| |
| 1. |
| ప్రకృతి యన నేది, పురుషుడె వ్వాడతండు, |
| ఏది క్షేత్రము, క్షేత్రజ్ఞు డె వ్వడతడు, |
| జ్ఞాన మన నేది, జ్ఞేయ మ నంగ నేది, |
| తెలుప గోరెద వీనిని దేవ! మిమ్ము. |
Play This Verse |
| |
|
| 2. |
| సర్వ కర్మలు సలుపంగ స్థాన మైన, |
| యీ శరీరమె క్షేత్రమం చెఱుగు మీవు, |
| ఎవడు క్షేత్రమ్ము బూర్తిగా నెరుగ గలడొ, |
| తత్త్వవేత్తలు వాని, క్షే త్రజ్ఞు డండ్రు. |
Play This Verse |
| |
|
| 3. |
| అన్ని క్షేత్రములందు చె ల్వమరగాను, |
| వెలయు క్షేత్రజ్ఞునిగ నన్ను దెలిసి కొనుము, |
| ఏది క్షేత్రమున్, క్షేత్రజ్ఞు నెఱుగ జేయు, |
| నట్టిదే యదార్ధ జ్ఞాన మందు నేను. |
|
| |
|
| 4. |
| క్షేత్ర మది యేదొ, యెట్టి వి శేషములదొ, |
| కలుగు నెందుండియో, యే వి కారములదొ, |
| ఎట్టి మహితుడొ, క్షేత్రజ్ఞు డెట్టి వాడొ, |
| చెప్పెదను విను వాని సం క్షేపముగను. |
|
| |
|
| 5. |
| ఋషులు కీర్తించి, రవ్వాని నెన్నొ గతుల, |
| వేదములు నిర్ణయించె వే ర్వేరుగాను, |
| బ్రహ్మసూత్రాల, నుపనిష ద్వాక్యములను, |
| హేతుబద్ధముగ వినిశ్చ యింప బడియె. |
|
| |
|
| 6. |
| ఐదు సూక్ష్మ భూతమ్ముల వ్యక్తమైన, |
| మూలప్రకృతి, యహంకృతి బుద్ధి, మనసు, |
| జ్ఞాన కర్మేంద్రియమ్ములు గలసి పదియు, |
| ఐంద్రియకమైన విషయమ్ము లైదు గలవు. |
|
| |
|
| 7. |
| సుఖము, దుఃఖము, నిచ్ఛ న సూయ తోడ, |
| దనరు దేహేంద్రియములు చే తనము, ధృతియు, |
| ఈ వికారాన్విత శరీర మేది కలదొ, |
| క్షేత్రమందురు దాని సం క్షేపముగను. |
|
| |
|
| 8. |
| స్వాభి మానమువీడి, దం భమును బాసి, |
| క్షాంతియు నహింస దాల్చి యార్జవము గూడి, |
| సద్గురూపాసనయును, శౌ చమును గలిగి, |
| ఆత్మ నాయత్తపఱచి, స్థై ర్యము వహించి; |
Play This Verse |
| |
|
| 9. |
| ఇంద్రియార్థము లందెట్టి యిచ్చ నిడక, |
| మనసులో నహంకారము మసల నీక, |
| జన్మ మృత్యువులను మఱి జరయు, వ్యాధి |
| దుఃఖముల గల్గు చుండెడి దోష మరసి; |
Play This Verse |
| |
|
| 10. |
| ఆలు బిడ్డల యందు, గృ హాదు లందు, |
| నాది నావారను నభిమా నమును వదలి, |
| నిత్య మన్నిట సమచిత్త నిరతి మెలగి, |
| ప్రియము నప్రియ మందొకే దృష్టి నెఱపి; |
Play This Verse |
| |
|
| 11. |
| అన్య మెఱుగని నాయోగ మభ్యసించి, |
| వ్యభిచరింపని యేకాంత భక్తి నెఱపి, |
| నిర్జనస్థానమందేక నిష్ఠ నిలిచి, |
| జనసమూహము జేరనా సక్తి విడచి; |
Play This Verse |
| |
|
| 12. |
| అనవరతమాత్మ రూపము నరయు చుంట, |
| తత్త్వవిజ్ఞానదృష్టిని తవిలి యుంట, |
| జ్ఞాన మని చెప్పుచుందురు జ్ఞాన ధనులు, |
