఇష్టమైన యాహారములెల్లరకును |
| మూడు విధములు, శ్రద్ధలు మూటి వలెను, |
| యజ్ఞ దాన తపోవిధు లట్లె గలవు, |
| వినుము తెలిపెద వాని వి భేదములను. |
|
| |
|
| 8. |
| ఆయురారోగ్యబలసత్త్వ దాయకములు, |
| ప్రీతికరములు, సుఖశాంతి వృద్ధిదములు, |
| స్థిరములును, రస్య హృద్య సు స్నిగ్ధములును, |
| సాత్త్వికుల కిష్టమైన భో జనములగును. |
|
| |
|
| 9. |
| కారమును, చేదు, పులుపుప్పు గలిగినవియు, |
| ఎండినవి, దప్పి, వేడి గ ల్గించునవియు, |
| శోక, రోగ, దుఃఖమ్ముల కాకరములు |
| భోజనము లిష్టమైనవి రాజసులకు. |
|
| |
|
| 10. |
| చల్దియైనవి తిన జవి జచ్చినవియు, |
| పులిసియున్నవి, దుర్గంధ కలితములును, |
| ఎంగిలైనవి పూజకు హేయములును, |
| ఇష్టములు తామసజనుల కట్టి తిండ్లు. |
|
| |
|
| 11. |
| ఎట్టి యజ్ఞము ఫలము నాశింప బోక, |
| చేయ కర్తవ్యమని స్థిర చిత్తమెసగ, |
| శాస్త్రనిర్దిష్టముగ నది సలుపబడిన, |
| అట్టి యజ్ఞము సాత్త్విక మైన దగును. |
|
| |
|
| 12. |
| కాని, యెట్టి యజ్ఞము ఫలా కాంక్ష జేసి, |
| కేవలము డాంబికమునకు కీర్తికొఱకు, |
| ఆచరింతురో పార్థ! నీ వరయ వలయు, |
| నట్టి యజ్ఞము, రాజస మైన దనుచు. |
|
| |
|
| 13. |
| శాస్త్రసమ్మతమే గాక శ్రద్ధ లేక, |
| మంత్రమే లేక దక్షిణ మాటలేక, |
| అన్నదానము లేక చే యంగ బడిన, |
| యట్టి యజ్ఞము తామస మైన దండ్రు. |
|
| |
|
| 14. |
| దేవ గురు భూసుర ప్రాజ్ఞ సేవనమును, |
| శౌచ గుణమును హింసను సలుప కుంట, |
| బ్రహ్మచర్యము సరళ ప్ర వర్తనమును, |
| దైహికంబగు తపమని తలప బడును. |
|
| |
|
| 15. |
| వాక్య మితరుల నుద్వేగ బఱప నిదియు, |
| ప్రియము, హితమును, సత్యము బెంచు నదియు, |
| సతతమును వేదశాస్త్రముల్ జదువుటయును, |
| వాఙ్మయంబైన తపమని పల్క బడును. |
|
| |
|
| 16. |
| చిత్తనైర్మల్యమును, సౌమ్య చిత్తవృత్తి, |
| ఆత్మనిగ్రహమును వాఙ్ని యామకమును, |
| భావసంశుద్ధి యనువాని భరత పుత్ర! |
| మానసికమగు తప మని జ్ఞాను లండ్రు. |
|
| |
|
| 17. |
| యుక్తచిత్తులునై ఫలా సక్తి లేక, |
| త్రివిధమగు నిట్టి తపమును దీక్షబూని, |
| సలుపగా నరులత్యంత శ్రద్ధతోడ, |
| అట్టి తపమును సాత్త్విక మైన దండ్రు. |
|
| |
|
| 18. |
| పూజ సత్కార మానముల్ పొందగోరి, |
| దంభమడరగ తపమెట్టిదైనగాని, |
| చేయ నది రాజసిక మని చెప్పబడును, |
| అస్థిర మశాశ్వతమగు నట్టి దిలను. |
|
| |
|
| 19. |
| మూఢ చిత్తులు దుర్నయ బుద్ధితోడ, |
| తమకు పీడను గలిగించు తపముగాని, |
| పరుల కెగ్గొనరించు త పంబుగాని, |
| చేయ నది తామసిక మని చెప్పబడును. |
|
| |
|
| 20. |
| దేశ కాల పాత్రములను దెలిసియుండి, |
| దాన మెయ్యది తనకు క ర్తవ్యమనుచు, |
| మరల నీయంగ జాలని నరుల కీయ, |
| దాన మది సాత్త్వికం బని తలప బడును. |
|
| |
|
| 21. |
| ఏది ప్రత్యుపకార మ ర్థించి కాని, |
