| |
| 1. శ్రీ భగవానుడనెను: |
| జ్ఞానములయందు నుత్తమజ్ఞానమైన |
| పరమవిషయైకతత్త్వముమరల జెపుదు, |
| ఇట్టిజ్ఞానము మును లెల్లరెఱిగి యుండి, |
| పరమసంసిద్ధి బంధముబాసి కనిరి. |
|
| |
|
| 2. |
| ఇట్టి జ్ఞానము నెవరాశ్రయింపగలరొ, |
| వారు నాదు సాధర్మ్యరూపము వహింత్రు, |
| సృష్టికాలము నందు జన్మింప బోరు, |
| ప్రళయకాలము నందునువ్యథల బడరు. |
|
| |
|
| 3. |
| యోనిగా మహద్బ్రహ్మమునుంచి నేను, |
| సృష్టిబీజమ్ము నేనందుజేర్చియుంతు |
| సంభవంబగు నీ భూతసంఘ మెల్ల |
| నందు నుండియె యంచు నీవరయ వలయు. |
|
| |
|
| 4. |
| ఎల్ల యోనుల యందుననెట్టి వేని, |
| మూర్తదేహము లుద్భవమొందు నేని, |
| తగగ మూలప్రకృతి వానితల్లియగును, |
| తండ్రి నేనౌదు బీజప్రదాత నగుట. |
|
| |
|
| 5. |
| భువిని సత్త్వ రజ స్తమములను మూడు |
| ప్రభవ మొందును గుణములుప్రకృతి నుండి, |
| దేహి నవ్యయ గుణము లీదేహ మందు |
| పట్టి బంధించు సూ మహాబాహువీర! |
|
| |
|
| 6. |
| సత్త్వగుణ మిది, మూడిటస్వచ్ఛ మగుట |
| శాంతియుతమును మఱి కాంతిమంతమగును, |
| జ్ఞాన సుఖముల తోడి సంగమును గూర్చి, |
| బంధనము జేయు పురుషునిభరతవృషభ! |
|
| |
|
| 7. |
| రాగములపుట్ట సుమ్మీ రజోగుణంబు, |
| తృష్ణకా సంగమున కిదిహేతువగుచు, |
| కామ్యకర్తల నాసక్తిగలుగ జేసి, |
| దేహి నెంతయు పార్ఠ!బంధించు చుండు. |
|
| |
|
| 8. |
| తమము నజ్ఞాన మందు నుద్భవము నొంది |
| దేహధారుల నెల్ల సమ్మొహ పఱచి, |
| మఱపు నలసత నిద్రలమఱగ జేసి, |
| బంధనము జేయు లెస్సగాభరతవంశ్య! |
|
| |
|
| 9. |
| సంగరతి గొల్పు సుఖ మందుసత్త్వగుణము, |
| కామ్యకర్మల జేయింప గడగు రజము, |
| తెలియు మర్జునా!తమ మిదిదేహి నెపుడు, |
| మఱపు గొలుపును జ్ఞానముమాటుజేసి. |
|
| |
|
| 10. |
| తమము రజములనణచి సత్త్వంబు ప్రబలు, |
| ప్రబలు రజమట్లె తమము సత్త్వముల నణచి, |
| అణచి ప్రబలును రెంటినినట్లె తమము, |
| గుణము లొండొంటి నిట్లు లోగొనుచు నుండు. |
|
| |
|
| 11. |
| ఎప్పు డీదేహమందు సర్వేంద్రియముల |
| ద్వారముల నుండి జ్ఞాన దీపంబు వెలుగు, |
| అపుడె సత్త్వగుణము వృద్ధియైన దనుచు, |
| తెలిసికొనవలె నయ్య,కుంతీ కుమార! |
|
| |
|
| 12. |
| లొభితనమును, కర్మవిలొలతయును, |
| కామ్యకర్మల నాసక్తిగలుగుటయును, |
| ఇచ్చయును మఱియు నశాంతియెపుడు గలుగు |
| నపుడె తెలియుము రజము హెచ్చైన దనుచు. |
