| |
| 1. |
| చిత్తసంశుద్ధి నిర్భయచిత్తవృత్తి, |
| జ్ఞానయోగమునందు నేకాగ్ర నిష్ఠ, |
| సరళవర్తన, మింద్రియసంయమమును, |
| తపము,యజ్ఞము,స్వాధ్యాయదానములును; |
|
| |
|
| 2. |
| సత్యము, నహింస, త్యాగము,శాంతగుణము, |
| కొండెబుద్ధియు, లేమి, నక్రోధ గుణము, |
| భూతదయయును, చంచలబుద్ధిలేమి, |
| లజ్జయును, మార్దవము, నలోలతయు మఱియు; |
|
| |
|
| 3. |
| క్షమము, తేజము, ధృతియునుశౌచగుణము |
| దురభిమానము లేమి, నద్రోహబుద్ధి, |
| దైవసంపద జన్ముడైతనరు వాని |
| గుణము లివి యనితెలియుముకురు కుమార! |
|
| |
|
| 4. |
| దంభమును, క్రోధ మభిమానదర్పములును, |
| పరగ నజ్ఞాన పరుషస్వభావములును, |
| అసురసంపద జన్మకునర్హుడైన |
| యతడు పొందెడు గుణము లంచరయు మీవు. |
|
| |
|
| 5. |
| దైవసంపద మోక్షప్రదాయకంబు, |
| అసురసంపద భవబంధమంట గట్టు, |
| నీవు దైవాంశమునను జన్మించినావు, |
| కాన, శోకింప వల దయ్యకౌరవేంద్ర |
|
| |
|
| 6. |
| దైవిక మ్మాసుర మ్మనిధరణి యందు, |
| రెండు విధములుగా భూతసృష్టి గలదు, |
| వినిచితిని దైవికాంశముల్విస్తరముగ |
| ఆసురాంశమ్ము లీ వికనాలకింపు. |
|
| |
|
| 7. |
| ఎట్టి కర్మము లందు ప్రవృత్తివలయు, |
| ఎట్టి కర్మము లందు నివృత్తివలయు, |
| అసురభావము కలవారలరయ లేరు |
| శుచియు సత్య మాచారముల్శూన్యమగుట |
|
| |
|
| 8. |
| అసురు లప్రతిష్ఠ మసత్యమండ్రు జగతి, |
| నీశ్వరుండును లేడనియెంత్రువారు, |
| మిథునజన్యము కాని దేమియును లేదు |
| కామహేతువు కానిదికలదె వేరె. |
|
| |
|
| 9. |
| అట్టి నాస్తికదృష్టి వారాశ్రయించి |
| అల్పమతులు,నీచులు వినష్టాత్ములైన, |
| యుగ్రకర్ములు,శత్రువులుద్భవించి, |
| జగము నశియించు కర్మలసలుపుచుంద్రు. |
|
| |
|
| 10. |
| అపరిమితమైన కామమునాశ్రయించి, |
| దంభ దర్పాభిమాన మదాన్వితులయి, |
| ఎగ్గు తలపెట్టి యవివేకమగ్గలింప, |
| కడగి వర్తింతు రపవిత్రకర్మలందు. |
|
| |
|
| 11. |
| అపరిమితమైన చింతనమందు మునిగి, |
| అంత్యకాలము వరకదియాశ్రయించి, |
| కామభొగమె పరమ లక్ష్యముగ నెంచి, |
| యిదియె పురుషార్ధమని నిశ్చయించు కొనుచు; |
|
| |
|
| 12. |
| వందలును వేల యాశలబద్ధు లగుచు, |
| కామ విక్రోధ పూర్ణులైగ్రాలు చుండి, |
| గడన సేతురు కామ భోగార్థు లగుచు, |
| కుటిలవృత్తుల ధనమునుకోట్లకొలది. |
|
| |
|
| 13. |
| ఇదిగొ యీయాస్తి నాకు లభించె నేడు |
| దీనిచే కోర్కెలెల్లనుతీర్చుకొందు, |
| ఇదిగొ యీధనమంతయునిపుడ నాది, |
| ఇంత ధన మిక ముందు నాకిట్లె యబ్బు; |
|
| |
|
| 14. |
| ఈ విరోధిని హతమొనరించి నాడ, |
| ఇట్లె యితరుల హతమొనరింతు గూడ, |
| నేనె ఈశ్వరుడను, భోగినైన నేనె, |
| నేనె బలశాలి, సిద్ధుడనేనె సుఖిని; |
|
| |
|
| 15. |
