| |
| 1. శ్రీ భగవానుడనెను: |
| అర్జునా! యిది మరల నీవాలకింపు |
| పరమ తత్త్వము గూర్చి నాప్రవచనమును, |
| ప్రీతి తోడను నామాటవినెదు గాన, |
| మదిని నీ హితమెంచి చెప్పుదును దీని. |
|
| |
|
| 2. |
| సురగణము గాని మఱిమహర్షులును గాని, |
| ఎట్టిరును గూడ, నాపుట్టువెఱుగ లేరు |
| ఋషిగణమునకు, దేవతలెల్లరకును, |
| అన్ని విధముల నేనాదినగుట జేసి. |
|
| |
|
| 3. |
| ఆదిరహితుడ నంచు, నేనజుడ నంచు, |
| ఎవ్వడెఱుగునొ, సర్వలోకేశు నన్ను, |
| మర్త్యు లం దతడు, విమూఢమతుడు గాక, |
| సర్వపాప విముక్తుడైచనుచు నుండు. |
|
| |
|
| 4. |
| బుద్ధియును, జ్ఞానమును, నసమ్మోహనమును, |
| క్షమయు సత్యము, దమమునుశమము మఱియు, |
| జన్మమృత్యువు, సుఖదుఃఖసంఘములును, |
| భయము,నభయము,మొదలగుద్వంద్వములును. |
|
| |
|
| 5. |
| తుష్టియు, నహింస, సమభావదృష్టియుంట, |
| తపము, దానము, యశమునునపయశంబు, |
| బహువిధములైన భూత భావంబు లెల్ల, |
| ప్రభవ మొందునునానుండెబయలు మెఱసి. |
|
| |
|
| 6. |
| సనక ముఖ్యులు నల్వురున్సప్తఋషులు, |
| మాన్యులౌ పదునల్వురుమనువు లట్లె, |
| మన్మనోబల సంకల్పజన్ము లగుట, |
| వారి సంతాన మీ లోక వాసులైరి |
|
| |
|
| 7. |
| నా విభూతులు యోగప్రభావములును, |
| ఎవ్వడు యథార్థముగ మదినెఱుగ గలడొ, |
| అతడు నిశ్చలుడై యోగమందు నిలుచు, |
| లేదు సందియ మిందునలేశ మైన. |
|
| |
|
| 8. |
| సర్వజగతికి, నుద్భవస్థాన మేను, |
| వెడలు సర్వము నానుండివిస్తరించి, |
| ఇట్లు మది నన్ను పండితులెఱిగి యుండి, |
| భక్తి భజియింత్రు పరమార్థభావ నిరతి. |
|
| |
|
| 9. |
| మద్గతప్రాణ చిత్తులైమామకీన |
| గుణము లన్యోన్యముగ జెప్పుకొనుచు నుండి, |
| సతత సంకీర్తనము నన్నుసలుపువారు, |
| ఆత్మరతిదేలి సంతుష్టిననుభవింత్రు. |
|
| |
|
| 10. |
| నిత్య మెవ్వరు నన్నేకనిష్ఠ తోడ, |
| భక్తి సేవింతురో ప్రీతిభావ మెసగ, |
| వారి కా బుద్ధియోగ మేర్పడగ నిత్తు, |
| చేరుకొన నట్టియోగముచేత నన్ను. |
Play This Verse |
| |
|
| 11. |
| కేవలము భక్తు లందలికృపను జేసి |
| వారి యజ్ఞాన జన్యాంధకార మెల్ల, |
| వారి హృది నేను నెలకొని వమ్ము సేతు, |
| భాసురంబగు జ్ఞాన దీపంబు చేత. |
Play This Verse |
| |
|
| 12. అర్జునుడనెను: |
| పరమధాముడవును, పరంబ్రహ్మ మీవు, |
| పరమపావనుడవు, శ్రేష్ఠపదము నీవు, |
| దివ్య పురుషుడ వీవాదిదేవుడవును, |
| విశ్వ విభుడవు, నజుడవుశాశ్వతుడవు. |
|
| |
|
| 13. |