|
| |
|
| 13. |
| సోమరితనంబు, మఱి బుద్ధిశూన్యతయును, |
| మఱపు నొందుట, చిత్తముమఱులు గొంట, |
| యెపుడు బుట్టుచు నుండునోయపుడె పార్థ! |
| తమము హెచ్చిన దని నీవుతలప వలయు. |
|
| |
|
| 14. |
| ఎపుడు సత్త్వగుణంబు వివృధ్ధ మగునొ, |
| పురుషు డప్పుడ మరణముబొందు నేని, |
| ఉత్తమజ్ఞానులగువారలుండు నట్టి, |
| అమలలోకమ్ములకు నాతడరుగు పార్థ! |
|
| |
|
| 15. |
| రజము బ్రబలము గాగ మరణము గలుగ, |
| కర్మసంగుల జన్మముగలుగు చుండు, |
| తమము హెచ్చిన స్థితియందుతనువు వీడ, |
| మూఢయోనుల జన్మముపొందు చుండు. |
|
| |
|
| 16. |
| సత్త్వగుణజాతకర్మసంచయమునకును |
| నిర్మలజ్ఞాన సుఖములేనియతఫలము, |
| రజసిక కర్మలకు దఃఖరసఫలంబు, |
| కాని,యజ్ఞానమే తమఃకర్మఫలము. |
|
| |
|
| 17. |
| సాత్వికమ్మున జ్ఞానము సంభవించు, |
| రాజసమ్మున లోభమేప్రభవ మొందు, |
| తామస గుణమ్ముచేతనుతఱుగ నట్టి, |
| భ్రాంతి యజ్ఞానములును, బరాకు గలుగు. |
|
| |
|
| 18. |
| సాత్త్వికులు నూర్ధ్వగతులకుజనుచు నుంద్రు, |
| మధ్యగతులందు రాజసుల్మసలుచుంద్రు, |
| నీచగుణవృత్తులందుననెలవు గొంట, |
| నధమ గతులకు తామసులరుగుచుంద్రు. |
|
| |
|
| 19. |
| ఎప్పు డీ గుణముల కన్ననితర మైన |
| కర్త లేడని దర్శింపగలడొ ద్రష్ట, |
| తెలిసికొను నెపుడు త్రిగుణాతీతపురుషు, |
| నపుడె నాస్వరూపమ్ము వాడందు కొనును, |
|
| |
|
| 20. |
| త్రిగుణముల నుండి పుట్టు నీదేహ మంచు |
| తెలిసి వానికి దేహి యతీతు డగుచు, |
| జన్మ మృత్యు జరా దుఃఖచయమునుండి, |
| ముక్తుడై యమృతత్వముబొందు వాడు. |
|
| |
|
| 21. అర్జునుడనెను: |
| గుణము లీమూటి నెట్టి లక్షణము లున్న |
| నధిగమించినవాడగునతడు ప్రభువ! |
| ఎట్టి యాచార, మెట్టి ప్రవృత్తియున్న, |
| త్రిగుణవృత్తుల కాత డతీతు డగును. |
|
| |
|
| 22. శ్రీ భగవానుడనెను: |
| సాత్త్వికప్రకాశము రాజస ప్రవృత్తి, |
| తామసికమైన మోహముతగగ నెవ్వ |
| డేది సంప్రాప్తమైన ద్వేషింప బోడొ, |
| కలుగ కున్నను దానికైకాంక్ష నిడడొ; |
|
| |
|
| 23. |
| ఎవ డుదాసీను భంగి వీక్షించు చుండి, |
| ఎట్టి గుణములచేత చలింప బడడొ, |
| వాని పను లందె గుణములువర్తిలునని, |
| ఎంచి స్థిరచిత్తుడై చలియింప బోడొ; |
|
| |
|
| 24. |
| స్వస్థచిత్తుడు, సుఖదఃఖసము డెవండొ, |
| స్వర్ణ లోష్టాశ్మముల యందుసము డెవండొ, |