| భాగ్యవంతుడ నే గొప్పవంశజుడను, |
| ఇతరు డెవ్వడు సముడు నా కిచట గలడు, |
| దాన మిడ, వేల్వ హర్షింపదగుదు నేనె, |
| యనుచు నసురు లజ్ఞాన మోహమును బొంది; |
|
| |
|
| 16. |
| బహుళవిషయైకచిత్త విభ్రాంతులగుచు, |
| మోహజాలముచే చుట్టుముట్ట బడియు, |
| విషయభోగప్రసక్తినివిడువ లేక, |
| ఘోరనరకము నందునగూలు చుంద్రు. |
|
| |
|
| 17. |
| ఆత్మసంభావితులు, స్తబ్దులవినయులును |
| ధనమదాంధు లహంకారదర్పగుణులు, |
| నామ మాత్రమే యైన యజ్ఞం బొనర్త్రు |
| అవిధి పూర్వకముగ దంభమడర గాను. |
|
| |
|
| 18. |
| అహము, బలమును, దర్పమునతిశయిల్ల, |
| కామవిక్రోధములకునుకట్టువడుచు, |
| స్వ పర దేహములందునవఱలు నన్ను, |
| ఈసడింతురు విద్వేషహృదయు లగుచు. |
|
| |
|
| 19. |
| క్రూర కర్ముల,విద్వేషపూరితులను, |
| అశుభకర్మలు సల్పు నరాధములను |
| అసురయోనుల యందె నేననవరతము, |
| ఘోరసంసారములు పొందకూల ద్రోతు. |
|
| |
|
| 20. |
| జన్మ జన్మకు నీమూఢజనులు పార్ఠ! |
| అశుభయాసురయోనులేయాశ్రయించి, |
| పొంద జాలకయే నన్నుపోవు చుందు |
| రంత కంతకధోగతులందు జేర. |
|
| |
|
| 21. |
| క్రోధమును కామమును లోభగుణము లనెడు |
| మూడు ద్వారములు నరకమునకు గలవు, |
| ఆత్మనాశనహేతువులైన వివ్వి, |
| కాన, నీమూడు త్యజియింపగడగవలయు. |
|
| |
|
| 22. |
| తమముతో జెలగు నరకద్వారములను, |
| మూటి నుండియు నరుడు విముక్తి బొంది, |
| ఆత్మశ్రేయస్కరంబైనదాచరించి, |
| తత్ఫలంబగు పరమ పదంబు బొందు. |
|
| |
|
| 23. |
| శాస్త్రవిధు లెవ్వడివి విసర్జనము జేసి, |
| యిచ్చ వచ్చిన యట్లు వ ర్తించు చుండు, |
| నెట్టి పురుషార్థసిద్ధినినెనయ డతడు, |
| లేదు మోక్షము భువినైనలేదు సుఖము. |
Play This Verse |
| |
|
| 24. |
| కాన, శాస్త్రమే నీకు బ్రమాణ మగును, |
| కార్యము నకార్యమీవు నిక్కము గ్రహింప, |
| శాస్త్రవిధు లన్ని చక్కగసంగ్రహించి, |
| కర్మ మిల జేయ నర్హుడకమ్ము పార్ఠ! |
|
| |
|
|
| |
| 1. |
| అభయం సత్త్వసంశుద్ధి |
| ర్జ్ఞానయోగవ్యవస్థితిః |
| దానం దమశ్చ యజ్ఞశ్చ |
| స్వాధ్యాయస్తప ఆర్జవమ్ |
|
| |
|
| 2. |
| అహింసా సత్యమక్రోధ |
| స్త్యాగః శాన్తిరపైశునమ్ |
| దయా భూతేష్వలోలుప్త్వం |
| మార్దవం హ్రీరచాపలమ్ |
|
| |
|
| 3. |
| తేజః క్షమా ధృతిః శౌచ |
| మద్రోహో నాతిమానితా |
| భవన్తి సంపదం దైవీ |
| మభిజాతస్య భారత |
|
| |
|
| 4. |
| దమ్భో దర్పోఽభిమానశ్చ |
| క్రోధః పారుష్యమేవ చ |
| అజ్ఞానం చాభిజాతస్య |
| పార్థ సంపదమాసురీమ్ |
|
| |
|
| 5. |
| దైవీ సంపద్విమోక్షాయ |
| నిబన్ధాయాసురీ మతా |
| మా శుచః సంపదం దైవీ |
| మభిజాతోఽసి పాణ్డవ |
|
| |
|
| 6. |
| ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మి |
