| |
| 1. |
| సతము నిన్నిట్లు నిష్ఠతోసగుణునిగను, |
| నిన్నె యవ్యక్తు నక్షరునిర్గుణునిగ, |
| పర్యుపాసించు భక్తులెవ్వారుగలరొ, |
| యోగ విత్తము లెవ్వరాయుభయులందు. |
|
| |
|
| 2. |
| మదిని నను జేర్చి నాలో నిమగ్నులగుచు |
| నిత్యయుక్తిని నన్నే కనిష్ఠ నెవరు, |
| శ్రద్ధ మీఱ నుపాసనసల్పుచుంద్రొ, |
| యోగితములని వారి నేనొప్పుకొందు. |
|
| |
|
| 3. |
| కాని యెవ్వ రవ్యక్తు, నక్క్షరు, నచింత్యు, |
| నప్రమేయుని, కూటస్ఠు,నచలు,ధ్రువుని, |
| నిర్గుణబ్రహ్మ మంతయునిండియున్న |
| వాని బూజింతురో నిష్ఠబూని యుండి; |
|
| |
|
| 4. |
| ఇంద్రియ సమూహమును, నిగ్రహించియుంచి, |
| యెల్ల యెడలను సమ బుద్ధినెసగు చుండి, |
| సర్వభూతహితము మనసార నెంచు, |
| వారలును గూడ నను బొందువారె పార్ధ! |
|
| |
|
| 5. |
| నిర్గుణోపాసనా సక్తినియమ రతులు, |
| నధిక తర మగు శ్రమములననుభవింత్రు, |
| కష్టకరమైన దవ్యక్తగతిని జేర, |
| మనుజు లెల్లరు దేహాభిమాను లగుట. |
|
| |
|
| 6. |
| కాని యెవ్వరేనియు సర్వ కర్మములను, |
| నాకె యర్పించి పరముగానన్నె యెంచి, |
| కడగి కేవల భక్తి యోగంబుచేత, |
| నన్నుపాసించి నన్నె ధ్యానమ్మొ నర్చి; |
|
| |
|
| 7. |
| చిత్ద్తమున నన్నె యెవ్వరుజేర్చి యుంత్రొ, |
| క్రీడి!వారల నే నుద్ధరించు చుందు, |
| ప్రబల మృత్యు సంసార వారాశి నుండి, |
| శీఘ్రకాలమె దరికి నేజేర వేసి. |
|
| |
|
| 8. |
| మనసు నాయందె పెనవేసికొనగ నిమ్ము, |
| బుద్ధి నాయందె తిరముగాబూన నిమ్ము, |
| ముందు నాయందె నివసించియుందు వీవు, |
| లేదు సందియ మిందునలేశ మైన. |
|
| |
|
| 9. |
| చిత్త మట్టుల నాయందుస్థిరముగాను, |
| నిలుప శక్యము గాదేనినీకు పార్థ! |
| సతత మభ్యాసయోగ మాచరణ బూని, |
| నన్నె పొందగ గోరి యత్నమును సలుపు. |
|
| |
|
| 10. |
| అభ్యసింప నశక్తుడవైన నింక, |
| పరగ మత్కర్మలందు తత్పరుడ వగుము, |
| కర్మముల నట్లు నా కొఱకై యొనర్ప, |
| పొందవచ్చును సంసిద్ధిపొలుపు మీఱ. |
|
| |
|
| 11. |
| ఇంక నిది కూడ శక్తి లే దేని జేయ, |
| శరణుగొని నన్ను కర్మలసలుపు మీవు, |
| సర్వకర్మఫలంబులసంత్యజించి, |
| సంయతాత్ముండవై యుండుసతత మట్లు. |
|
| |
|
| 12. |
| జ్ఞాన మభ్యాస యోగము కన్న మేలు, |
| జ్ఞానమున కన్న శ్రేష్ఠముధ్యాన మగును, |
| కర్మఫలవిసర్జన దానికన్న మేలు, |