| ఇట్లు నిను గూర్చి ఋషి సంఘమెఱుక జెప్పె, |
| దేవ ఋషి నారదుం డట్లెతెలియ జేసె, |
| అసిత దేవల వ్యాసులునట్లె యనిరి, |
| నీవె స్వయముగా జెప్పుచున్నావు నేడు. |
|
| |
|
| 14. |
| ఎట్టి యుపదేశ మీవు నాకిచ్చు చుంటి |
| వదియు సర్వము నే నిజమని దలంతు, |
| నీ విభూతి స్వరూపముల్నీరజాక్ష! |
| దేవతలు దానవులు కూడ తెలియ లేరు. |
|
| |
|
| 15. |
| నీవె స్వయముగా నెఱుగుదునిన్ను గూర్చి, |
| తెలియ జాలారు నొరులిట్లుదేవ దేవ! |
| భూతభావన!భూతేశ!భూతనాథ! |
| ఓ జగత్పతి! ఓ పురుషోత్తమాఖ్య. |
|
| |
|
| 16. |
| ఏ విభూతులు జేపట్టియెల్ల నిండి, |
| వ్యాప్తమైయుంటి లోకములన్ని నీవె, |
| దివ్య మౌ నీ విభూతులుతెలియ నాకు |
| చెప్ప నర్హుడ వీవె నిశ్శేషముగను. |
|
| |
|
| 17. |
| ఒనర నిత్యము విడక నేయోగివర్య! |
| ఎట్టి చింతన చేత నిన్నెఱుగ నేర్తు, |
| పరగ నే యే విభూతి భావములచేత, |
| చింత్యుడవు భగవానుడా!చేర నిన్ను. |
|
| |
|
| 18. |
| అమృత మయమైన నీవాక్కులాలకింప, |
| తనివి తీరదు మరల నేవినగదలతు, |
| నీ విభూతులు, యోగముల్నీరజాక్ష! |
| విస్తరించి వచింపు మావినతి సేతు. |
|
| |
|
| 19. శ్రీ భగవానుడనెను: |
| దివ్యమౌ నావిభూతులుదెలిసి కొనగ |
| కలదె యంతము వానికికౌరవేంద్ర! |
| ముఖ్యమౌ నాదుమాహాత్మ్యములను కొన్ని, |
| చెప్పెదను నీకు కురుకులశ్రేష్ఠ!వినుమ. |
|
| |
|
| 20. |
| సకలభూతముల హృదయస్థానమందు |
| ప్రత్యగాత్మగ వెలిగెడుప్రభుడ నేను, |
| జగతి యందలి యీభూతజాలమునకు |
| ఆది మధ్యావసానములన్ని నేనె. |
Play This Verse |
| |
|
| 21. |
| విజయ!ఆదిత్యులందునవిష్ణు నేను, |
| రశ్మిగల యంశుమంతులరవిని నేను, |
| వీచు మారుతములలో మరీచి నేను, |
| చుక్కలందున శశిని రేజ్యోతి నేను. |
|
| |
|
| 22. |
| వేదములు నాల్గిటను సామవేద మేను, |
| వాసవుడనేను సకల దేవతలయందు, |
| నింద్రియము లందు నే మనఇంద్రియమును |
| భూతములయందు నే నౌదుచేతనమును. |
|
| |
|
| 23. |
| రుద్రులేకాదశుల శంకరుడను నేను, |
| యక్షరాక్షసుల ధనదుడనెడు వాడ, |
| అష్ట వసువులలో పావకాఖ్యు డేను, |
| శిఖరిణుల యందు నే మేరుశిఖిరి నౌదు. |
|
| |
|
| 24. |
| ఎఱుగవలె దేవతల పురోహితులయందు, |
| ప్రముఖుడను ఫల్గునా!బృహస్పతిని నేను, |
| సర్వసేనాధిపతులందుస్కందు డేను, |
| సరసు లందున మిన్నయౌసాగరమను. |
|
| |
|
| 25. |
| భృగు వనెడు వాడ నే మహాఋషుల యందు, |
| ఏకవర్ణము లందు `ఓంకృతిని నేను, |