| అన్య సాధన మజ్ఞాన మగును పార్థ! |
Play This Verse |
| |
|
| 13. |
| ఏది తెలియగ పురుషుం డ మృతము బొందు, |
| ఆది రహిత పరబ్రహ్మ మైన దేదొ, |
| దేని నందురొ సదసత్తు కాని దనుచు, |
| జ్ఞేయ మేదియొ దాని నే జెపుదు వినుము. |
|
| |
|
| 14. |
| అంతటను కాలు సేతులు నంత కనులు, |
| తలలు, ముఖములు, చెవులు, నం తటను గల్గి, |
| జ్ఞేయమైనట్టి యాబ్రహ్మ చెలగి దెసల, |
| నంతటను నిండి యీలోక మావరించె. |
|
| |
|
| 15. |
| ఇంద్రియంబుల నెల్ల భా సింప జేయు, |
| కాని, లేదొక్క యింద్రియ మైన దనకు, |
| సంగమే లేక పోషించు సర్వజగతి, |
| గుణములే లేక, భోగించు గుణములన్ని. |
|
| |
|
| 16. |
| సకల భూత చరాచర సంఘమందు, |
| వెలుపలను లోన నీ బ్రహ్మ వెలుగు చుండు, |
| చూడ లే మది సూక్ష్మాతి సూక్ష్మమగుట, |
| జ్ఞాని దరినుండు, దౌల న జ్ఞాని కుండు. |
|
| |
|
| 17. |
| అట్టి యీ బ్రహ్మ మవిభక్త మైనదయ్యు, |
| భూతముల భిన్నమైనట్లు పొల్చు చుండు, |
| భూతముల ప్రోచి, పొలియించి పుట్ట జేయు, |
| నట్టి బ్రహ్మమె జ్ఞేయమం చరయు మీవు. |
|
| |
|
| 18. |
| సూర్య చంద్రుల వెలుగులో జ్యోతి యదియె, |
| అంధకారమునకు బర మైన దదియె, |
| జ్ఞానమును, జ్ఞేయమును, జ్ఞాన గమ్య మదియె |
| ఎల్లప్రాణుల హృది న ధిష్టించు నదియె. |
|
| |
|
| 19. |
| క్షేత్రమును, జ్ఞానమును, మఱి జ్ఞేయ మిట్లు |
| చెప్పితిని పార్థ! నీకు సం క్షేపముగను, |
| దీని నిట్లు నాభక్తుడు తెలిసి కొనిన, |
| అర్హుడగు వాడు నాభావ మందు కొనగ. |
|
| |
|
| 20. |
| పూరుషుండును, ప్రకృతి, యి ర్వురును గూడ, |
| ఆదిరహితు లటంచు నీ వరయ వలయు |
| ఇంద్రియ వికారగుణములునెల్ల పార్థ! |
| ప్రభవ మొందును తెలియుము ప్రకృతి నుండె. |
|
| |
|
| 21. |
| కార్య కారణముల నెల్ల కలుగ జేయ, |
| ప్రకృతియే కారణంబని పల్కు చుంద్రు, |
| ఎపుడు సుఖదుఃఖము లనుభ వించుటకును, |
| పురుషుడే హేతువంచు చెప్పుదురు బుధులు. |
|
| |
|
| 22. |
| పురుషు డెప్పుడు ప్రకృతిని పొందియుంట |
| నతడు ప్రకృతిజన్యగుణమ్ము లనుభవించు, |
| ఆ గుణములందె యాసక్తి యమరి యుంట |
| మంచి చెడు యోనులందు జ న్మించు చుండు. |
|
| |
|
| 23. |
| ఈ శరీరము నందు వ సించు వాడు, |
| పరుడు, పురుషుం, డుపద్రష్ట, భర్త, భోక్త, |
| వాడె యనుమోదకుడు, మహే శ్వరు డతండె, |
| వాడె పరమాత్మ యని కూడ పల్క బడును. |
|
| |
|
| 24. |
| ఎవడు గుణసహితముగ ప్ర కృతిని మఱియు |
| పురుషు నీరీతి నెఱుగు సం పూర్ణముగను, |
| ఎవ్విధంబుల వాడు వ ర్తించి యైన |
| పొంద డాతండు జన్మమీ భువిని మరల. |
|
| |
|
| 25. |
