| |
| 1. అర్జునుడనెను: |
| దేవ! నా యందు కరుణార్ద్ర దృష్టి నెఱపి, |
| అతిరహస్యము, పరమ మ ధ్యాత్మికమును, |
| అమృత వాక్కుల తత్త్వ మీ వాన తీయ, |
| తొలగె దానిచే నామోహ ధూమ మెల్ల |
Play This Verse |
| |
|
| 2. |
| భూతములు సృష్టిలయములు బొందు విధము, |
| విస్తరంబుగ నీ నుండి వింటి నేను, |
| అవ్యయంబైన నీదు మాహాత్మ్యములను, |
| కమల పత్రాక్ష! వింటి నా కలత దీఱ |
Play This Verse |
| |
|
| 3. |
| ఈశ్వరా! ఆత్మ తత్త్వము నెట్టి దీవు |
| చెపితివో, యట్లె యది విశ్వ సింతుగాని, |
| వఱలు నైశ్వరశక్తి రూ పమును నీది, |
| కన్నులారంగ గన నాకు కలిగె కోర్కె |
Play This Verse |
| |
|
| 4. |
| ప్రభువ! నీ దివ్య విశ్వరూ పమును జూడ, |
| తగుదు నేనని నీమది తలతు వేని, |
| అవ్యయంబైన నీ జగ దాత్మ రూప |
| మిపుడు దర్శన మిమ్ము యో గేశ్వర! హరి! |
Play This Verse |
| |
|
| 5. శ్రీ భగవానుడనెను: |
| బహు విధములైన, వర్ణ రూ పముల తోడ |
| అలరు చుండెడు నాదు ది వ్యాకృతులను, |
| వందలును వేలు గాగల వాని నెల్ల, |
| చూడ మనసైన నర్జునా ! చూడు మిపుడు |
|
| |
|
| 6. |
| చూడు ద్వాదశా దిత్యుల చూడు వసుల, |
| రుద్ర మరు దశ్వినీ కుమారులను జూడు, |
| ఎవ్వరును పూర్వమందు ద ర్శింప నట్టి |
| చోద్యములు నీవు పెక్కింటి చూడు పార్థ! |
|
| |
|
| 7. |
| అర్జునా! సచరాచర మైన జగతి, |
| యంతయును గూడ, నా దేహ మందె యిపుడు, |
| కూడి యొకచోట నున్నది చూడు మీవు, |
| చూడ నింకేది కోరుదో చూడు దాని |
|
| |
|
| 8. |
| పార్థ! నా దివ్య విశ్వరూ పమును జూడ, |
| శక్తుడవు గావు నీ స్థూల చక్షువులను, |
| దివ్య నేత్రములను బ్రసా దింతు నీకు, |
| నాదు యోగైశ్వరమును క న్నార గనుము |
Play This Verse |
| |
|
| 9. సంజయుడనెను: |
| ఇట్లు పల్కుచు ధృతరాష్ట్ర నృపతి! వినుమ, |
| పరమ యోగేశ్వరుడు శ్రీ హరియు నంత, |
| పరమ మైశ్వర విశ్వరూ పమును జూపె, |
| అద్భుతముగొల్ప నెంతయు నర్జునునకు |
Play This Verse |
| |
|
| 10. |
| కలయ ముఖములు కను లనే కములు మెఱయ, |
| అద్భుతముగొల్ప నైక దృ శ్యముల తోడ, |
| విమల దివ్యాభరణములు వేలు దాల్చి, |
| వెలయు దివ్యాయుధములు వే వేల నెత్తి |
|
| |
|
| 11. |
| దివ్యమాల్యాంబరంబులు దీప్తులెసగ, |
| దివ్యగంధాను లేపముల్ తేజరిలగ, |
| అద్భుతముగొల్పు దీప్తమ నంత మైన, |
| విశ్వతోముఖ రూపము వెలయ జూపె |
|
| |
|
| 12. |
| వే వెలుంగుల ఱేడులు వేయి మంది, |
| మింట నొక సారె యేకమై మెఱతు రేని, |
| పొడము నా కాంతి కొక్కింత బోలు నేమొ, |
| ఆ మహాత్ముని తేజ మ ట్లలరు నపుడు |
|
| |
|
| 13. |
| దేవ పితృ మనుష్యాదుల దేజ రిలుచు |
| బహువిధంబుల విభజింప బడిన జగతి, |
| దేవదేవుని యాదివ్య దేహ మందు, |
| కూడి యొకచోటను న్నట్లు క్రీడి చూచె |
|
| |
|
| 14. |
| అంత గనియట్లు, విస్మయస్వాంతు డగుచు, |
| హర్షపులకితగాత్రుడై యర్జునుండు, |