| న్దైవ ఆసుర ఏవ చ |
| దైవో విస్తరశః ప్రోక్త |
| ఆసురం పార్థ మే శృణు |
|
| |
|
| 7. |
| ప్రవృత్తిం చ నివృత్తిం చ |
| జనా న విదురాసురాః |
| న శౌచం నాపి చాచారో |
| న సత్యం తేషు విద్యతే |
|
| |
|
| 8. |
| అసత్యమప్రతిష్ఠం తే |
| జగదాహురనీశ్వరమ్ |
| అపరస్పరసంభూతం |
| కిమన్యత్కామహైతుకమ్ |
|
| |
|
| 9. |
| ఏతాం దృష్టిమవష్టభ్య |
| నష్టాత్మానోఽల్పబుద్ధయః |
| ప్రభవన్త్యుగ్రకర్మాణః |
| క్షయాయ జగతోఽహితాః ౯ |
|
| |
|
| 10. |
| కామమాశ్రిత్య దుష్పూరం |
| దమ్భమానమదాన్వితాః |
| మోహాద్‌గృహీత్వాసద్గ్రాహా |
| న్ప్రవర్తన్తేఽశుచివ్రతాః ౦ |
|
| |
|
| 11. |
| చిన్తామపరిమేయాం చ |
| ప్రలయాన్తాముపాశ్రితాః |
| కామోపభోగపరమా |
| ఏతావదితి నిశ్చితాః |
|
| |
|
| 12. |
| ఆశాపాశశతైర్బద్ధాః |
| కామక్రోధపరాయణాః |
| ఈహన్తే కామభోగార్థ |
| మన్యాయేనార్థసఞ్చయాన్ |
|
| |
|
| 13. |
| ఇదమద్య మయా లబ్ధ |
| మిమం ప్రాప్స్యే మనోరథమ్ |
| ఇదమస్తీదమపి మే |
| భవిష్యతి పునర్ధనమ్ |
|
| |
|
| 14. |
| అసౌ మయా హతః శత్రు |
| ర్హనిష్యే చాపరానపి |
| ఈశ్వరోఽహమహం భోగీ |
| సిద్ధోఽహం బలవాన్సుఖీ |
|
| |
|
| 15. |
| ఆఢ్యోఽభిజనవానస్మి |
| కోఽన్యోఽస్తి సదృశో మయా |
| యక్ష్యే దాస్యామి మోదిష్య |
| ఇత్యజ్ఞానవిమోహితాః |
|
| |
|
| 16. |
| అనేకచిత్తవిభ్రాన్తా |
| మోహజాలసమావృతాః |
| ప్రసక్తాః కామభోగేషు |
| పతన్తి నరకేఽశుచౌ |
|
| |
|
| 17. |
| ఆత్మసంభావితాః స్తబ్ధా |
| ధనమానమదాన్వితాః |
| యజన్తే నామయజ్ఞైస్తే |
| దమ్భేనావిధిపూర్వకమ్ |
|
| |
|
| 18. |
| అహంకారం బలం దర్పం |
| కామం క్రోధం చ సంశ్రితాః |
| మామాత్మపరదేహేషు |
| ప్రద్విషన్తోఽభ్యసూయకాః |
|
| |
|
| 19. |
| తానహం ద్విషతః క్రురా |
| న్సంసారేషు నరాధమాన్ |
| క్షిపామ్యజస్రమశుభా |
| నాసురీష్వేవ యోనిషు ౯ |
|
| |
|
| 20. |
| ఆసురీం యోనిమాపన్నా |
| మూఢా జన్మని జన్మని |
| మామప్రాప్యైవ కౌన్తేయ |
| తతో యాన్త్యధమాం గతిమ్ ౦ |
|
| |
|
| 21. |
| త్రివిధం నరకస్యేదం |
| ద్వారం నాశనమాత్మనః |
| కామః క్రోధస్తథా లోభ |
| స్తస్మాదేతత్త్రయం త్యజేత్ |
|
| |
|
| 22. |
| ఏతైర్విముక్తః కౌన్తేయ |
| తమోద్వారైస్త్రిభిర్నరః |
| ఆచరత్యాత్మనః శ్రేయ |
| స్తతో యాతి పరాం గతిమ్ |
|
| |
|
| 23. |
| యః శాస్త్రవిధిముత్సృజ్య |
| వర్తతే కామకారతః |
| న స సిద్ధిమవాప్నోతి న |
| సుఖం న పరాం గతిమ్ |
Play This Verse |
| |
|
| 24. |
| తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం |
| తే కార్యాకార్యవ్యవస్థితౌ |
| జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం |
| కర్మ కర్తుమిహార్హసి |
|
| |
|
|