| ఏది ఫలము తిరిగి య పేక్షించి కాని, |
| క్లేశ మొందుచు నిచ్చ లే కేది యొసగు, |
| దాన మది రాజసిక మని తలపబడును. |
|
| |
|
| 22. |
| దేశ కాలము లేమియు దెలిసికొనక, |
| అతిథి సత్కారమే లేక యవగణించి, |
| ఈవి యెట్టి దపాత్రున కిచ్చు నేని, |
| దాన మది తామసికమని తలపబడును. |
|
| |
|
| 23. |
| త్రివిధములుగ బ్రహ్మంబుగ ని ర్దేశ్య మయ్యె |
| అనఘ! యిట్లు ఓంతత్సత్తులనెడు పేర్ల, |
| ఆది యందట్టి బ్రహ్మము నందు నుండె |
| బ్రాహ్మణులు, శ్రుతుల్, యజ్ఞముల్ బయలువెడలె. |
|
| |
|
| 24. |
| కాన శాస్త్రనిర్దిష్టమౌ కర్మలైన |
| యజ్ఞ దాన తపఃకర్మ లాచరింప, |
| ఓమ్మనుచు నాదిలో నామ ముచ్చరింత్రు, |
| సతతమును బ్రహ్మవాదులు సవ్యసాచి! |
|
| |
|
| 25. |
| యజ్ఞములు జేయ, తపముల నాచరింప, |
| వివిధ దాన ధర్మక్రియా విధు లొనర్ప, |
| మోక్షకాములు, తచ్ఛబ్ద ముచ్చరింత్రు, |
| ఫలము గోరక నాబ్రహ్మ పదము జేర. |
|
| |
|
| 26. |
| సత్తన యదార్థవాచక సంజ్ఞ మగును, |
| శ్రేష్ఠ మను నర్థమును గూడ జెప్పనగును, |
| అఖిల శుభకర్మములు సల్పు నపుడు గూడ, |
| వాడబడుచుండు సచ్చబ్ద వాచకంబు. |
|
| |
|
| 27. |
| యజ్ఞ తపముల దానము లందు గలుగు, |
| స్థితిని సత్తను పేరుతో చెప్పుచుంద్రు, |
| భగవదర్థంబు కర్మల భక్తితోడ, |
| చేయ నదియును సత్తని చెప్పబడును. |
|
| |
|
| 28. |
| యజ్ఞ తపములు మఱియు దా నాది విధులు |
| సలుపబడు నెట్టి కర్మలుశ్రద్ధ లేక, |
| పార్థ! వాని నసత్తని పల్కుచుంద్రు, |
| ఇహపరము లందు ఫలముల నీయవవ్వి. |
|
| |
|
|
| |
| 1. అర్జున ఉవాచ: |
| యే శాస్త్రవిధిముత్సృజ్య |
| యజన్తే శ్రద్ధయాన్వితాః |
| తేషాం నిష్ఠా తు కా కృష్ణ |
| సత్త్వమాహో రజస్తమః |
|
| |
|
| 2. శ్రీభగవానువాచ: |
| త్రివిధా భవతి శ్రద్ధా |
| దేహినాం సా స్వభావజా |
| సాత్త్వికీ రాజసీ చైవ |
| తామసీ చేతి తాం శృణు |
|
| |
|
| 3. |
| సత్త్వానురూపా సర్వస్య |
| శ్రద్ధా భవతి భారత |
| శ్రద్ధామయోఽయం పురుషో |
| యో యచ్ఛ్రద్ధః స ఏవ సః |
Play This Verse |
| |
|
| 4. |
| యజన్తే సాత్త్వికా దేవా |
| న్యక్షరక్షాంసి రాజసాః |
| ప్రేతాన్భూతగణాంశ్చాన్యే |
| యజన్తే తామసా జనాః |
|
| |
|
| 5. |
| అశాస్త్రవిహితం ఘోరం |
| తప్యన్తే యే తపో జనాః |
| దమ్భాహంకారసంయుక్తాః |
| కామరాగబలాన్వితాః |
|
| |
|
| 6. |
| కర్షయన్తః శరీరస్థం |
| భూతగ్రామమచేతసః |
| మాం చైవాన్తఃశరీరస్థం |
| తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ |
|
| |
|
| 7. |
| ఆహారస్త్వపి సర్వస్య |
| త్రివిధో భవతి ప్రియః |
| యజ్ఞస్తపస్తథా దానం |
| తేషాం భేదమిమం శృణు |
|
| |
|
| 8. |
| ఆయుఃసత్త్వబలారోగ్య |
| సుఖప్రీతివివర్ధనాః |
| రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా |
| ఆహారాః సాత్త్వికప్రియాః |
|
| |
|
| 9. |