| హరికి తలవంచి, ప్రణతుల నాచరించి, |
| అంజలి ఘటించి యిట్లు మా టాడ సాగె |
|
| |
|
| 15. |
| దేవ! కనుచుంటి, నీ దివ్య దేహ మందు, |
| సకల దేవతలను, భూత సంఘములను, |
| కంటి బ్రహ్మను నీ నాభి కమలమందు, |
| సకల ఋషులను, మఱి దివ్య సర్పములను |
|
| |
|
| 16. |
| బహుభుజోదర ముఖనేత్ర భాసితునిగ, |
| అంతటను జూతు నీదు అనంత రూపు, |
| ఆదిమధ్యాంతములు, నీవి యరయజాల, |
| విశ్వమయదేవ! విశ్వేశ! విశ్వరూప! |
|
| |
|
| 17. |
| ఘనకిరీటము, గదయు, చ క్రమును దాల్చి, |
| కాంతిప్రోవైన సర్వ ప్ర కాశకునిగ, |
| సూర్యు, డగ్నియు వలె మండి చూడ రాని, |
| అప్రమేయుడ నిను గాంతు నన్ని దిశల |
|
| |
|
| 18. |
| పరుడవును వేదితవ్యుడ వవ్యయుడవు, |
| పెన్నిధివి నీవె దేవ! యీ విశ్వమునకు, |
| అక్షరుడవు శాశ్వత ధర్మ రక్షకుడవు, |
| మిమ్ముల పురాణ పురుషుడిగానమ్మియుంటి. |
|
| |
|
| 19. |
| ఆది మధ్యాంత రహిత! య నంత వీర్య! |
| అర్కశశిధరనేత్ర! య నంత బాహు! |
| దీప్తపావకవక్త్ర! స్వ తేజమునను, |
| వేపు చుంటివి చూడ, నీ విశ్వమంత |
|
| |
|
| 20. |
| దివి, భువియు నంతరాళము దిక్కు లన్ని, |
| నిండుకొనె, నీ యొకనిచేత నే మహాత్మ! |
| ఉగ్రమద్భుతమైన నీ విగ్రహమును, |
| కాంచి ముల్లోకములు భయ కంపమొందె |
|
| |
|
| 21. |
| భయముతో మ్రొక్కి కొందఱు ప్రస్తుతింప, |
| చూతు చేరంగ నిన్నె యీ సురగణంబు, |
| స్వస్తి యని పల్కి ఋషి సిద్ధ సంఘములును, |
| పుష్కలస్తోత్రముల నిన్ను పొగడు చుండె |
|
| |
|
| 22. |
| రుద్రు, లాదిత్యులు, వసు మ రుద్గణములు, |
| సాధ్యగంధర్వ సిద్ధు లూ ష్మపులు మఱియు, |
| అసుర, యక్ష విశ్వదేవు లాశ్వినులును, |
| నిన్నుజూచి విస్మయ మొందినిలిచి రట్లె. |
|
| |
|
| 23. |
| బహుళముఖనేత్ర బాహూరు పాద హస్త!, |
| ఘోరదంష్ట్రాకరాళ! నీ గొప్పరూపు |
| కనగ భయమయ్యె నాకు లో కముల కెల్ల |
| ఓ మహాబాహు! ఓ విభూ! ఓ యనంత! |
|
| |
|
| 24. |
| వెడద మొగముల విప్పారి వెలుగు కనుల, |
| దివిని దాకుచు బహువర్ణ దీప్తమైన, |
| విష్ణు! నీదు రూపము గాంచి వెఱపు నొంది, |
| ధైర్యమును, శాంతి, నామది తప్పియుంటి |
|
| |
|
| 25. |
| భయద దంష్త్రల వెల్గు నీ వదనగుహలు, |
| ప్రజ్వరిల్లగ కాలాగ్ని పగిది, జూచి, |
| దిశల కనజాల నాకు శాం తియును లేదు, |
| కరుణ జూడుము నన్ను జ గన్నివాస! |
|
| |
|
| 26. |
| ధార్తరాష్ట్రులు నందఱు ధరణి పతులు, |
| భీష్ముడును, ద్రోణుడును, సూతు ప్రియసుతుండు |
| చూడ మావారిలో మేటి జోదులెల్ల, |
| యిందు సమకూడియున్నవా రంద ఱట్లె; |
|
| |
|
| 27. |
| భయద దంష్త్రల వెల్చు నీ వదనగుహల, |
| సత్వరమె చేర పర్వుతో సాగుచుండ్రి, |
| దంతసంధుల కొందఱు తగులు కొనగ, |
| చూడ కొందఱి శిరములు చూర్ణమయ్యె |
|
| |
|
| 28. |
| జలధి జేరగ బహునదీ జలము లెట్లు, |
| సాగరము వంక వేగమే సాగి పాఱు, |
| విజ్వలంబగు నీవక్త్ర బిలములందు, |
| చేర పర్వుదు రీ నర వీరు లట్లె |