| ధ్యానయోగమ్ముచే కొంద ఱాత్మయందె, |
| ఆత్మచేతనె పరమాత్మ నరయుచుంద్రు, |
| సాంఖ్యయోగము కొందఱు సలిపి కాంత్రు, |
| కాంతు రితరులు నిష్కామ కర్మ సలిపి. |
Play This Verse |
| |
|
| 26. |
| అన్యు లీగతి పరమాత్మ నరయ లేక, |
| సలుపుదు రుపాసన ముపదే శాను సరణి, |
| అట్లు శ్రుతిపరాయణభక్తు లైన కూడ, |
| మృత్యుసంసారజలధి త రించు చుంద్రు. |
|
| |
|
| 27. |
| స్థావరము జంగమంబైన సత్త్వ మొకటి, |
| కొంచె మేదైన భువి నుద్భవించు నేని, |
| ప్రకృతి పురుష సం యోగ కా రణము చేత, |
| కలిగె నది యని తెలియగా వలయు పార్థ! |
Play This Verse |
| |
|
| 28. |
| సర్వభూతము లందున సముడు గాను, |
| నాశవస్తువులందవి నాశి గాను, |
| వెలయు పరమాత్మనెవ్వడు తెలిసి కొనునొ, |
| ఆతడే యాత్మతత్త్వయా థార్థ్యమెఱుగు. |
|
| |
|
| 29. |
| వాని బరమాత్మ, నీశు, సర్వత్రసముని, |
| వాసుదేవుని దర్శించు వా డెవండు, |
| తన్ను తానెట్లు హింసింప తలపు గొనును, |
| కాన నుత్తమగతి పొంద గలుగు వాడు. |
|
| |
|
| 30. |
| త్రికరణములైన కర్మల దెలియ నెవడు, |
| సర్వవిధముల బ్రకృతియే సలుపు నంచు, |
| అట్లె, చూచు నకర్తగా నాత్మ నెవ్వ |
| డట్టి వాడె సమ్యగ్దర్సి యైన వాడు. |
|
| |
|
| 31. |
| ఎపుడు వివిధ భూతమ్ముల నెల్ల నెవ్వ |
| డాత్మ యొకదాని యందెయు న్నట్లు జూచు, |
| దాని యందుండె విస్తార మైన దనుచు, |
| నరయు నప్పుడె బ్రహ్మమై యలరు నతడు. |
|
| |
|
| 32. |
| ఆదిరహితుడు, నిర్గుణుం డగుట జేసి, |
| అవ్యయుండైన యీపర మాత్మ పార్థ! |
| ఈ శరీరములో వసి యించి కూడ, |
| కర్మలిప్తుడు కాడు త త్కర్త గాడు. |
|
| |
|
| 33. |
| ఆకసంబెట్లు నంతట వ్యాప్త మయ్యు |
| నంటు బడకుండు నతిసూక్ష్మ మగుట జేసి, |
| ఎల్ల దేహములన్ వసి యించు నట్టి, |
| ఆత్మ యట్టులె గుణముల కంటు వడదు. |
Play This Verse |
| |
|
| 34. |
| లోకముల వీని నెల్ల ది వాకరుండు, |
| ఎట్టు లొక్కరుడే బ్రకా శింప జేయు, |
| ఎల్ల క్షేత్రము లట్లె క్షే త్రీశ్వరుండు, |
| దీప్తిమంతము జేయు కుం తీకుమార! |
|
| |
|
| 35. |
| ఇట్లు క్షేత్రము క్షేత్రజ్ఞు లిర్వురి యెడ, |
| నంతరము జ్ఞానచక్షుల గాంతు రెవరొ, |
| అట్లె భూతప్రకృతి మోక్ష మరయ గలరొ, |
| పరమపదమును వారలే పడయ గలరు. |
|
| |
|
|
| |
| 1. |
| ప్రకృతిం పురుషం చైవ |
| క్షేత్రం క్షేత్రజ్ఙం ఏవచ |
| ఏతద్ వేదితమిఛ్ఛామి |
| జ్ఞానం జ్ఞేయం చ కేశవ |
Play This Verse |
| |
|
| 2. |
| ఇదం శరీరం కౌన్తేయ |
| క్షేత్రమిత్యభిధీయతే |
| ఏతద్యో వేత్తి తం ప్రాహుః |
| క్షేత్రజ్ఞ ఇతి తద్విదః |