| కట్‌వమ్లలవణాత్యుష్ణ |
| తీక్ష్ణరూక్షవిదాహినః |
| ఆహారా రాజసస్యేష్టా |
| దుఃఖశోకామయప్రదాః ౯ |
|
| |
|
| 10. |
| యాతయామం గతరసం |
| పూతి పర్యుషితం చ యత్ |
| ఉచ్ఛిష్టమపి చామేధ్యం |
| భోజనం తామసప్రియమ్ ౦ |
|
| |
|
| 11. |
| అఫలాకాఙ్క్షిభిర్యజ్ఞో |
| విధిదృష్టో య ఇజ్యతే |
| యష్టవ్యమేవేతి మనః |
| సమాధాయ స సాత్త్వికః |
|
| |
|
| 12. |
| అభిసంధాయ తు ఫలం |
| దమ్భార్థమపి చైవ యత్ |
| ఇజ్యతే భరతశ్రేష్ఠ |
| తం యజ్ఞం విద్ధి రాజసమ్ |
|
| |
|
| 13. |
| విధిహీనమసృష్టాన్నం |
| మన్త్రహీనమదక్షిణమ్ |
| శ్రద్ధావిరహితం యజ్ఞం |
| తామసం పరిచక్షతే |
|
| |
|
| 14. |
| దేవద్విజగురుప్రాజ్ఞ |
| పూజనం శౌచమార్జవమ్ |
| బ్రహ్మచర్యమహింసా |
| చ శారీరం తప ఉచ్యతే |
|
| |
|
| 15. |
| అనుద్వేగకరం వాక్యం |
| సత్యం ప్రియహితం చ యత్ |
| స్వాధ్యాయాభ్యసనం చైవ |
| వాఙ్మయం తప ఉచ్యతే |
|
| |
|
| 16. |
| మనః ప్రసాదః సౌమ్యత్వం |
| మౌనమాత్మవినిగ్రహః |
| భావసంశుద్ధిరిత్యేత |
| త్తపో మానసముచ్యతే |
|
| |
|
| 17. |
| శ్రద్ధయా పరయా తప్తం |
| తపస్తత్త్రివిధం నరైః |
| అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః |
| సాత్త్వికం పరిచక్షతే |
|
| |
|
| 18. |
| సత్కారమానపూజార్థం |
| తపో దమ్భేన చైవ యత్ |
| క్రియతే తదిహ ప్రోక్తం |
| రాజసం చలమధ్రువమ్ |
|
| |
|
| 19. |
| మూఢగ్రాహేణాత్మనో |
| యత్పీడయా క్రియతే తపః |
| పరస్యోత్సాదనార్థం వా |
| తత్తామసముదాహృతమ్ ౯ |
|
| |
|
| 20. |
| దాతవ్యమితి యద్దానం |
| దీయతేఽనుపకారిణే |
| దేశే కాలే చ పాత్రే చ |
| తద్దానం సాత్త్వికం స్మృతమ్ ౦ |
|
| |
|
| 21. |
| యత్తు ప్రత్యుపకారార్థం |
| ఫలముద్దిశ్య వా పునః |
| దీయతే చ పరిక్లిష్టం |
| తద్దానం రాజసం స్మృతమ్ |
|
| |
|
| 22. |
| అదేశకాలే యద్దాన |
| మపాత్రేభ్యశ్చ దీయతే |
| అసత్కృతమవజ్ఞాతం |
| తత్తామసముదాహృతమ్ |
|
| |
|
| 23. |
| తత్సదితి నిర్దేశో |
| బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
| బ్రాహ్మణాస్తేన వేదాశ్చ |
| యజ్ఞాశ్చ విహితాః పురా |
|
| |
|
| 24. |
| తస్మాదోమిత్యుదాహృత్య |
| యజ్ఞదానతపఃక్రియాః |
| ప్రవర్తన్తే విధానోక్తాః |
| సతతం బ్రహ్మవాదినామ్ |
|
| |
|
| 25. |
| తదిత్యనభిసన్ధాయ |
| ఫలం యజ్ఞతపఃక్రియాః |
| దానక్రియాశ్చ వివిధాః |
| క్రియన్తే మోక్షకాఙ్క్షిభిః |
|
| |
|
| 26. |
| సద్భావే సాధుభావే చ |
| సదిత్యేతత్ప్రయుజ్యతే |
| ప్రశస్తే కర్మణి తథా |
| సచ్ఛబ్దః పార్థ యుజ్యతే |
|
| |
|
| 27. |
| యజ్ఞే తపసి దానే చ |
| స్థితిః సదితి చోచ్యతే |
| కర్మ చైవ తదర్థీయం |
| సదిత్యేవాభిధీయతే |
|
| |
|
| 28. |
| అశ్రద్ధయా హుతం దత్తం |
| తపస్తప్తం కృతం చ యత్ |
| అసదిత్యుచ్యతే పార్థ |
| న చ తత్ప్రేత్య నో ఇహ |
|
| |
|
|