|
| |
|
| 29. |
| మండు మంటల మిడుతల దండులెట్లు, |
| వేగవ్రాలుచు నవి యన్ని విలయ మొందు, |
| ప్రాణిచయ మట్లె నీదు వ క్త్రముల జొరగ, |
| నతిరయమ్మున బర్విడి యంత మొందు |
|
| |
|
| 30. |
| జ్వలితముఖముల దిశలన్ని వ్యాప్తి బఱపి, |
| నాకుచును, మ్రింగు దీవెల్ల లోకములను, |
| జగతి నంతయు కాంతిపుం జముల నింపి, |
| విష్ణు! నీ యుగ్రదీప్తులు వేపు చుండె |
|
| |
|
| 31. |
| ఉగ్రరూపుడ! దేవ! య నుగ్రహించి, |
| చెప్పు మెవ రీవు, ప్రణతులు సేతు నీకు, |
| అరయ గోరెద మిమ్ము నే నాది పురుష! |
| ఎఱుగ నైతిని నీ యీ ప్ర వృత్తులేవి |
|
| |
|
| 32. శ్రీ భగవానుడనెను: |
| ప్రబలకాలుడ, లోక వి ధ్వంసకుడను, |
| తుడిచి వేయగ లోకాల కడగినాడ, |
| యుద్ధమున జంప కీ వూర కున్న గూడ, |
| ఉండబో రిందు ప్రతిపక్ష యోధు లెవరు |
|
| |
|
| 33. |
| కాన రిపుల గెల్వుము లెమ్ము కలుగు కీర్తి, |
| రహిని భోగింపు రిపుశూన్య రాజ్య రమను, |
| శత్రువులు ముందె నాచేత సమసి నారు, |
| ఇక నిమిత్తమాత్రుడవె నీ విద్ధ చరిత |
|
| |
|
| 34. |
| ద్రోణ భీష్ములును జయద్ర ధుండు మఱియు, |
| సూతసుతు డాదిగా గల శూరవరుల, |
| చంపితిని ముందె నీవిక చంపువారి, |
| భయపడక పోరు శత్రు వి జయము నీదె. |
|
| |
|
| 35. |
| అట్టి కేశవు మాటల నాలకించి |
| అంజలి ఘటించి వడకుచునర్జునుండు, |
| హరికి మ్రొక్కుచు మరల మా టాడె నిట్లు, |
| భీతి గద్గదస్వరముతో వినతు డగుచు. |
|
| |
|
| 36. |
| హెచ్చరిక లీవె గొన హృషీ కేశ! తగుదు |
| జగము కీర్తించు నిన్నెంతొ సంతసమున, |
| వెఱచి దిక్కుల రక్కసుల్ వేగ బర్వ, |
| సిద్ధసంఘము లన్నియున్ చేరి మ్రొక్కు. |
Play This Verse |
| |
|
| 37. |
| ఓ జగన్నివాస! అనంత! ఓ మహాత్మ! |
| శ్రేష్ఠుడవు, బ్రహ్మకును నీవె సృష్టికర్త, |
| సదసదుల కతీతుడవు న క్షరుడ వీవె, |
| ఏల మ్రొక్కకయుంద్రు దే వేశ! నీకు. |
Play This Verse |
| |
|
| 38. |
| ఆదిదేవుడ వీవె య నాది పురుష! |
| పరమమాశ్రయమీవె వి శ్వమున కెల్ల, |
| వేత్తయును పరంధాముడ వేద్యుడీవు, |
| వ్యాప్తమైయుంటి వీ విశ్వ మంత నీవె. |
Play This Verse |
| |
|
| 39. |
| వాయు వగ్నియు యముడును వరుణ శశులు |
| బ్రహ్మకును దండ్రియును బ్రజా పతియు నీవె, |
| సాగి మ్రొక్కెద నే వేయి సార్లు నీకు, |
| మరల మరలను నీకు న మస్కరింతు. |
Play This Verse |
| |
|
| 40. |
| సర్వశక్తి పరాక్రమ సర్వ రూప! |
| విశ్వమంతయు వ్యాప్తమై వెలయు దేవ! |
| ముందు వెనుకల నీ కివె వందనములు, |
| అన్ని వైపుల వందన మాచరింతు. |
Play This Verse |
| |
|
| 41. |
| ఇట్టి మహిమలు నీవి నే నెఱుగ లేక, |
| చెలిమిచే గాని పొరపాటు చేతగాని, |
| రార చెలికాడ! యాదవా రార కృష్ణ! |
| అని పిలిచి నిన్ను నే మేల మాడి యుంటి. |
Play This Verse |
| |
|
| 42. |
| ఆసనాహార శయ్యా వి హారములను, |
| ఒంటరిగ నున్ననో, యొరు లున్నయపుడొ, |