| స్తుతులనిందలయందునతుల్యు డెవడొ, |
| ధీరుడునుప్రియా ప్రియ సమధికు డెవడొ; |
|
| |
|
| 25. |
| మానమందున, మఱి యవమానమందు, |
| శత్రుమిత్రుల యెడ, సమస్వాంతు డెవడొ, |
| సర్వకర్మల త్యజియించుజ్ఞాని యెవడొ, |
| అట్టివాని గుణాతీతుడండ్రు పార్ఠ! |
|
| |
|
| 26. |
| అనవరతము నన్నెవ్వ డనన్యమైన, |
| భక్తియోగముచేత సేవలను సలుపు, |
| త్రిగుణములు వీని కెవ్వ డతీతు డగునొ, |
| బ్రహ్మసారూప్యతార్హతబడయు నతడు. |
|
| |
|
| 27. |
| అవ్యయపదంబునకు, మోక్షమమృతమునకు, |
| శాశ్వతంబైన ధర్మసంస్థానమునకు, |
| జ్ఞానమునకు, నేకాంతికసౌఖ్యమునకు, |
| స్థానమైన బ్రహ్మమున కాధార మేను. |
|
| |
|
|
| |
| 1. శ్రీభగవానువాచ: |
| పరం భూయః ప్రవక్ష్యామి |
| జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
| యజ్జ్ఞాత్వా మునయః |
| సర్వే పరాం సిద్ధిమితో గతాః |
|
| |
|
| 2. |
| ఇదం జ్ఞానముపాశ్రిత్య |
| మమ సాధర్మ్యమాగతాః |
| సర్గేఽపి నోపజాయన్తే |
| ప్రలయే న వ్యథన్తి చ |
|
| |
|
| 3. |
| మమ యోనిర్మహద్బ్రహ్మ |
| తస్మిన్గర్భం దధామ్యహమ్ |
| సంభవః సర్వభూతానాం |
| తతో భవతి భారత |
|
| |
|
| 4. |
| సర్వయోనిషు కౌన్తేయ |
| మూర్తయః సంభవన్తి యాః |
| తాసాం బ్రహ్మ మహద్యోని |
| రహం బీజప్రదః పితా |
|
| |
|
| 5. |
| సత్త్వం రజస్తమ ఇతి |
| గుణాః ప్రకృతిసంభవాః |
| నిబధ్నన్తి మహాబాహో |
| దేహే దేహినమవ్యయమ్ |
|
| |
|
| 6. |
| తత్ర సత్త్వం నిర్మలత్వా |
| త్ప్రకాశకమనామయమ్ |
| సుఖసఙ్గేన బధ్నాతి |
| జ్ఞానసఙ్గేన చానఘ |
|
| |
|
| 7. |
| రజో రాగాత్మకం విద్ధి |
| తృష్ణాసఙ్గసముద్భవమ్ |
| తన్నిబధ్నాతి కౌన్తేయ |
| కర్మసఙ్గేన దేహినమ్ |
|
| |
|
| 8. |
| తమస్త్వజ్ఞానజం విద్ధి |
| మోహనం సర్వదేహినామ్ |
| ప్రమాదాలస్యనిద్రాభి |
| స్తన్నిబధ్నాతి భారత |
|
| |
|
| 9. |
| సత్త్వం సుఖే సంజయతి |
| రజః కర్మణి భారత |
| జ్ఞానమావృత్య తు తమః |
| ప్రమాదే సంజయత్యుత ౯ |
|
| |
|
| 10. |
| రజస్తమశ్చాభిభూయ |
| సత్త్వం భవతి భారత |
| రజః సత్త్వం తమశ్చైవ |
| తమః సత్త్వం రజస్తథా ౦ |
|
| |
|
| 11. |
| సర్వద్వారేషు దేహేఽస్మి |
| న్ప్రకాశ ఉపజాయతే |
| జ్ఞానం యదా తదా విద్యా |
| ద్వివృద్ధం సత్త్వమిత్యుత |
|
| |
|
| 12. |
| లోభః ప్రవృత్తిరారమ్భః |
| కర్మణామశమః స్పృహా |