| యజ్ఞములయందు జపరూపయజ్ఞ మేను, |
| స్థావరము లందు నే హిమాచలము నైతి. |
|
| |
|
| 26. |
| సర్వవృక్షములందు నశ్వత్థ మేను, |
| నారదుడను దేవర్షి గణంబు నందు, |
| చిత్రరథుడను గంధర్వ సీమ పతుల, |
| కపిల మునివర్యుడను, సిద్ధగణము నందు. |
|
| |
|
| 27. |
| అమృత మందుండి యుద్భవమైన యట్టి, |
| అశ్వ ముచ్చైశ్రవసమ నేహయము లందు, |
| ఇంద్రునైరావతమను గజేంద్రు లందు, |
| ఎఱుగవలె నన్ను నరులందునృపుని గాను. |
|
| |
|
| 28. |
| ఆయుధము లందు నేను వజ్రాయుధమను, |
| కోర్కెలను దీర్చు వేల్ప్లులగోవు నేను, |
| ధర్మ సంతాన మొసగు కం దర్పు డేను, |
| వాసుకిని ఏకశీర్ష సర్పంబు లందు. |
|
| |
|
| 29. |
| ఔ దనంతుడ నాగములందు నేను, |
| వరుణుడను సకలవన దేవతల యందు, |
| అరయుమీ నన్ను పితరు లందర్యమునిగ, |
| యముడ శాసించు వారలయందు నేను. |
|
| |
|
| 30. |
| దైత్యులందు బ్రహ్లాదు గాదలపు నన్ను, |
| గణికవరు లందు తెలియుముకాలునిగను, |
| ఎంచు జంతువు లందు మృగేంద్రు గాను, |
| పక్షిగణ మందు నన్ను సుపర్ణు గాను. |
|
| |
|
| 31. |
| పావనము జేయు వారిలోపవను డేను, |
| శస్త్రపాణులలో రామచంద్రు డేను, |
| మత్స్యజాతుల యందునమకర మేను, |
| భవ్యనదులందు గంగాస్రవంతి నేను. |
|
| |
|
| 32. |
| పుట్టుకలుగల యీ విశ్వభూతములకు, |
| ఆదిమధ్యావసానములైన నేనె, |
| విద్యలందున నధ్యాత్మవిధ్య నేనె, |
| వాదముల తత్త్వనిర్ణయవాద మేను. |
|
| |
|
| 33. |
| అక్షరములందు నే `ఆకారాక్షరమను, |
| పదసమాసము లందు ద్వంద్వమును నేను, |
| అంతమే లేని కాల స్రవంతి నేను, |
| విశ్వతోముఖధాతనైవెలయు దేను. |
|
| |
|
| 34. |
| ఎల్ల జీవుల హరియించుమృతిని నేను, |
| అభ్యుదయశీలు రందు నేనభ్యుదయము, |
| స్త్రీల యందున గీర్తియుశ్రీయు వాక్కు, |
| స్మృతియు మేధము,క్షమమును ధృతిని నేను. |
|
| |
|
| 35. |
| సామగీతములన్,బృహత్సామ మేను, |
| ఛందములయందు గాయత్రిఛంద మేను, |
| మాసములయందు నే నౌదుమార్గశిరము, |
| ఋతువు లందన్నిట వసంతఋతువు నేను. |
|
| |
|
| 36. |
| వంచకుల యందు జూదపువ్యసన మేను, |
| తేజు గలవార లందలితేజ మేను, |
| యత్నమును నేను మఱి విజయమ్ము నేను, |
| సాత్త్వికులయందు విలసిల్లుసత్త్వగుణము. |
|
| |
|
| 37. |
| వాసుదేవుడ నే వృష్ణివంశజులను, |
| పంచ పాండవులందునపార్థు డేను, |
| వ్యాసముని నేను మౌన తత్త్వజ్ఞు లందు, |
| కవిని శుక్రుండ నీతి సూక్ష్మజ్ఞు లందు. |
|
| |
|
| 38. |
| దండనము సేయువారిలోదండ నీతి, |