| అపహసించితి నిన్ను నే నవగణించి, |
| అట్టి వెల్లను క్షమియింపు మప్రమేయ. |
Play This Verse |
| |
|
| 43. |
| జనకుడవు చరాచరసర్వ జగతి కీవు, |
| గురుడవు గరిష్టుడవు పూజ్య పురుషు డీవు, |
| లేడు సముడె నీకన మించు వా డికేడ, |
| త్రిజగముల యందు నతుల శ క్తి ప్రభావ. |
Play This Verse |
| |
|
| 44. |
| కాన మ్రొక్కెద సాగిలి కరుణ జూడు, |
| వందనీయుడ నిను వేడు కొందు నీశ! |
| తనయు బితవలె సఖుని మి త్రమ్ము వోలె, |
| సతిని పతి భంగి నా తప్పు సైపు దేవ. |
Play This Verse |
| |
|
| 45. |
| నీ యపూర్వ స్వరూపమె నెమ్మి గంటి, |
| కాని మనసెంతయును భయ కంపమొందె, |
| నన్ను కరుణించి దేవ! జ గన్నివాస! |
| చూపు నీ పూర్వరూపమే సొంపు మీఱ. |
Play This Verse |
| |
|
| 46. |
| ఘనకిరీటము గదయు చ క్రమును దాల్చి |
| పూర్వరూపముతో చతు ర్భుజుని గాను, |
| కాంచగా నిన్ను వేడుక గలిగె నకు, |
| వేయిచేతులస్వామి! ఓ విశ్వమూర్తి. |
Play This Verse |
| |
|
| 47. |
| విజయ! నా ప్రసన్నతను జూ పితిని నీకు, |
| ఆద్యమును కాంతిపూర్ణ మ నంత మైన |
| పరమ రూపము నాయోగ బలము చేత |
| కాంచరిది పూర్వమీవు గా కన్యు లెవరు. |
|
| |
|
| 48. |
| శ్రుతుల జదివియు, వేల్చియున్ క్రతులొనర్చి, |
| ఉగ్రతప మొనర్చియు దాన మొసగి యైన |
| కన నసాధ్యుడ నీనృలోక కమున నేను, |
| ఇట్టి రూపున నీకుగా కితరులకును. |
|
| |
|
| 49. |
| ఇట్టి నాఘోరరూప మీ క్షించి నీవు, |
| వ్యథను జెందకు, మూఢ భా వమ్ము వదలు, |
| భీతి సెందక మదిని సం ప్రీతి నొంది, |
| మరల నాపూర్వరూపమే తిరిగి చూడు. |
Play This Verse |
| |
|
| 50. |
| వాసుదేవు డర్జునునితో పల్కి యిట్లు, |
| శాంత రూపున మరల ద ర్శన మొసంగె, |
| సౌమ్యు డగుచు నూరార్చె విశ్వాత్ము డపుడు, |
| భయము సెందియున్న భీ భత్సు జూచి. |
|
| |
|
| 51. |
| ఇట్టి నీ సౌమ్యమానుషా కృతిని నేను, |
| కంటి చూపగ మరల నో కమల నయన! |
| కూడె శాంతియు ప్రాణము కుదుట బడెను, |
| స్వస్థచిత్తుడనైతి నో శాంత మూర్తి. |
|
| |
|
| 52. |
| ఇప్పు డీవు గనిన రూప మేది గలదొ, |
| యెంతయును దుర్లభ మది ద ర్శింపగాను, |
| దేవతలు గూడ యిట్టి నా దివ్య రూపు |
| చూడ నిత్యము కాంక్షించు చుంద్రు లెస్స. |
Play This Verse |
| |
|
| 53. |
| వేర తపముల దానాది విధుల చేత, |
| యజ్ఞ కర్మములను జేసి యైన గాని, |
| ప్రీతి నన్నిప్పు డెట్లు ద ర్సించినావొ, |
| అట్టి రూపున దర్శింప నలవి గాను. |
|
| |
|
| 54. |
| ఇవ్విధంబున నారూప మెఱగుటకును, |
| నన్ను దర్శింప నైక్యమై నన్నె పొంద, |
| అన్యచింతన చేత నే నలవి గాను, |
| పార్థ! సులభుడ కేవల భక్తి చేత. |
Play This Verse |
| |
|
| 55. |
| సంగమును వీడి నాకర్మ సలుపు నెవడు, |
| పరమ సంప్రాప్యు నను నమ్ము భక్తు డెవడు, |
| ప్రాణచయ మందు నిర్వైర భావు డెవడు, |
| వాడె నను పొంద జాలిన వాడు పార్థ! |
Play This Verse |
| |
|