| |
| 1. శ్రీ భగవానుడనెను: |
| పైన వేళ్ళుండి కొమ్మలు బర్వు క్రింద, |
| వేద మాకులౌ సంసార వృక్షమునకు, |
| అవ్యయంబైన యశ్వత్థ మనెడు దీని |
| వివర మెఱిగిన వాడె పో వేదవిదుడు. |
|
| |
|
| 2. |
| వృక్షశాఖలు, త్రిగుణ ప్ర వృద్ధి నొంది, |
| విషయ పల్లవముల తోడ విస్తరించు, |
| నెగువ దిగువను వేళ్ళు వ్యా పించి క్రింద, |
| కర్మబద్ధుల జేయు లో కాన ప్రజల. |
|
| |
|
| 3. |
| ఇహమునం దిట్టిదని రూప మెఱుగ రాదు, |
| ఆదిమధ్యాంతములు దీనివరయ లేవు, |
| ఇట్టి ధృఢమూల యశ్వత్థ వృక్షమీవు, |
| కూల నఱకుము వైరగ్య కులిశధార. |
|
| |
|
| 4. |
| ఏ పదము జేర తిరిగి వా రిటకు రారొ, |
| ఎవని నుండి యనాది ప్ర వృత్తి విరిసె, |
| వానినే యాదిపురుషు, ప్ర పద్యుడనుచు, |
| వెదుక దగు నాపరబ్రహ్మ పదము విడక. |
|
| |
|
| 5. |
| ముక్తకాములు, నిర్మాన మోహమతులు, |
| ముక్తసంగులు, ద్వంద్వ వి విముక్త ఘనులు, |
| నిత్యమధ్యాత్మతత్త్వ వి నిష్థులైన |
| జ్ఞాను లవ్యయపదమును గాంచ గలరు. |
Play This Verse |
| |
|
| 6. |
| సూర్యుడగ్నియు చంద్రుడున్ చుక్కలన్ని, |
| చేరి యేపదము వెలుగ జేయ లేరొ, |
| ఏ పదము జేర తిరిగి వా రిటకు రారొ, |
| అదియె నాపరమ నివాస పదము పార్థ! |
Play This Verse |
| |
|
| 7. |
| జీవభూతముగా లోక జీవులందు, |
| నలరు నాసనాతనమైన యంశ మొకటి, |
| అదియె పంచేంద్రియముల, నా ఱగు మనస్సు |
| ప్రకృతిగతమైన వానిని బట్టి లాగు |
|
| |
|
| 8. |
| జీవు డీశరీరము పొంద జేరు నపుడు, |
| మఱల నద్దాని విడిచి తా మరలు నపుడు, |
| ఇంద్రియముల నీయాఱు గ్ర హించి చనును |
| పూలతావిని గాలి కొం పోవునట్లు. |
|
| |
|
| 9. |
| చెవియు, నేత్రము, చర్మము జిహ్వ, నాస |
| యనెడు పంచేంద్రియమ్ముల మనసు తోడి, |
| జీవు డీదేహ మం దధి ష్ఠించి యుండి, |
| విషయముల వెంటనంటి సే వించు వాని |
|
| |
|
| 10. |
| వెడలి చనువాడు, నించుండి వెలుగు వాడు, |
| విషయభోక్తయు, గుణసమ న్వితుడునైన, |
| జీవు నీమూఢజనులు ద ర్శింప లేరు, |
| జ్ఞానచక్షువు గలవారు గాంత్రు వాని. |
|
| |
|
| 11. |
| యత్నమున యోగిజనులు, శు ద్ధాత్మ యందె, |
| ఆత్మ యందున్న పరమాత్మ నరయు చుంద్రు, |
| యత్నపరులయ్యు, వా రశు ద్ధాత్ము లగుట, |
| వాని దర్శింప జాలరు హీనమతులు. |
|
| |
|
| 12. |
| సూర్యునందెట్టి తేజము సోకియుండి, |
| జగము నంతయు భాసింప జాలి యుండు |
| ఏది చంద్రాగ్నులను జేరి యెసగు నట్లె, |
| తేజ మయ్యది నాదని తెలిసికొనుము. |
|
| |
|
| 13. |
| భూమి జొచ్చియు నే సర్వ భూతములను, |
| నెమ్మి ధరియింతు నోజో బ లమ్ము చేత, |
| రసమయుండైన చంద్రుని రశ్మి చేత, |
| పోషణము జేతు నేను స ర్వౌషధులను. |
|
| |
|
| 14. |
| నేనె జఠరాగ్నినైన వై శ్వానరుండ, |
| అఖిల ప్రాణుల దేహము లాశ్రయించి |
| ఉచితరీతి ప్రాణాపానయుక్తముగను |
| నాలుగువిధాన్నములను జీ ర్ణంబొనర్తు. |
|
| |
|
| 15. |
| సకలజీవుల నుందు హృత్థ్సానమందు, |
| నావలన గల్గు స్మృతియు జ్ఞా నమ్మపోహ, |
| వేదితవ్యుడ నే సర్వ వేదములను, |
| వేదకర్తను వేదాంత వేత్త నేను. |
|
| |
|
| 16. |
| పురుషులిర్వురు గల రిందు భువన మందు, |
| క్షరుడు, నక్షరుడను పేర్ల బఱగు వారు, |
| సర్వభూతస్వరూపుని క్షరుడనండ్రు, |
| నక్షరుం డండ్రు కూటస్థు డైన వాని. |
|
| |
|
| 17. |
| కాని యుత్తమపురుషుడు కలడు వేరె, |
| వాని బరమాత్మయని బుధు ల్పల్కుచుంద్రు, |
| అతడె ముల్లోకముల నెల్ల నావరించి, |
| అతడె పోషించు, నీశ్వరుం డవ్యయుండు. |
|
| |
|
| 18. |
| క్షరుని కన్నను మఱియు న క్షరుని కన్న, |
| నుత్తముండైన పురుషుగానొప్పు చుంట, |
| అఖిలలోకాలు, వేదము లన్ని నన్ను, |
| చెప్పు పురుషోత్తము డని బ్ర సిద్ధిగాను. |
|
| |
|
| 19. |
| ఎవ్వడీ రీతి మౌఢ్య వి హీను డగుచు, |
| అరయునో పురుషోత్తము డంచు నన్ను, |
| సర్వభావములను మన సార నన్నె, |