| శాంతి శీఘ్రమె కలుగు, త్యాగాంత మందు. |
|
| |
|
| 13. |
| సర్వ భూతము లందు ద్వేషమును లేక, |
| దయయు మైత్రియు లోన దాదలచు వాడు, |
| నేను నాదను భావములేని వాడు, |
| కష్టసుఖముల సముడునుక్షాంతి యుతుడు. |
|
| |
|
| 14. |
| సతత సంతుష్టుడును, యోగిసత్తముండు, |
| సంయతాత్ముడు, సంఛిన్నసంశయుండు, |
| మనసు బుద్ధిని నాయందెయునుచు వాడు, |
| అట్టి భక్తు డెవండొ, నాకతడె ప్రియుడు. |
|
| |
|
| 15. |
| లోక మెవ్వని జూచియులుగ్గ డిలదొ, |
| లోకము నెవండు జూచియులుగ్గడిలడొ, |
| హర్ష మీర్ష్య భయప్రవాహముల నుండి, |
| ముక్తు డెవ్వడొ, నా ప్రియభక్తు డతడె. |
Play This Verse |
| |
|
| 16. |
| దక్షుడును, శుచి యెవ డనపేక్షకుండొ, |
| వీతభయుడును, నిష్పక్షపాతి యెవడొ, |
| కామ్యకర్మములను జేయకడగ డెవడొ, |
| అట్టి నాభక్తు డే ప్రియుడగును నాకు. |
|
| |
|
| 17. |
| ద్వేష మొందడొ, యెవడు సంతోష పడడొ, |
| పగల బొగులడొ, యేది కావలయు ననడొ, |
| పాప పుణ్యఫలంబులబాయు నెవడొ, |
| భక్తు డాతడె ప్రియమైనవాడు నాకు. |
|
| |
|
| 18. |
| శత్రు మిత్రుల యెడ సమస్వాంతు డెవడొ, |
| మన్ననల తెగడికల సమాను డెవడొ, |
| శీత తాపము లందునస్థిరు డెవండొ, |
| సంగరహితుడు సుఖదుఃఖసము డెవండొ; |
|
| |
|
| 19. |
| స్తుతియు నిందల యందునతుల్యు డెవడొ, |
| కలిగి నంతకె తుష్టినిగాంచు నెవడొ, |
| స్థిరమతియు, మౌని యెవ్వ డస్థిర నివాసి, |
| అతడె ప్రియభక్తుడగు నరులందు నాకు. |
|
| |
|
| 20. |
| ఇట్టి ధర్మ్యా మృతము భక్తులెవరు గాని, |
| శ్రద్ధ మీఱగ మత్పరాసక్తి తోడ, |
| చెప్పురీతి నుపాసనజేయు వారొ, |
| అట్టి భక్తులు నాకు నత్యంత ప్రియులు. |
|
| |
|
|
| |
| 1. |
| ఏవం సతతయుక్తా యే |
| భక్తాస్త్వాం పర్యుపాసతే |
| యే చాప్యక్షరమవ్యక్తం |
| తేషాం కే యోగవిత్తమాః |
|
| |
|
| 2. |
| మయ్యావేశ్య మనో యే మాం |
| నిత్యయుక్తా ఉపాసతే |
| శ్రద్ధయా పరయోపేతాస్తే |
| మే యుక్తతమా మతాః |
|
| |
|
| 3. |
| యే త్వక్షరమనిర్దేశ్య |
| మవ్యక్తం పర్యుపాసతే |
| సర్వత్రగమచిన్త్యం చ |
| కూటస్థమచలం ధ్రువమ్ |
|
| |
|
| 4. |
| సంనియమ్యేన్ద్రియగ్రామం |
| సర్వత్ర సమబుద్ధయః |
| తే ప్రాప్నువన్తి మామేవ |
| సర్వభూతహితే రతాః |
|
| |
|
| 5. |
| క్లేశోఽధికతరస్తేషా |