| రజస్యేతాని జాయన్తే |
| వివృద్ధే భరతర్షభ |
|
| |
|
| 13. |
| అప్రకాశోఽప్రవృత్తిశ్చ |
| ప్రమాదో మోహ ఏవ చ |
| తమస్యేతాని జాయన్తే |
| వివృద్ధే కురునన్దన |
|
| |
|
| 14. |
| యదా సత్త్వే ప్రవృద్ధే తు |
| ప్రలయం యాతి దేహభృత్ |
| తదోత్తమవిదాం లోకా |
| నమలాన్ప్రతిపద్యతే |
|
| |
|
| 15. |
| రజసి ప్రలయం గత్వా |
| కర్మసఙ్గిషు జాయతే |
| తథా ప్రలీనస్తమసి |
| మూఢయోనిషు జాయతే |
|
| |
|
| 16. |
| కర్మణః సుకృతస్యాహుః |
| సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
| రజసస్తు ఫలం దుఃఖ |
| మజ్ఞానం తమసః ఫలమ్ |
|
| |
|
| 17. |
| సత్త్వాత్సంజాయతే జ్ఞానం |
| రజసో లోభ ఏవ చ |
| ప్రమాదమోహౌ తమసో |
| భవతోఽజ్ఞానమేవ చ |
|
| |
|
| 18. |
| ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా |
| మధ్యే తిష్ఠన్తి రాజసాః |
| జఘన్యగుణవృత్తిస్థా |
| అధో గచ్ఛన్తి తామసాః |
|
| |
|
| 19. |
| నాన్యం గుణేభ్యః కర్తారం |
| యదా ద్రష్టానుపశ్యతి |
| గుణేభ్యశ్చ పరం వేత్తి |
| మద్భావం సోఽధిగచ్ఛతి ౯ |
|
| |
|
| 20. |
| గుణానేతానతీత్య త్రీ |
| న్దేహీ దేహసముద్భవాన్ |
| జన్మమృత్యుజరాదుఃఖై |
| ర్విముక్తోఽమృతమశ్నుతే ౦ |
|
| |
|
| 21. అర్జున ఉవాచ: |
| కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతా |
| నతీతో భవతి ప్రభో |
| కిమాచారః కథం చైతాం |
| స్త్రీన్గుణానతివర్తతే |
|
| |
|
| 22. శ్రీభగవానువాచ: |
| ప్రకాశం చ ప్రవృత్తిం చ |
| మోహమేవ చ పాణ్డవ |
| న ద్వేష్టి సంప్రవృత్తాని |
| న నివృత్తాని కాఙ్క్షతి |
|
| |
|
| 23. |
| ఉదాసీనవదాసీనో |
| గుణైర్యో న విచాల్యతే |
| గుణా వర్తన్త ఇత్యేవ |
| యోఽవతిష్ఠతి నేఙ్గతే |
|
| |
|
| 24. |
| సమదుఃఖసుఖః స్వస్థః |
| సమలోష్టాశ్మకాఞ్చనః |
| తుల్యప్రియాప్రియో ధీర |
| స్తుల్యనిన్దాత్మసంస్తుతిః |
|
| |
|
| 25. |
| మానాపమానయోస్తుల్య |
| స్తుల్యో మిత్రారిపక్షయోః |
| సర్వారమ్భపరిత్యాగీ |
| గుణాతీతః స ఉచ్యతే |
|
| |
|
| 26. |
| మాం చ యోఽవ్యభిచారేణ |
| భక్తియోగేన సేవతే |
| స గుణాన్సమతీత్యైతా |
| న్బ్రహ్మభూయాయ కల్పతే |
|
| |
|
| 27. |
| బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ |
| మమృతస్యావ్యయస్య చ |
| శాశ్వతస్య చ ధర్మస్య |
| సుఖస్యైకాన్తికస్య చ |
|
| |
|
|