| రాజ నీతిని జయశీలురందు నేను, |
| గుప్తవిషయాలలో మౌనగుణము నేను, |
| జ్ఖ్ఞానవంతుల భాసిల్లుజ్ఞాన మేను. |
|
| |
|
| 39. |
| భూతజాలము కిందెల్లహేతు వేదొ |
| బీజ మది నేనె తెలియుమువిజయ! నీవు, |
| జగతిగల చరాచర భూతజాల మందు, |
| నేను లేకున్న దొక్కటిలేనె లేదు. |
|
| |
|
| 40. |
| దివ్యమౌ నా విభూతులుదెలిసి కొనగ, |
| అంతమే లేదు వానికికుంతి పుత్ర! |
| అయ్యు, నా విభూతులవిషయమును గూర్చి, |
| చెప్పితిని నీకు, మిగుల సంక్షేపముగను. |
|
| |
|
| 41. |
| శ్రీయును విభూతి శక్తితోజెలగు చుండి, |
| వస్తు వెయ్యెది వసుధపైవఱలు నేను, |
| అయ్యదియ మామకీన తేజో శమునను, |
| సంభవంబని తెలియుము సవ్యసాచి! |
|
| |
|
| 42. |
| ఈవిభూతుల వివరముహెచ్చు గాను, |
| తెలియ నే కార్యమగును, కుంతీ కుమార! |
| యీ యఖిలవిశ్వ మేనె వ్యాపించి యుంటి, |
| ఒక్క యంశమ్ము చేతనేయొనర దాల్చి. |
|
| |
|
|
| |
| 1. శ్రీభగవానువాచ: |
| భూయ ఏవ మహాబాహో |
| శృణు మే పరమం వచః |
| యత్తేఽహం ప్రీయమాణాయ |
| వక్ష్యామి హితకామ్యయా ౦ |
|
| |
|
| 2. |
| న మే విదుః సురగణాః |
| ప్రభవం న మహర్షయః |
| అహమాదిర్హి దేవానాం |
| మహర్షీణాం చ సర్వశః ౦ |
|
| |
|
| 3. |
| యో మామజమనాదిం |
| చ వేత్తి లోకమహేశ్వరమ్ |
| అసంమూఢః స మర్త్యేషు |
| సర్వపాపైః ప్రముచ్యతే ౦ |
|
| |
|
| 4. |
| బుద్ధిర్జ్ఞానమసంమోహః |
| క్షమా సత్యం దమః శమః |
| సుఖం దుఃఖం భవోఽభావో |
| భయం చాభయమేవ చ ౦ |
|
| |
|
| 5. |
| అహింసా సమతా తుష్టి |
| స్తపో దానం యశోఽయశః |
| భవన్తి భావా భూతానాం |
| మత్త ఏవ పృథగ్విధాః ౦ |
|
| |
|
| 6. |
| మహర్షయః సప్త పూర్వే |
| చత్వారో మనవస్తథా |
| మద్భావా మానసా జాతా |
| యేషాం లోక ఇమాః ప్రజాః ౦ |
|
| |
|
| 7. |
| ఏతాం విభూతిం యోగం |
| చ మమ యో వేత్తి తత్త్వతః |
| సోఽవికమ్పేన యోగేన |
| యుజ్యతే నాత్ర సంశయః ౦ |
|
| |
|
| 8. |
| అహం సర్వస్య ప్రభవో |
| మత్తః సర్వం ప్రవర్తతే |
| ఇతి మత్వా భజన్తే మాం |
| బుధా భావసమన్వితాః ౦ |
|
| |
|
| 9. |
| మచ్చిత్తా మద్గతప్రాణా |
| బోధయన్తః పరస్పరమ్ |
| కథయన్తశ్చ మాం నిత్యం |
| తుష్యన్తి చ రమన్తి చ ౦ ౯ |
|
| |
|
| 10. |
| నిత్య మెవ్వరు నన్నేకనిష్ఠ తోడ, |
| భక్తి సేవింతురో ప్రీతిభావ మెసగ, |
| వారి కా బుద్ధియోగ మేర్పడగ నిత్తు, |
| చేరుకొన నట్టియోగముచేత నన్ను. |
Play This Verse |
| |
|
| 11. |
| తేషామేవానుకమ్పార్థ |