| భజన జేసి సర్వజ్ఞత బడయు నతడు. |
|
| |
|
| 20. |
| గుహ్యతమమైన శాస్త్రము గూర్చి యిట్లు, |
| తెలియ జెప్పితి ననఘ! వ త్సలత మెఱయ, |
| చక్కగా దీనిని గ్రహింప జాలు నెవ్వ, |
| డతడె జ్ఞానియై కృతకృత్యు డగును పార్థ! |
|
| |
|
|
| |
| 1. శ్రీభగవానువాచ: |
| ఊర్ధ్వమూలమధఃశాఖ |
| మశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
| ఛన్దాంసి యస్య పర్ణాని |
| యస్తం వేద స వేదవిత్ |
|
| |
|
| 2. |
| అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా |
| గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
| అధశ్చ మూలాన్యనుసంతతాని |
| కర్మానుబన్ధీని మనుష్యలోకే |
|
| |
|
| 3. |
| న రూపమస్యేహ తథోపలభ్యతే |
| నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
| అశ్వత్థమేనం సువిరూఢమూల |
| మసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా |
|
| |
|
| 4. |
| తతః పదం తత్పరిమార్గితవ్యం |
| యస్మిన్గతా న నివర్తన్తి భూయః |
| తమేవ చాద్యం పురుషం ప్రపద్యే |
| యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ |
|
| |
|
| 5. |
| నిర్మానమోహా జితసఙ్గదోషా |
| అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
| ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై |
| ర్గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్ |
Play This Verse |
| |
|
| 6. |
| న తద్భాసయతే సూర్యో |
| న శశాఙ్కో న పావకః |
| యద్గత్వా న నివర్తన్తే |
| తద్ధామ పరమం మమ |
Play This Verse |
| |
|
| 7. |
| మమైవాంశో జీవలోకే |
| జీవభూతః సనాతనః |
| మనఃషష్ఠానీన్ద్రియాణి |
| ప్రకృతిస్థాని కర్షతి |
|
| |
|
| 8. |
| శరీరం యదవాప్నోతి |
| యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
| గృహిత్వైతాని సంయాతి |
| వాయుర్గన్ధానివాశయాత్ |
|
| |
|
| 9. |
| శ్రోత్రం చక్షుః స్పర్శనం చ |
| రసనం ఘ్రాణమేవ చ |
| అధిష్ఠాయ మనశ్చాయం |
| విషయానుపసేవతే ౯ |
|
| |
|
| 10. |
| ఉత్క్రామన్తం స్థితం వాపి |
| భుఞ్జానం వా గుణాన్వితమ్ |
| విమూఢా నానుపశ్యన్తి |
| పశ్యన్తి జ్ఞానచక్షుషః ౦ |
|
| |
|
| 11. |
| యతన్తో యోగినశ్చైనం |
| పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |
| యతన్తోఽప్యకృతాత్మానో |
| నైనం పశ్యన్త్యచేతసః |
|
| |
|
| 12. |
| యదాదిత్యగతం తేజో |
| జగద్భాసయతేఽఖిలమ్ |
| యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ |
| తత్తేజో విద్ధి మామకమ్ |
|
| |
|
| 13. |
| గామావిశ్య చ భూతాని |
| ధారయామ్యహమోజసా |
| పుష్ణామి చౌషధీః సర్వాః |
| సోమో భూత్వా రసాత్మకః |
|
| |
|
| 14. |
| అహం వైశ్వానరో భూత్వా |
| ప్రాణినాం దేహమాశ్రితః |
| ప్రాణాపానసమాయుక్తః |
| పచామ్యన్నం చతుర్విధమ్ |
|
| |
|
| 15. |
| సర్వస్య చాహం హృది సంనివిష్టో |
| మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ |
| వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో |
| వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ |
|
| |
|
| 16. |
| ద్వావిమౌ పురుషౌ లోకే |
| క్షరశ్చాక్షర ఏవ చ |
| క్షరః సర్వాణి భూతాని |
| కూటస్థోఽక్షర ఉచ్యతే |
|
| |
|
| 17. |
| ఉత్తమః పురుషస్త్వన్యః |
| పరమాత్మేత్యుదాహృతః |
| యో లోకత్రయమావిశ్య |
| బిభర్త్యవ్యయ ఈశ్వరః |
|
| |
|
| 18. |
| యస్మాత్క్షరమతీతోఽహ |
| మక్షరాదపి చోత్తమః |
| అతోఽస్మి లోకే వేదే చ |
| ప్రథితః పురుషోత్తమః |
|
| |
|
| 19. |
| యో మామేవమసంమూఢో |
| జానాతి పురుషోత్తమమ్ |
| స సర్వవిద్భజతి మాం |
| సర్వభావేన భారత ౯ |
|
| |
|
| 20. |
| ఇతి గుహ్యతమం శాస్త్ర |
| మిదముక్తం మయానఘ |
| ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్స్యా |
| త్కృతకృత్యశ్చ భారత ౦ |
|
| |
|
|