| మవ్యక్తాసక్తచేతసామ్ |
| అవ్యక్తా హి గతిర్దుఃఖం |
| దేహవద్భిరవాప్యతే |
|
| |
|
| 6. |
| యే తు సర్వాణి కర్మాణి |
| మయి సంన్యస్య మత్పరాః |
| అనన్యేనైవ యోగేన |
| మాం ధ్యాయన్త ఉపాసతే |
|
| |
|
| 7. |
| తేషామహం సముద్ధర్తా |
| మృత్యుసంసారసాగరాత్ |
| భవామి నచిరాత్పార్థ |
| మయ్యావేశితచేతసామ్ |
|
| |
|
| 8. |
| మయ్యేవ మన ఆధత్స్వ |
| మయి బుద్ధిం నివేశయ |
| నివసిష్యసి మయ్యేవ |
| అత ఊర్ధ్వం న సంశయః |
|
| |
|
| 9. |
| అథ చిత్తం సమాధాతుం |
| న శక్నోషి మయి స్థిరమ్ |
| అభ్యాసయోగేన తతో |
| మామిచ్ఛాప్తుం ధనంజయ ౯ |
|
| |
|
| 10. |
| అభ్యాసేఽప్యసమర్థోఽ |
| సి మత్కర్మపరమో భవ |
| మదర్థమపి కర్మాణి |
| కుర్వన్సిద్ధిమవాప్స్యసి ౦ |
|
| |
|
| 11. |
| అథైతదప్యశక్తోఽసి |
| కర్తుం మద్యోగమాశ్రితః |
| సర్వకర్మఫలత్యాగం |
| తతః కురు యతాత్మవాన్ |
|
| |
|
| 12. |
| శ్రేయో హి జ్ఞానమభ్యాసా |
| జ్జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
| ధ్యానాత్కర్మఫలత్యాగ |
| స్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ |
|
| |
|
| 13. |
| అద్వేష్టా సర్వభూతానాం |
| మైత్రః కరుణ ఏవ చ |
| నిర్మమో నిరహంకారః |
| సమదుఃఖసుఖః క్షమీ |
|
| |
|
| 14. |
| సంతుష్టః సతతం యోగీ |
| యతాత్మా దృఢనిశ్చయః |
| మయ్యర్పితమనోబుద్ధి |
| ర్యో మద్భక్తః స మే ప్రియః |
|
| |
|
| 15. |
| యస్మాన్నోద్విజతే లోకో |
| లోకాన్నోద్విజతే చ యః |
| హర్షామర్షభయోద్వేగై |
| ర్ముక్తో యః స చ మే ప్రియః |
Play This Verse |
| |
|
| 16. |
| అనపేక్షః శుచిర్దక్ష |
| ఉదాసీనో గతవ్యథః |
| సర్వారమ్భపరిత్యాగీ |
| యో మద్భక్తః స మే ప్రియః |
|
| |
|
| 17. |
| యో న హృష్యతి న ద్వేష్టి |
| న శోచతి న కాఙ్క్షతి |
| శుభాశుభపరిత్యాగీ |
| భక్తిమాన్యః స మే ప్రియః |
|
| |
|
| 18. |
| సమః శత్రౌ చ మిత్రే చ |
| తథా మానాపమానయోః |
| శీతోష్ణసుఖదుఃఖేషు |
| సమః సఙ్గవివర్జితః |
|
| |
|
| 19. |
| తుల్యనిన్దాస్తుతిర్మౌనీ |
| సన్తుష్టో యేన కేనచిత్ |
| అనికేతః స్థిరమతి |
| ర్భక్తిమాన్మే ప్రియో నరః ౯ |
|
| |
|
| 20. |
| యే తు ధర్మ్యామృతమిదం |
| యథోక్తం పర్యుపాసతే |
| శ్రద్దధానా మత్పరమా |
| భక్తాస్తేఽతీవ మే ప్రియాః ౦ |
|
| |
|
|