| మహమజ్ఞానజం తమః |
| నాశయామ్యాత్మభావస్థో |
| జ్ఞానదీపేన భాస్వతా ౦ |
Play This Verse |
| |
|
| 12. అర్జున ఉవాచ: |
| పరం బ్రహ్మ పరం ధామ |
| పవిత్రం పరమం భవాన్ |
| పురుషం శాశ్వతం దివ్య |
| మాదిదేవమజం విభుమ్ ౦ |
|
| |
|
| 13. |
| ఆహుస్త్వామృషయః సర్వే |
| దేవర్షిర్నారదస్తథా |
| అసితో దేవలో వ్యాసః |
| స్వయం చైవ బ్రవీషి మే ౦ |
|
| |
|
| 14. |
| సర్వమేతదృతం మన్యే |
| యన్మాం వదసి కేశవ |
| న హి తే భగవన్వ్యక్తిం |
| విదుర్దేవా న దానవాః ౦ |
|
| |
|
| 15. |
| స్వయమేవాత్మనాత్మానం |
| వేత్థ త్వం పురుషోత్తమ |
| భూతభావన భూతేశ |
| దేవదేవ జగత్పతే ౦ |
|
| |
|
| 16. |
| వక్తుమర్హస్యశేషేణ |
| దివ్యా హ్యాత్మవిభూతయః |
| యాభిర్విభూతిభిర్లోకా |
| నిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ౦ |
|
| |
|
| 17. |
| కథం విద్యామహం యోగిం |
| స్త్వాం సదా పరిచిన్తయన్ |
| కేషు కేషు చ భావేషు |
| చిన్త్యోఽసి భగవన్మయా ౦ |
|
| |
|
| 18. |
| విస్తరేణాత్మనో యోగం |
| విభూతిం చ జనార్దన |
| భూయః కథయ తృప్తిర్హి |
| శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ౦ |
|
| |
|
| 19. శ్రీభగవానువాచ: |
| హన్త తే కథయిష్యామి |
| దివ్యా హ్యాత్మవిభూతయః |
| ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ |
| నాస్త్యన్తో విస్తరస్య మే ౦ ౯ |
|
| |
|
| 20. |
| అహమాత్మా గుడాకేశ |
| సర్వభూతాశయస్థితః |
| అహమాదిశ్చ మధ్యం చ |
| భూతానామన్త ఏవ చ ౦ ౦ |
Play This Verse |
| |
|
| 21. |
| ఆదిత్యానామహం విష్ణు |
| ర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
| మరీచిర్మరుతామస్మి |
| నక్షత్రాణామహం శశీ ౦ |
|
| |
|
| 22. |
| వేదానాం సామవేదోఽస్మి |
| దేవానామస్మి వాసవః |
| ఇన్ద్రియాణాం మనశ్చాస్మి |
| భూతానామస్మి చేతనా ౦ |
|
| |
|
| 23. |
| రుద్రాణాం శంకరశ్చాస్మి |
| విత్తేశో యక్షరక్షసామ్ |
| వసూనాం పావకశ్చాస్మి |
| మేరుః శిఖరిణామహమ్ ౦ |
|
| |
|
| 24. |
| పురోధసాం చ ముఖ్యం |
| మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
| సేనానీనామహం స్కన్దః |
| సరసామస్మి సాగరః ౦ |
|
| |
|
| 25. |
| మహర్షీణాం భృగురహం |
| గిరామస్మ్యేకమక్షరమ్ |
| యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి |
| స్థావరాణాం హిమాలయః ౦ |
|
| |
|
| 26. |
| అశ్వత్థః సర్వవృక్షాణాం |
| దేవర్షీణాం చ నారదః |