Play This Verse |
| |
|
| 3. |
| క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి |
| సర్వక్షేత్రేషు భారత |
| క్షేత్రక్షేత్రజ్ఞయోర్జ్ఞానం |
| యత్తజ్జ్ఞానం మతం మమ |
|
| |
|
| 4. |
| తత్క్షేత్రం యచ్చ యాదృక్చ |
| యద్వికారి యతశ్చ యత్ |
| స చ యో యత్ప్రభావశ్చ |
| తత్సమాసేన మే శృణు |
|
| |
|
| 5. |
| ఋషిభిర్బహుధా గీతం |
| ఛన్దోభిర్వివిధైః పృథక్ |
| బ్రహ్మసూత్రపదైశ్చైవ |
| హేతుమద్భిర్వినిశ్చితైః |
|
| |
|
| 6. |
| మహాభూతాన్యహంకారో |
| బుద్ధిరవ్యక్తమేవ చ |
| ఇన్ద్రియాణి దశైకం చ |
| పఞ్చ చేన్ద్రియగోచరాః |
|
| |
|
| 7. |
| ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం |
| సంఘాతశ్చేతనా ధృతిః |
| ఏతత్క్షేత్రం సమాసేన |
| సవికారముదాహృతమ్ |
|
| |
|
| 8. |
| అమానిత్వమదమ్భిత్వ |
| మహింసా క్షాన్తిరార్జవమ్ |
| ఆచార్యోపాసనం శౌచం |
| స్థైర్యమాత్మవినిగ్రహః |
Play This Verse |
| |
|
| 9. |
| ఇన్ద్రియార్థేషు వైరాగ్య |
| మనహంకార ఏవ చ |
| జన్మమృత్యుజరావ్యాధి |
| దుఃఖదోషానుదర్శనమ్ |
Play This Verse |
| |
|
| 10. |
| అసక్తిరనభిష్వఙ్గః |
| పుత్రదారగృహాదిషు |
| నిత్యం చ సమచిత్తత్వ |
| మిష్టానిష్టోపపత్తిషు ౯ |
Play This Verse |
| |
|
| 11. |
| మయి చానన్యయోగేన |
| భక్తిరవ్యభిచారిణీ |
| వివిక్తదేశసేవిత్వ |
| మరతిర్జనసంసది ౦ |
Play This Verse |
| |
|
| 12. |
| అధ్యాత్మజ్ఞాననిత్యత్వం |
| తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
| ఏతజ్జ్ఞానమితి ప్రోక్త |
| మజ్ఞానం యదతోఽన్యథా |
Play This Verse |
| |
|
| 13. |
| జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి |
| యజ్జ్ఞాత్వామృతమశ్నుతే |
| అనాది మత్పరం బ్రహ్మ |
| న సత్తన్నాసదుచ్యతే |
|
| |
|
| 14. |
| సర్వతః పాణిపాదం త |
| త్సర్వతోఽక్షిశిరోముఖమ్ |
| సర్వతః శ్రుతిమల్లోకే |
| సర్వమావృత్య తిష్ఠతి |
|
| |
|
| 15. |
| సర్వేన్ద్రియగుణాభాసం |
| సర్వేన్ద్రియవివర్జితమ్ |
| అసక్తం సర్వభృచ్చైవ |
| నిర్గుణం గుణభోక్తృ చ |
|
| |
|
| 16. |
| బహిరన్తశ్చ భూతానా |
| మచరం చరమేవ చ |
| సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం |
| దూరస్థం చాన్తికే చ తత్ |
|
| |
|
| 17. |
| అవిభక్తం చ భూతేషు |
| విభక్తమివ చ స్థితమ్ |
| భూతభర్తృ చ తజ్జ్ఞేయం |
| గ్రసిష్ణు ప్రభవిష్ణు చ |
|
| |
|
| 18. |
| జ్యోతిషామపి తజ్జ్యోతి |
| స్తమసః పరముచ్యతే |
| జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం |
| హృది సర్వస్య విష్ఠితమ్ |
|
| |
|
| 19. |
| ఇతి క్షేత్రం తథా జ్ఞానం |
| జ్ఞేయం చోక్తం సమాసతః |
| మద్భక్త ఏతద్విజ్ఞాయ |
| మద్భావాయోపపద్యతే |
|
| |
|
| 20. |
| ప్రకృతిం పురుషం చైవ |
| విద్ధ్యనాదీ ఉభావపి |
| వికారాంశ్చ గుణాంశ్చైవ |
| విద్ధి ప్రకృతిసంభవాన్ ౯ |
|
| |
|
| 21. |
| కార్యకరణకర్తృత్వే |
| హేతుః ప్రకృతిరుచ్యతే |
| పురుషః సుఖదుఃఖానాం |
| భోక్తృత్వే హేతురుచ్యతే ౦ |
|
| |
|
| 22. |
| పురుషః ప్రకృతిస్థో హి |
| భుఙ్‌క్తే ప్రకృతిజాన్గుణాన్ |
| కారణం గుణసఙ్గోఽస్య |
| సదసద్యోనిజన్మసు |
|
| |
|
| 23. |
| ఉపద్రష్టానుమన్తా చ |
| భర్తా భోక్తా మహేశ్వరః |
| పరమాత్మేతి చాప్యుక్తో |
| దేహేఽస్మిన్పురుషః పరః |
|
| |
|
| 24. |
| య ఏవం వేత్తి పురుషం |
| ప్రకృతిం చ గుణైః సహ |
| సర్వథా వర్తమానోఽపి |
| న స భూయోఽభిజాయతే |
|
| |
|
| 25. |
| ధ్యానేనాత్మని పశ్యన్తి |
| కేచిదాత్మానమాత్మనా |
| అన్యే సాంఖ్యేన యోగేన |
| కర్మయోగేన చాపరే |
Play This Verse |
| |
|
| 26. |
| అన్యే త్వేవమజానన్తః |
| శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
| తేఽపి చాతితరన్త్యేవ |
| మృత్యుం శ్రుతిపరాయణాః |
|
| |
|
| 27. |
| యావత్సంజాయతే కించి |
| త్సత్త్వం స్థావరజఙ్గమమ్ |
| క్షేత్రక్షేత్రజ్ఞసంయోగా |
| త్తద్విద్ధి భరతర్షభ |
Play This Verse |
| |
|
| 28. |
| సమం సర్వేషు భూతేషు |
| తిష్ఠన్తం పరమేశ్వరమ్ |
| వినశ్యత్స్వవినశ్యన్తం |
| యఃపశ్యతి స పశ్యతి |
|
| |
|
| 29. |
| సమం పశ్యన్హి సర్వత్ర |
| సమవస్థితమీశ్వరమ్ |
| న హినస్త్యాత్మనాత్మానం |
| తతో యాతి పరాం గతిమ్ |
|
| |
|
| 30. |
| ప్రకృత్యైవ చ కర్మాణి |
| క్రియమాణాని సర్వశః |
| యః పశ్యతి తథాత్మా |
| నమకర్తారం స పశ్యతి ౯ |
|
| |
|
| 31. |
| యదా భూతపృథగ్భావ |
| మేకస్థమనుపశ్యతి |
| తత ఏవ చ విస్తారం |
| బ్రహ్మ సంపద్యతే తదా ౦ |
|
| |
|
| 32. |
| అనాదిత్వాన్నిర్గుణత్వా |
| త్పరమాత్మాయమవ్యయః |
| శరీరస్థోఽపి కౌన్తేయ |
| న కరోతి న లిప్యతే |
|
| |
|
| 33. |
| యథా సర్వగతం సౌక్ష్మ్యా |
| దాకాశం నోపలిప్యతే |
| సర్వత్రావస్థితో దేహే |
| తథాత్మా నోపలిప్యతే |
Play This Verse |
| |
|
| 34. |
| యథా ప్రకాశయత్యేకః |
| కృత్స్నం లోకమిమం రవిః |
| క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం |
| ప్రకాశయతి భారత |
|
| |
|
| 35. |
| క్షేత్రక్షేత్రజ్ఞయోరేవ |
| మన్తరం జ్ఞానచక్షుషా |
| భూతప్రకృతిమోక్షం చ |
| యే విదుర్యాన్తి తే పరమ్ |
|
| |
|
|