| గన్ధర్వాణాం చిత్రరథః |
| సిద్ధానాం కపిలో మునిః ౦ |
|
| |
|
| 27. |
| ఉచ్చైఃశ్రవసమశ్వానాం |
| విద్ధి మామమృతోద్భవమ్ |
| ఐరావతం గజేన్ద్రాణాం |
| నరాణాం చ నరాధిపమ్ ౦ |
|
| |
|
| 28. |
| ఆయుధానామహం వజ్రం |
| ధేనూనామస్మి కామధుక్ |
| ప్రజనశ్చాస్మి కన్దర్పః |
| సర్పాణామస్మి వాసుకిః ౦ |
|
| |
|
| 29. |
| అనన్తశ్చాస్మి నాగానాం |
| వరుణో యాదసామహమ్ |
| పితౄణామర్యమా చాస్మి |
| యమః సంయమతామహమ్ ౦ ౯ |
|
| |
|
| 30. |
| ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం |
| కాలః కలయతామహమ్ |
| మృగాణాం చ మృగేన్ద్రోఽహం |
| వైనతేయశ్చ పక్షిణామ్ ౦ ౦ |
|
| |
|
| 31. |
| పవనః పవతామస్మి |
| రామః శస్త్రభృతామహమ్ |
| ఝషాణాం మకరశ్చాస్మి |
| స్రోతసామస్మి జాహ్నవీ ౦ |
|
| |
|
| 32. |
| సర్గాణామాదిరన్తశ్చ |
| మధ్యం చైవాహమర్జున |
| అధ్యాత్మవిద్యా విద్యానాం |
| వాదః ప్రవదతామహమ్ ౦ |
|
| |
|
| 33. |
| అక్షరాణామకారోఽస్మి |
| ద్వన్ద్వః సామాసికస్య చ |
| అహమేవాక్షయః కాలో |
| ధాతాహం విశ్వతోముఖః ౦ |
|
| |
|
| 34. |
| మృత్యుః సర్వహరశ్చా |
| హముద్భవశ్చ భవిష్యతామ్ |
| కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం |
| స్మృతిర్మేధా ధృతిః క్షమా ౦ |
|
| |
|
| 35. |
| బృహత్సామ తథా సామ్నాం |
| గాయత్రీ ఛన్దసామహమ్ |
| మాసానాం మార్గశీర్షోఽహ |
| మృతూనాం కుసుమాకరః ౦ |
|
| |
|
| 36. |
| ద్యూతం ఛలయతామస్మి |
| తేజస్తేజస్వినామహమ్ |
| జయోఽస్మి వ్యవసాయోఽస్మి |
| సత్త్వం సత్త్వవతామహమ్ ౦ |
|
| |
|
| 37. |
| వృష్ణీనాం వాసుదేవోఽస్మి |
| పాణ్డవానాం ధనంజయః |
| మునీనామప్యహం వ్యాసః |
| కవీనాముశనా కవిః ౦ |
|
| |
|
| 38. |
| దణ్డో దమయతామస్మి |
| నీతిరస్మి జిగీషతామ్ |
| మౌనం చైవాస్మి గుహ్యానాం |
| జ్ఞానం జ్ఞానవతామహమ్ ౦ |
|
| |
|
| 39. |
| యచ్చాపి సర్వభూతానాం |
| బీజం తదహమర్జున |
| న తదస్తి వినా యత్స్యా |
| న్మయా భూతం చరాచరమ్ ౦ ౯ |
|
| |
|
| 40. |
| నాన్తోఽస్తి మమ దివ్యానాం |
| విభూతీనాం పరన్తప |
| ఏష తూద్దేశతః ప్రోక్తో |
| విభూతేర్విస్తరో మయా ౦ ౦ |
|
| |
|
| 41. |
| యద్యద్విభూతిమత్సత్త్వం |
| శ్రీమదూర్జితమేవ వా |
| తత్తదేవావగచ్ఛ త్వం |
| మమ తేజోంఽశసంభవమ్ ౦ |
|
| |
|
| 42. |
| అథవా బహునైతేన |
| కిం జ్ఞాతేన తవార్జున |
| విష్టభ్యాహమిదం కృత్స్న |
| మేకాంశేన స్థితో జగత్ ౦ |
|
| |
|
|